Consequences of a Joint Loan : జాయింట్ లోన్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీ CIBIL స్కోర్ ఎఫెక్ట్ కావొచ్చు
Joint Loan Risks : జాయింట్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. అలా కాకూడదంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అవేంటో చూసేద్దాం.

Joint Loan Consequences : కొందరు బిజినెస్‌లో భాగంగా లేదా ఇతర అవసరాల కోసం జాయింట్ లోన్ తీసుకుంటారు. ఇది ఆ సమయానికి మంచిది కావొచ్చు కానీ.. ఫ్యూచర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖ్యంగా సీబిల్ స్కోర్ దెబ్బతింటుందని.. కొన్ని పరిస్థితుల్లో లీగల్ రిస్క్ కూడా ఉంటుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అసలు ఈ జాయింట్ లోన్ అంటే ఏమిటి? దానివల్ల కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.
జాయింట్ లోన్
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు కలిసి లోన్ని షేర్ చేసుకునేందుకు జాయింట్ లోన్ తీసుకోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో లైఫ్ పార్టనర్స్, బ్రదర్ లేదా సిస్టర్, బిజినెస్ పార్టనర్స్ కలిపి తీసుకుంటారు. అయితే ఈ జాయింట్ లోన్ని ఎవరైతే తీసుకుంటారో.. దానిని మళ్లీ తీర్చే బాధ్యత తీసుకున్న అందరిపై ఉంటుంది. ఈ జాయింట్ లోన్ని ఎక్కువగా ఇళ్లు, కారు, పర్సనల్ లోన్స్ సమయంలో ఎక్కువగా తీసుకుంటారు.
CIBIL స్కోర్‌పై ఎఫెక్ట్
మీరు జాయింట్ లోన్ తీసుకుంటే దానిలో ఏ వ్యక్తి అయినా దానిని తీర్చేందుకు వెనకాడితే ఆ లోన్ తీసుకున్నవారంతూ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పేమెంట్స్ కట్టకపోతే అందరి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. CIBIL స్కోర్ అనేది లోన్ ఎవరు కట్టలేదు అనేది చూడదు కాబట్టి అందరి CIBIL స్కోర్‌ని నెగిటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుంది.
ఈ తప్పులు చేయకండి
జాయింట్ లోన్ తీసుకున్నప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. లేదంటే సీబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఈఎంఐ డ్యూ డేట్ చెక్ చేసుకోవాలి. ఆ సమయానికి డబ్బులు రెడీ చేసుకోవాలి. క్రెడిట్ రిపోర్ట్ అలెర్ట్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎవరైనా ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉంటే బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇది హెల్ప్ అవుతుంది.
EMI లేట్‌గా కడితే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ వాడకం ఎక్కువగా ఉంటే స్కోరు తగ్గుతుంది. జాయింట్ లోన్స్ క్రెడిట్ ఎక్స్పోజర్ను పెంచుతాయి. మీ పార్టనర్ ఆర్థిక పరిస్థితి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోర్‌ని ఇలా కాపాడుకోండి
జాయింట్ లోన్స్ తీసుకున్నప్పుడు ఆటోమోటిక్గా పేమేంట్స్ జరిగేలా చూసుకోండి. క్వార్టర్లీ క్రెడిట్ రిపోర్ట్‌ని చెక్ చేసుకోండి. ఈఎంఐ టైమ్‌కి ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. మీ జాయింట్ లోన్ పార్టనర్‌తో మంచి రిలేషన్, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. మీ పేమెంట్ పూర్తి అయ్యాక ఆ జాయింట్ లోన్ నుంచి బయటకు రావడమో.. ట్రాన్సఫర్ చేయడమో చేయాలి.
ఈ టిప్స్ ఫాలో అయితే జాయింట్ లోన్ తీసుకున్నా సీబిల్ స్కోర్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. మీ సౌకర్యం బట్టి, మీతో ఉండే పర్సన్‌తో ఉన్న రిలేషన్ బట్టి మీరు జాయింట్ లోన్ తీసుకోవచ్చు. మీరు ఇద్దరూ లేదా ఎక్కువమంది లోన్‌కి ఎలిజిబుల్ అనుకుంటేనే దానిని అప్రూవ్ చేస్తారు. అలాగే క్రెడిట్ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.






















