International Yoga Day 2025 : అంతర్జాతీయ యోగా దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, 2025 థీమ్ ఇవే
Yoga Day 2025 Theme : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు. దాని ప్రాముఖ్యత, థీమ్ ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ యోగా డే సందర్భంగా తెలుసుకుందాం.

International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకుంటున్నాము. 2025లో జూన్ 21 శనివారం వచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. అయితే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా డే చరిత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన 69వ యూనైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ప్రతిపాదన చేశారు. ఆ సమయంలో ఈ ప్రతిపాదనకు 175 నుంచి 177 దేశాల మద్ధతుతో ఏకాభిప్రాయం లభించింది. యూనైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ చరిత్రలో ఇంత మద్ధతు లభించడం చరిత్రలో అత్యధికం.
మద్ధతు తర్వాత మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన 2015లో జరిపారు. ఈ కార్యక్రమంలో 84 దేశాలకు చెందిన వారు పాల్గొని చరిత్ర సృష్టించారు. శాంతి, శ్రేయస్సు, ఐక్యతకు గుర్తుగా ప్రస్తుతం 195 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. శారీరక ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని యోగా హైలెట్ చేస్తుంది.
యోగా డే ప్రాముఖ్యత
ఇంటర్నేషనల్ యోగా డే పలు జాతులు, సంస్కృతులు, నమ్మకాలే లక్ష్యంగా ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఆసన సాధనకే పరిమితం కాకుండా యోగాను పూర్తి అర్థం చేసుకోవడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఇవి శారీరకంగా, మానసికంగా ఇచ్చే ప్రయోజనాలు చాటి చెప్పడమే దీని లక్ష్యం.
యోగా డే 2025 థీమ్
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజూ ఓ కొత్త థీమ్‌తో వస్తారు. ఈసారి "భూమి కోసం యోగా, ఆరోగ్యం(Yoga for One Earth, One Health)" అనే థీమ్‌తో వచ్చారు. వ్యక్తిగత ఆరోగ్యం, భూమి మధ్య సంబంధాన్ని ఇది హైలెట్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇండియా వ్యాప్తంగా యోగా సంగమంతో సహా 10 ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా దేశాల్లో యోగాను నిర్వహిస్తూ అవగాహన పెంచుతున్నారు.
రోజూ యోగా చేయడంవల్ల శారీరక, మానసిక, ఆథ్యాత్మిక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న యోగాను ప్రజలందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవారు వాటిని దూరం చేసుకోవడానికి యోగాను తమ డైలీ రోటీన్లో భాగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ.. ప్రోత్సాహిస్తారు. బిగినర్స్ ఎలా ఆసనాలు వేయాలో.. క్రమంగా వాటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో కూడా నేర్పిస్తారు.






















