By: Haritha | Updated at : 12 Mar 2023 10:33 AM (IST)
(Image credit: Pixabay)
ఏ వంటకమైనా రుచిగా రావాలంటే అన్ని సమపాళ్లలో పడాలి. ఒకటి ఎక్కువ పడి, ఇంకోటి తక్కువ పడినా కూడా రుచి బాగోదు. ముఖ్యంగా కూరలు, సూప్‌లు వంటి వాటిలో ఉప్పు, కారం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ రెండింటి రుచి సమపాళ్లలో ఉంటేనే ఆ కూరకు రుచి వస్తుంది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఉప్పు అధికంగా పడుతుంది. అధికంగా పడిన ఉప్పుని తినడం కూడా ప్రమాదమే. ఉప్పు అధికంగా పడ్డాక దాని తొలగించడం కష్టం అనుకుంటారు చాలామంది. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అధిక ఉప్పును సరి చేయవచ్చు. రుచిలో ఎలాంటి తేడా లేకుండా, ఆ వంటని మళ్ళీ కొత్తగా మార్చవచ్చు.
ఏం చేయాలంటే...
1. కూరలో ఉప్పు అధికంగా పడినప్పుడు దానికి ఆమ్లగుణం ఉన్న పదార్థాలను జోడించడం వల్ల ఉప్పు రుచి సమతుల్యం అవుతుంది. అంటే టమోటో ప్యూరీ, నిమ్మరసం, వెనిగర్ వంటివి ఆమ్ల పదార్థాలు. వీటి రుచులు కాస్త ట్యాంగీ టచ్ ను అందిస్తుంది. అంటే పుల్లదనాన్ని ఇస్తుంది. వీటిని ఉప్పు ఎక్కువ పడిన కూరలో వేసి కలపడం వల్ల కూర రుచి కూడా పెరుగుతుంది. అలాగే గొప్పదనం కూడా తగ్గుతుంది. కూర క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది.
2. ఏదైనా వెజిటబుల్ కర్రీ వండుతున్నప్పుడు ఉప్పు అధికంగా పడితే దానికి సింపుల్ చిట్కా... ఆ కూరలో మరిన్ని కూరగాయలను జోడించడమే. అప్పుడు ఉప్పు సమతుల్యం అయిపోతుంది. కూరగాయలను మరింతగా జోడించడం వల్ల కూర రుచి పెరుగుతుంది, కానీ తరగదు. అలాగే సోయా చంక్స్ వంటివి ఇంట్లో ఉంటే... నీటిలో నానబెట్టి వాటిని యాడ్ చేయడం వల్ల కూడా గొప్పదనం తగ్గుతుంది.
3. కూర లేదా సూప్ వంటివి వండుతున్నప్పుడు ఉప్పు అధికంగా పడితే గ్లాసు నీటిని వేసి కాసేపు ఉడికించండి. నీటిని వేయడం వల్ల ఉప్పు పల్చబడుతుంది. కూరలో ఉప్పదనం తగ్గుతుంది.
4. ఉప్పు అధికంగా పడింది అనుకుంటే ఇతర పదార్థాలు ఏమీ కలపడానికి లేనప్పుడు చక్కెరను జోడించడం కూడా ఒక పద్ధతి. ఎందుకంటే చక్కెర లవణాన్ని అడ్డుకుంటుంది. వంటకం రుచిని సమతుల్యం చేస్తుంది. ఉప్పదనం తెలియకుండా చేస్తుంది.
5. తాజా క్రీమ్ లేదా పాలు వంటివి ఇంట్లో ఉన్నప్పుడు అదనపు ఉప్పును అడ్డుకునేందుకు కూరల్లో వీటిని వేసుకోవచ్చు. ఎందుకంటే క్రీమ్, పాలల్లో కూడా చక్కెర ఉంటుంది. ఇది సమర్థవంతంగా ఉప్పదనాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాదు రుచిని కూడా పెంచుతుంది.
Also read: ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ తినడం ఎక్కువైందా? అయితే ఈ రోగాలను ఎదుర్కోవడానికి సిద్ధపడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం
Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?
Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలను ఇలా శాశ్వతంగా వదిలించుకోండి
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం