News
News
X

ఐవీఎఫ్ ప్రాణాంతకమా? ఢిల్లీలో ఆ మహిళ మరణానికి కారణాలేమిటీ?

ఈమధ్య కాలంలో చాలా మందిలో సంతాన సాఫల్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఐవీఎఫ్ ప్రక్రియలు కూడా విరివిగా జరుగుతున్నాయి. అయితే ఈ చికిత్సలు సురిక్షతమేనా అని ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన అనుమానాలు లేవనెత్తుతోంది.

FOLLOW US: 

సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఐవీఎఫ్ (IVF) ప్రక్రియ ఆశలు చిగురింపజేస్తుంది. ఈ ప్రక్రియలో వైద్యులు స్త్రీ నుంచి అండాన్ని సేకరించి, పురుషుడి నుంచి వీర్యకణాన్నిసేకరిస్తారు. ఆ తర్వాత వాటిని IVF విధానం.. అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా టెస్ట్ ట్యూబ్ లో ఫలధీకరణ చెందిస్తారు. ఇలా ఫలధీకరణ చెందిన తర్వాత ఆ అండాన్ని రెండు వారాల్లో స్త్రీ గర్భాశయంలో అండస్థాపన చేస్తారు. అయితే కేవలం ఒకే ఒక అండంతో ఇలా ప్రయత్నించినపుడు అది అన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవచ్చు. అందువల్ల ఒకటి కంటే ఎక్కువ అండాలతో ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో సురక్షితమే. కానీ కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చని తెలియజేస్తోంది ఈ ఉదంతం. అదేమిటో ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాం.

IVFకు ముందు అండ సేకరణ  ప్రక్రియ ఉంటుంది. ఇందుకు ఒక రుతుచక్రం నుంచి ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల కావాల్సిన అవసరం ఉంటుంది.  అలా జరగడానికి అండాశయాన్ని స్టిమ్యూలేట్  చేస్తారు. ఇలా స్టిమ్యూలేట్ చెయ్యడానికి హార్మోన్ థెరపి అవసరమవుతుంది. దీనిని హైపర్ ఓవ్యూలేషన్ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ అండదానం కోసం కావచ్చు లేదా ఐవీఫ్ కోసం కూడా కావచ్చు.

ఆ మహిళ మరణానికి కారణం ఏమిటీ?

ఢిల్లీకి చెందిన 23 సంవత్సరాల యువతి IVF ప్రక్రియలో పిల్లలను కనేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె మరణించింది. ఎగ్ కలెక్షన్ కోసం హాస్పిటల్ కు  వెళ్లినపుడు ఆమె ఆరోగ్యంగానే ఉంది. కానీ ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత అకస్మాత్తుగా ఆమె గుండె ఆగిందని అక్కడి మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

ఆమె అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమే ఓవరియన్ హైపర్ స్టిమ్యూలేషన్ సిండ్రోమ్(OHSS) అనే చాలా అరుదైన పరిస్థితి వల్ల ఆమె మరణించినట్టు తెలిసింది. ఇటువంటి పరిస్థితి ఐవీఎఫ్ కు వెళ్లిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ఎదురవుతుందని, కేవలం ఒక్క శాతం స్త్రీలలలో మాత్రమే ఇది విషమంగా మారుతుందని అంటున్నారు.

News Reels

ఐవీఎఫ్ ప్రక్రియ మొదలుపెట్టడానికి ముందు ఆమె చాలా ఆరోగ్యవంతురాలని అక్కడి వైద్యులు అంటున్నారు. హార్మోనల్ థెరపి మొదలు పెట్టిన తర్వాత 11 రోజుల తర్వాత అండాల విడుదల ప్రక్రియ ఆమెలో మొదలైంది. అప్పుడు ఆమె అండసేకరణ కోసం హాస్పిటల్ కు వచ్చింది. వైద్యులు ఆమెకు మత్తు ఇచ్చి అండాలు సేకరించడం మొదలుపెట్టారు. అయితే అకస్మాత్తుగా ఆమె బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం మొదలైంది. చాలా త్వరగా ఆమె గుండె కొట్టకోవడం ఆగిపోయింది. అటాప్సీలో ఆమెలో ఉత్పత్తి అయిన అండాలు మామూలుగా ఉండాల్సిన దాని కంటే మూడు రెట్లు పెద్దవిగా ఉన్నాయని గుర్తించారు.

అక్యూట్ పల్మనరీ ఎడేమా అనే పరిస్థితి వల్ల ఆమె మరణించిందని, ఈ పరిస్థితి OHSS వల్ల ఏర్పడిందని ఎక్సర్ట్స్ అంటున్నారు. ఇలా జరగడం దురదృష్టకరం. కానీ ఇది నిజంగా చాలా అరుదైన పరిస్థితి అని ప్రొగ్రెస్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ (పీఈటీ) అనే ఫెర్టిలిటి చారిటీ కి చెందిన డాక్టర్ సారా నార్క్రాస్ ఒక మీడియా సంస్థతో అన్నారు.

Also read: క్రోన్స్ అంటే ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేనట్టేనా, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 27 Oct 2022 03:58 PM (IST) Tags: Cardiac Arrest Fertility Ivf Treatment IVF Fertility with IVF

సంబంధిత కథనాలు

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!