బీరు తాగితే.. శృంగారంలో రెచ్చిపోతారట! ఇందులో నిజమెంతా?
మీరు బీరు ప్రియులా? అయితే, మీరు అతిగా తాగకపోతే ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. లేకపోతే.. ఊహించని సమస్యలు కూడా పలకరిస్తాయి.
మీకు బీరు తాగే అలవాటు ఉందా? అయితే, బీరు తాగేవారికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు తప్పకుండా దీన్ని అలవాటు చేసుకుంటారేమో. అయితే, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలుసుకోండి. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. బీరు కూడా అంతే. తక్కువ తీసుకుంటే మేలు చేస్తుంది. ఎక్కువ తీసుకుంటే ప్రాణం తీస్తుంది. ఈ రోజు International Beer Day. కాబట్టి.. బీరు వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో బీరు తాగే పురుషులు శృంగారంలో రెచ్చిపోతారని తేలిందట. పరిశోధనల్లో భాగంగా మహిళలకు, పురుషులకు ఒక పింట్ (సుమారు 500 మిల్లీ లీటర్ల) బీరును ఇచ్చారట. అయితే, బీరు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపించలేదట. కానీ, పురుషుల్లో మాత్రం లైంగిక శక్తి పెరిగినట్లు తేలింది. బీరు తాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం సమస్య 26 శాతానికి తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
బీర్ తాగితే నపుంసకత్వం రాదని భావించి అతిగా తాగినా ప్రమాదమే. ఎందుకంటే అతిగా బీరు తాగితే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. ఒక పింట్ కంటే ఎక్కువ బీర్ తాగొద్దు. బీరును ధాన్యపు గింజల నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఎన్నో పోషకాలు ఉంటాయి. బీర్‌లో తాగేవారికి విటమిన్-B, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు లభిస్తాయి. ఇంకా పొటాషియం, పాస్పరస్, బియోటిన్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు సైతం బీరులో ఉంటాయి.
బీరు తాగేవారిలో రక్త ప్రసరణ సాధాణంగా ఉంటుందని, దానివల్ల రక్తపోటు సమస్యలు దరిచేరవని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. బీరులో ఉండే సిలికాన్ ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహకరిస్తుంది. బీరు తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. బీరు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. బీరులోని ఫ్లవనోయిడ్ సమ్మేళనాలు, పాలిఫెనాల్స్ వివిధ క్యాన్సర్‌లను అడ్డుకుంటుంది.
బీరులోని విటమిన్-E వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగించే సత్తా కూడా బీరుకు ఉందట. వివిధ రకాల కిడ్నీ వ్యాధులు, అల్జిమర్స్ నుంచి కూడా బీరు కాపాడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. బీరు మోతాదు మించి తాగితే ఎన్నో సమస్యలు వెంటాడతాయి. కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంది. పొట్టరావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వెంటాడుతాయి. కాబట్టి.. బీరు మంచిదే కదా అని అదేపనిగా తాగకుండా అప్పుడప్పుడు తాగి ఆరోగ్యంగా ఉండండి.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి.
ముఖ్య గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్య సేవనాన్ని ప్రోత్సాహించడం మా ఉద్దేశం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.