అన్వేషించండి

Shocking: పావురాలను జాంబీలుగా మార్చేస్తున్న మిస్టిరియస్ వ్యాధి, మనుషులకు సోకుతుందా?

ఆ దేశంలోని పావురాలను భయంకరమైన వ్యాధి పట్టిపీడిస్తోంది.

జాంబీ సినిమాలు చూసే ఉంటారు. మెడ ఒకవైపు తిరిగిపోయి, నెమ్మదిగా నడుస్తూ భయపట్టేలా ఉంటాయి. మనుషుల్లో జాంబీలను సినిమాల్లో చూశారు కానీ, ఇక్కడ పావురాలు జాంబీల్లా మారిపోతున్నాయి. ఎక్కడో తెలుసా? బ్రిటన్లో. అక్కడి ప్రజలు పావురాలను చూస్తే భయపడిపోయి దూరంగా పారిపోతున్నారు. వాటి వ్యాధి మనుషులకు సోకుతుందేమో అని వారి భయం. ఈ వ్యాధి పేరు ‘పిజియన్ పారామిక్సోవైరస్ (PPMV)’ లేదా ‘న్యూకాజిల్స్ డిసీజ్’. ఈ వ్యాధే బ్రిటన్లోని పావురాల్లో వేగంగా వ్యాపిస్తోంది.

ఈ వైరస్ సోకిన పావురాల రెక్కలు ఎప్పుడూ వణుకుతూ ఉంటాయి, మెడ మెలి తిరిగిపోతుంది, నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఈ వ్యాధి సోకిన పావురాలు ఎగరలేవు, వేగంగా నడవలేక మెల్లగా కదులుతాయి. ఈ వ్యాధి ఇప్పుడు పావురాల్లో త్వరగా వ్యాపిస్తూ అనేక పక్షులకు సోకుతోంది. ఈ వ్యాధి సోకిన పావురాలు ఆహారం తినడానికి కూడా ఇష్టపడవు. 

ఈ వ్యాధి గురించి ఎలా తెలిసింది?
బ్రిటన్లో చాలా జంతువుల షెల్టర్లు ఉన్నాయి. పశువులు, జంతువులు, పక్షుల్లాంటివాటిని తెచ్చి ఇక్కడ వదిలేసి వెళతారు. ఈ మధ్య ఎక్కువ మంది మెలి తిరిగిన మెడతో, ఎగరలేకపోతున్న పావురాలను తెచ్చి వదిలేసి వెళుతున్నారు. వాటిపై పరిశోధన చేసిని వారికి ఈ వ్యాధి గురించి తెలిసింది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పారు జంతు వైద్యులు. ఇది వ్యాధి పక్షుల మల విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ తేమవంతమైన, చల్లని ప్రదేశాల్లో ఎక్కువ కాలం జీవించి ఉంటుంది. అంటే ఇప్పట్లో బ్రిటన్ నుంచి ఈ వైరస్ బయటికి పోదన్న మాట.  

కాకపోతే ఇంకా ఈ వ్యాధి పావురాల నుంచి మనుషులకు సోకలేదు. సోకే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ పక్షుల నుంచి మనుషులకు సోకితే మొదట కళ్ల కలక రావచ్చు అని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఈ వైరస్ చికిత్సకు కూడా స్పందించడం లేదు. కనుక పావురాలను ఈ వైరస్ ఎప్పుడు పోతుందో చెప్పలేమంటున్నారు వైద్యులు. అలాగే బ్రిటన్లో బర్డ్ ఫ్లూ కూడా బయటపడింది. దీంతో దాదాపు 30 లక్షల పక్షులను చంపేశారు బ్రిటన్ అధికారులు. పావురాలను పెంచుకుంటున్న వారు వాటికి టీకాలు వేయిస్తూ జాగ్రత్తపడుతున్నారు.  

Also read: మీ టీనేజ్ పిల్లల గురించి ఈ అయిదు అపోహలు నమ్మకండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget