Curd with Hot Rice: వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటే అంత ప్రమాదమా?
వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటున్నారా? అలా అస్సలు చేయొద్దు. అంతేకాదు, కొన్ని ఆహార పదార్థాలను సైతం పెరుగుతో కలిపి తినకూడదు. అవేంటో.. చూడండి.
చాలామందికి వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినడమంటే చాలా ఇష్టం. అయితే, దాని వల్ల సమస్యలు తప్పవని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. పెరుగు మాత్రమే కాదు.. వేడి అన్నంలో బాగా చల్లని పదార్థాలను కలపడం కూడా అంత మంచిది కాదు. దానివల్ల అన్నం తన స్వభావాన్ని కోల్పోతుంది. అందులోని పోషకాలు శరీరానికి అందవు.
వేడి అన్నంలో పెరుగు కలిపి తింటే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదం సైతం ఈ విషయాన్ని నొక్కి చెబుతోంది. పెరుగు అన్నం ఎప్పుడూ చల్లగానే ఉండాలని, వేడి వేడిగా తినకూడదని పేర్కొంది. కూరలతో అన్నం తిన్న వెంటనే పెరుగన్నం తినాలనే రూల్ ఎక్కడా లేదు. లంచ్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత కూడా పెరుగున్నం తినొచ్చు. మధ్యా్హ్నం భోజనం తిన్న మూడు గంటల తర్వాత చల్లబడిన అన్నంతో కలిపి పెరుగున్నం తినొచ్చు. పెరుగు మాత్రమే కాదు, వేడి అన్నంలో మజ్జిగ కూడా కలిపి తినకూడదు.
పెరుగుతో ఈ పదార్థాలను కలిపి తినకూడదట: కొన్ని ఆహార పదార్థాలను సైతం పెరుగుతో కలిపి తినకూడదట. ఎందుకంటే పెరుగు.. కాల్షియం, విటమిన్ B-2, విటమిన్ B-12, మెగ్నీషియం, పొటాషియంతో నిండి ఉంటుంది. పెరుగులో కొవ్వు శాతం కూడా ఎక్కువే. అందుకే, పెరుగుతో ఇతర ఆహార పదార్థాలను కలిపి తినడం ప్రమాదకరం. ఈ పదార్థాల్లో మీ ఫేవరెట్ కాంబినేషన్లు కూడా ఉన్నాయ్. అవేంటో చూడండి.
⦿ చాలామంది పెరుగులో ఉల్లిపాయ నంజుకుని తింటారు. ఈ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. ఉల్లి వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి, చల్లని కలయిక దద్దుర్లు, తామర, సోరియాసిస్, వివిధ చర్మ అలెర్జీలకు కారణమవుతుంది. కాబట్టి, పెరుగు-ఉల్లితో చేసే సలాడ్ కూడా అంత మంచిది కాదు.
⦿ పెరుగులో మామిడి పండు కలుపుకుని తినడం కూడా అంత మంచిది కాదు. పెరుగు చల్లదనాన్ని, మామిడి పండు వేడిని ఉత్పత్తి చేప్తాయి. ఫలితంగా చర్మ సమస్యలు ఏర్పడతాయి.
⦿ మాంసాహారంతో కలిపి పెరుగును అస్సలు తినకూడదు. పెరుగును మాంసాహారంతో కలిపి తింటే అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
⦿ పెసరపప్పుతో కలిపి పెరుగన్నం అస్సలు తినకూడదు. దాని వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే నెయ్యి, నూనెతో తయారు చేసిన ఆహారాలను కూడా పెరుగుతో కలిపి తీసుకోవద్దు.
Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!
Also Read: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!