అన్వేషించండి

Noodles: ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ తినడం ఎక్కువైందా? అయితే ఈ రోగాలను ఎదుర్కోవడానికి సిద్ధపడండి

ఇప్పుడు ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ తినడం అలవాటైపోయింది.

బ్రేక్ ఫాస్ట్ అంటే ఒకప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మాలే కనిపించేవి. ఇప్పుడు ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ అధికంగా కనిపిస్తున్నాయి. కేవలం ఐదు నిమిషాల్లో వీటిని వండేసుకోవచ్చు. అందుకే అత్యంత సౌకర్యవంతమైన బ్రేక్ ఫాస్ట్‌గా ఇది మారిపోయింది.  దీన్ని గోధుమపిండి లేదా మైదాపిండితో తయారు చేస్తారు. ఇన్స్‌స్టెంట్ నూడిల్స్‌తో పాటు ఇచ్చే మసాలా వాసన మోనోసోడియం గుటామెట్ లా అనిపిస్తుంది. అయితే వీటిని తరచూ తినడం వల్ల ప్రాణాంతక రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి అధ్యయనాలు . వీటిని మొదట జపాన్లో 1958లో తయారు చేశారు. ఇప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమాన ఆహారంగా మారిపోయింది.

ఈ నూడిల్స్‌ను గోధుమపిండి లేదా మైదాపిండి, నీరు, ఆల్కలీన్ ఖనిజమైన కాన్సుయ్ వంటి వాటితో తయారుచేస్తారు. నూడుల్స్ కు సాగుదలను ఇచ్చేది కాన్సుయ్. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఒక ప్యాకెట్ నూడిల్స్‌లో 14 గ్రాముల కొవ్వు, ఆరున్నర గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. కానీ ఈ పోషకాలేమీ లభించవు. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇన్స్‌స్టెంట్ నూడిల్స్‌ను పోషకాహారంగా చెప్పరు. వీటిని అధికంగా తింటే వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. 

ఈ నూడిల్స్ ను తినడం వల్ల అధిక స్థాయిలో సోడియం శరీరంలో చేరుతుంది.  సోడియం మన శరీరానికి అవసరమైన పోషకమే అయినా అది అధిక మొత్తంలో చేరితే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. పొట్ట క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది సోడియం. 

దీని తయారీలో వాడే మోనోసోడియం గ్లుటామేట్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక తలనొప్పి, వికారం, అధిక రక్తపోటు, బలహీనత, కండరాలు బిగుతూ, ఛాతి నొప్పి, గుండె దడ మొదలైనవి వచ్చే అవకాశం ఎక్కువ.

మహిళల్లో...
ఇన్స్‌స్టెంట్ నూడిల్స్‌ను తినే మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వైద్యులు చెబుతున్న ప్రకారం వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన పదార్థాలు, సంతృప్త కొవ్వుల పరిమాణం వీటిలో ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి మహిళలకు రావచ్చు. 

కాలేయానికి హాని
కాలేయం దాని కణాలలో అదనపు కొవ్వులను నిల్వ చేస్తుంది. ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ అధికంగా తినడం వల్ల కాలేయానికి ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రావచ్చు. కాలేయ పనితీరు మారిపోవచ్చు. దీనివల్ల నీరు నిలిచిపోవడం, కాలేయం వాపు వంటి ఇబ్బందులు వస్తాయి. 

Also read: ఉప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి, ఎక్కువ తింటే ప్రాణాలు తీసేస్తుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget