News
News
X

Oats: వండని ఓట్స్ తినొచ్చా? వాటి వల్ల వచ్చే అనార్థాలు ఏంటి?

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి. బరువు తగ్గేందుకు చాలా సహకరిస్తాయి.

FOLLOW US: 
 
బరువు తగ్గాలని డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మొదటిగా ఎంచుకునే పదార్థం ఓట్స్. చాలా తేలికగా వండుకుని తినే ఆహార పదార్థంగా ఉండటం వల్ల దీనికే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. ఓట్స్ మీల్, ఉప్మా, స్మూతీస్ ఇలా అన్నీ రకాలుగాను రుచికరంగా చేసుకుని తింటున్నారు. ఓట్స్ పిండి చేసుకుని పాన్ కేక్స్, వాటిని నానబెట్టుకుని రుబ్బుకుని దోశలుగా కూడా పోసుకుంటారు. ఓట్స్ అనేక రూపాల్లో లభిస్తుంది. వాటిలో అత్యంత సాధారణ రకం రోలద వోట్స్.చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉండటం వల్ల సులభంగా వండుకోవచ్చు. ఓట్స్ ఆవిరి చేయడం వల్ల వ్యాధికారక సూక్ష్మ జీవుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రోల్డ్ లేదా ఇన్ స్టంట్ ఓట్స్ ఉపయోగించి వంటకాలు చేసుకుని తినడం మేలు. కొన్ని పదార్థాలు పచ్చివి లేదా ఉడికించుకుని తింటారు. అయితే ఓట్స్ పచ్చివి తినొచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పచ్చి ఓట్స్ తిన్నా కూడా సురక్షితమే.

జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు పచ్చి ఓట్స్ తినొచ్చా?

జీర్ణాశయ బాధ, పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, పొట్టి కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఓట్స్ పచ్చివి తినకపోవడమే మంచిది . పచ్చిగా ఓట్స్ తినడం సురక్షితం అయినప్పటికీ ఈ సమస్యలని మరింత ఎక్కువ చేస్తాయి. ఓట్స్ భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఓట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం ఎలా?

News Reels

ముడి ఓట్స్ తాజాగా ఎక్కువ రోజులు ఉండేలా చేయడం చాలా ముఖ్యమైన విషయం. వీటిని ఒక ఫ్రీజర్ బ్యాగ్ లో నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక సంవత్సరం వరకు అవి చెడిపోకుండా ఉంటాయి. పది, చల్లని ప్రదేశంలో ఓట్స్ పొడి నిల్వ చేసుకోవచ్చు. గట్టి కంటైనర్ తీసుకుని వాటిలో ఓట్స్ వేసి బిర్రుగా మూత పెట్టుకున్నా సరిపోతుంది. రిసీలబుల్ ప్లాస్టిక్ బ్యాగ్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ లో కూడా పెట్టుకోవచ్చు.

ఆహార పదార్థాలకి సంబంధించి తినే ముందు గడువు తేదీ చూసుకుని తింటారు. తేదీ దాటితో వాటిని తీసుకోకూడదు. కానీ ఓట్స్ విషయంలో ఆ అవసరం లేదు. గడువు తేదీ దాటినా తీసుకోవచ్చు. అయితే ఆ పదార్థం ఎటువంటి వాసన లేకుండా రుచిగా ఉంటే మాత్రమే తీసుకోవాలి. చెడు వాసనగా అనిపిస్తే వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం.

ఓట్స్ వల్ల ప్రయోజనాలు

ఓట్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకున్నప్పుడు స్మూతీస్  తయారుచేసేటప్పుడు అందులో కొద్దిగా ఓట్స్ పొడి కలుపుకుని తీసుకోవచ్చు. అయితే వాటిని సరైన పద్ధతిలో తీసుకున్నప్పడే ప్రయోజనాలు పొందగలుతాము. చప్పగా ఉన్నాయి కదా అని తీపి జోడిస్తే కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: బరువు తగ్గడానికి ఏది తినాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి తింటే నాజూకుగా మారడం ఖాయం

Published at : 22 Oct 2022 03:25 PM (IST) Tags: Oat meal Oats Raw Oats Oats Benefits Raw Oats Side Effects

సంబంధిత కథనాలు

Vitamin E: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!

Vitamin E: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!

Memory: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు

Memory: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు

Heart Attack: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Heart Attack: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Chaksu Seeds: రోజూ ఈ విత్తనాలు తింటే అనారోగ్యాలన్నీ పరార్!

Chaksu Seeds: రోజూ ఈ విత్తనాలు తింటే అనారోగ్యాలన్నీ పరార్!

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

టాప్ స్టోరీస్

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!