అన్వేషించండి

రాక్‌సాల్ట్ vs సాధారణ ఉప్పు.. వీటిలో ఏది ఆరోగ్యకరం? ICMR సూచనల ప్రకారం ఏది బెటర్?

ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి మంచిదని రాక్‌సాల్ట్ వినియోగం బాగా పెరిగింది. పింక్ సాల్ట్‌గా పిిలిచే ఈ ఉప్పు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదా? దీనికి పరిమితులు అవసరమా? ఐసీఎంఆర్ సూచనలేమిటీ?

ఉప్పు లేనిదే కూరకు రుచి ఉండదు. కానీ, కొందరు చప్పగా ఉందంటే పరిమితి కంటే ఎక్కువ ఉప్పును తినేస్తుంటారు. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు, పరిశోధనలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉప్పు తగ్గించి తీసుకోవాలని సూచించారు. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాక్ సాల్ట్ మంచిదా.. సాధారణ ఉప్పు మంచిదా అనే సందేహాలకు కూడా పుల్ స్టాప్ పెట్టింది. ఏ రకం ఉప్పైనా సరే.. పరిమితికి మించి తీసుకుంటే ముప్పేనని తెలిపింది.

ఏ ఉప్పు మంచిది?

ఇప్పటివరకు మనం సముద్రపు ఉప్పును మాత్రమే ఎక్కువగా ఉపయోగించే వాళ్లం. ప్రస్తుతం మార్కెట్లో మరో రెండు రకాల రాతి ఉప్పులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి రాక్ సాల్ట్. దీన్నే పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. దీనితోపాటు బ్లాక్ సాల్ట్‌ను చాలామంది వాడుతున్నారు. ఈ రెండు రకాల ఉప్పులు.. మనం వాడే రెగ్యులర్ సాల్ట్ కంటే మంచివని, ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ప్రచారం ఉంది. దీంతో అంతా అటువైపు మొగ్గుతున్నారు.

రాక్ సాల్ట్, నల్ల ఉప్పులో పోటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉఫ్పు రకాలను రెగ్యులర్ సాల్ట్ తరహాలో రిఫైన్ చెయ్యరు. కనుక అందులో ఖనిజాలకు ఎలాంటి నష్టం ఉండదు. పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లను వాటి రంగు, వాసనల ద్వారా చాలా సులభంగానే గుర్తించవచ్చు. ఈ ఉప్పు రకాలను నిల్వచెయ్యడానికి రకరకాల సుగంధ ద్రవ్యాలను, బొగ్గు, చెట్ల బెరడు వంటి వాటిని ఉపయోగిస్తారు. అందువల్ల ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఈ సాల్ట్స్‌లో కూడా సాధారణ ఉప్పులో ఉండే సోడియం ఉంటుంది. కనుక ఈ కొత్త రకం ఉప్పులు ఆరోగ్యానికి మేలు చేసినా.. మితంగా తీసుకోవడమే ఉత్తమం అని ICMR సూచించింది.

ఉప్పు ఎక్కువ తింటే...?

  • ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగిపోతుంది. రక్తనాళాల మీద రక్త పీడన ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు కారణం అవుతుంది. అంతే కాదు ఉప్పు ఎక్కువ తింటే జీర్ణవ్వవస్థ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది జీర్ణాశయ క్యాన్సర్ కు కారణం కాగలదు.
  • ఉఫ్పు ఎక్కువ తినేవారిలో బీపీ మాత్రమే కాదు జీర్ణాశయ లోపలి పొరకు నష్టం కలిగిస్తుంది. అందువల్ల గ్యాస్ట్రిక్ అట్రోఫీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువైన సోడియంను విసర్జించేప్పుడు కాల్షియం కూడా బయటకు పోతుంది. ఫలితంగా కాల్షియం లోపించి ఎముకల సమస్య వస్తుంది. ఏ రకమైన ఉప్పులో నైన సోడియం స్థాయి ఒకే విధంగా ఉంటుంది కనుక పరిమితిల్లో ఉప్పు వాడడం అన్నిరకాలుగానూ ఆరోగ్యానికి మంచిది.

Also Read : ధ్యానంతో బరువు తగ్గొచ్చట - ఇవిగో.. ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి చాలు!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget