By: ABP Desam | Updated at : 09 Jan 2023 05:32 PM (IST)
Edited By: Bhavani
Representational image/ pixels
చాలా మంది బరువు తగ్గాలన్న ప్రయత్నంలో తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. ఉదయాన్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ డ్రింక్ నిజంగా అందరికీ మేలే చేస్తుందా అనేది అనుమానమే అని నిపుణులు అంటున్నారు.
ఉదయాన్నే పరగడుపున తేనె తీసుకుంటే రోజంతా యాక్టీవ్‌గా ఉంచుతుంది. నిద్రకు ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ తేనే మంచి నిద్రను ఇస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మానసిక, శారీరక విశ్రాంతికి దోహదం చేస్తుంది. తేనే ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. మంచి డీటాక్సిఫికెంట్ కూడా.
తేనె, నిమ్మరసం తయారుచేసుకునే నీళ్లు వేడిగా ఉండకూడదు. 200 నుంచి 250 మి.లీ. నీళ్లకు నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి. నెమ్మదిగా రుచి ఎంజాయ్ చేస్తు తాగితే మరీ మంచిది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.
⦿ అల్సర్లు, అసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. ఇలా మంటగా అనిపించినా లేక కడుపులో నొప్పి వచ్చినా ఈ పానీయం మీకు సరిపడదని అర్థం.
⦿ తేనెలోని ఫ్రక్టోజ్ కారణంగా తేనె నిమ్మకాయ రసం డయాబెటిక్స్ కి అంత మంచిది కాదనే చెప్పాలి. దీని వల్ల షుగర్ పెరిగిపోవచ్చు.
⦿ బరువు తగ్గేందుకు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు తెనే లేదా ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది డంపింగ్ సిండ్రోమ్ కు కారణం కావచ్చు.
⦿ ఆరోగ్యకరమైన శరీర బరువు మెయింటెయిన్ చెయ్యడానికి చక్కెరలు, ఉప్పు కలిగిన పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో
Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
COOKIES_POLICY