అన్వేషించండి

Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?

ప్రతిరోజూ పాలు తాగే వాళ్ళు ఎంతోమంది. కానీ నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటికి వెళ్ళకూడదు.

ప్రాంతాలను బట్టి ఎన్నో రకాల సాంప్రదాయాలు, నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. అలాంటి ఒక నమ్మకమే పాలు తాగిన వెంటనే బయటికి వెళ్ళకూడదు అని. పురాతన కాలం నుంచి ఈ నమ్మకం అలా ఉండిపోయింది. ఇప్పటికీ ఉత్తర భారత దేశంలో ఈ నమ్మకాన్ని పాటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

ఎందుకు వెళ్ళకూడదు?
ప్రాచీన నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మనల్ని ఆకర్షిస్తాయని అంటారు.  కేవలం పాలే కాదు, ఏ ఆహారం అయినా తెలుపు రంగులో ఉన్నది తినడం లేదా తాగడం చేశాక బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు. ఇవి ప్రతికూలతను ప్రేరేపిస్తాయని, దురదృష్టాన్ని తెస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో ఎవరూ తేల్చలేకపోయారు. తెల్లటి ఆహార పదార్థాలు తిన్నాక ఓ అరగంట సేపు ఇంట్లోనే ఉండి తర్వాత వెళ్ళమని సూచిస్తున్నాయి ప్రాచీన ఆచారాలు.

మధ్యాహ్నం, రాత్రి 12 గంటల సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయని ప్రాచీన ప్రజల నమ్మకం. అందుకే ఆ సమయంలో పాలు లేదా తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక బయటకు వెళ్లకుండా ఉండేవారట. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి, ఇబ్బందులను తెస్తాయని వారి నమ్మకం. తెలుపు రంగు చంద్రుడిని సూచిస్తుంది. ఇది స్థిరత్వానికి, ప్రశాంతతకు చిహ్నం. అయితే తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక రోడ్డు మీదకు వెళితే రాహువు వంటి ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయని జనాదరణ పొందిన ఒక నమ్మకం. అంతేకాదు హిందూ గ్రంధాల ప్రకారము రాహువు, చంద్రుడు ఇద్దరూ శత్రువులు. కాబట్టి తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్న వారిపై రాహువు ప్రభావాన్ని చూపిస్తుందని, చెడు జరిగేలా చేస్తుందని అంటారు.

సైన్స్ ఏం చెబుతోంది?
సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పాలు తాగిన వెంటనే బయటికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే కొందరిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉంటుంది. ఇది ఉన్నట్టు వారికి కూడా తెలియదు. ఈ సమస్య ఉన్న వారిలో పాలల్లో ఉన్న లాక్టోజ్ ను అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తాగిన వెంటనే వాంతులు అవ్వడం లేదా విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి. కాబట్టి పాలు తాగాక కాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుని బయటకు వెళ్లొచ్చు. బయటికి వెళ్లాక వాంతులు, విరోచనాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. సైన్స్ చెబుతున్నది ఇదే. అయితే ప్రజలు సైన్సు కన్నా తమ ప్రాచీన నమ్మకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

Also read: తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరిగిపోతోందా? అయితే జాగ్రత్త భవిష్యత్తులో వచ్చే ముప్పు ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
Female Fertility : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..
మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..
Morning Tea vs Evening Tea : ఉదయం టీ ఎక్కువ మంచిదా? సాయంత్రం టీనా? ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సూచనలు ఇవే
ఉదయం టీ ఎక్కువ మంచిదా? సాయంత్రం టీనా? ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సూచనలు ఇవే
10K Steps Daily : రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు
రోజుకు 10 వేల అడుగులు నడవాలా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget