Facts about Christmas : క్రిస్మస్ గురించి అమ్మబాబోయ్ అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. మీకు తెలుసా?
Interesting Facts of Christmas : డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ సంబురాలు మొదలైపోతాయి. అయితే మీకు క్రిస్మస్ గురించి అస్సలు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడున్నాయి.
Christmas Facts : ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ కూడా ఒకటి. ఈ సమయంలో ఫుల్ లైట్స్, క్రిస్మస్ ట్రీలు, స్టార్స్, శాంటా కాస్ట్యూమ్స్‌తో వీధులు రంగులమయంగా మారిపోతుంటాయి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ.. న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తుంటారు. మంచి ఫుడ్ తీసుకుంటూ.. ఆహ్లాదకరమైన సంగీతంతో, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా గడిపేస్తారు. అయితే మీకు క్రిస్మస్ గురించి.. అస్సలు తెలియని, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే..
క్లారిటీనే లేదు..
క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ. దీనిని యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన దేవుని కుమారుడని నమ్ముతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలామంది డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ.. యేసు పుట్టిన నిజమైన తేదీ ఎప్పుడనేది ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు.
ఆ దేశంలో జనవరి 7
దాదాపు అందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటారని తెలుసు. కానీ కొందరు అదే రోజు క్రిస్మస్ చేసుకోరని మీకు తెలుసా? రష్యా, ఉక్రెయిన్, రొమేనియా వంటి దేశాల్లో క్రైస్తవుల క్రిస్మస్ను జనవరి 7వ తేదీన జరుపుకుంటారు. కొంతమంది గ్రీకువారు కూడా జనవరి 7న ఫెస్టివల్ చేసుకుంటారు. క్రిస్మస్ అనే పేరు క్రిస్టెస్ మాస్సే అనే ఆంగ్ల పదబంధం నుంచి వచ్చింది.
క్వీన్ విక్టోరియా కాలంలో..
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న క్రిస్మస్ సంప్రదాయాలు విక్టోరియన్ కాలం నుంచి ప్రసిద్ధి చెందినవి. క్రిస్మస్ కార్డులు, బహుమతులు ఇవ్వడం, క్రాకర్లు కాల్చడం, రోస్ట్ టర్కీ, క్రిస్మస్ పుడ్డింగ్ వంటివన్నీ విక్టోరియన్ కాలం నుంచే ఎక్కువయ్యాయి. క్వీన్ విక్టోరియా, ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ క్రిస్మస్కు పెద్ద అభిమానులు కావడం వల్ల.. ఈ సంప్రదాయాలు పాటించేవారు. తర్వాత కాలంలో అవి ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచూర్యం పొందాయి.
క్రిస్మస్ ట్రీలు అప్పటి నుంచి..
క్రిస్మస్ చెట్లుకూడా విక్టోరియన్ కాలంలోనే ప్రసిద్ధి చెందాయి. అయితే వీటిని మొట్టమొదట 16వ శతాబ్ధంలో జర్మనీలో వినియోగించారు. అక్కడ క్రిస్మస్ సమయంలో ప్రజలు ఫిర్ చెట్లను పండ్లు, నట్స్‌తో అలంకరించారు. తర్వాత కాలంలో కాగితం ఆకారాలు, కొవ్వొత్తులతో డెకరేట్ చేశారు. ఈ పండుగ సంప్రదాయ మూలాలు రోమన్లు, ప్రాచీన ఈజిప్షియన్లు నాటివని చరిత్రకారులు భావిస్తున్నారు.
నార్వే-లండన్.. ట్రీ ముచ్చట
మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడుంది. నార్వే.. లండన్‌కు ఓ అందమైన క్రిస్మస్ చెట్టును పంపింది. ప్రతి సంవత్సరం వారి బహుమతికి గుర్తుగా క్రిస్మస్ సమయంలో లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లైట్లతో అలంకరిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యూకే నార్వేకి అందించిన సహాయానికి గుర్తుగు.. ఈ క్రిస్మస్ ట్రీని పంపిస్తారు. దీని ఎత్తు 20 మీటర్లు.
శాంటా క్లాజ్ ఒక్కరే కాదు..
అసలు శాంటా క్లాజ్ గురించి ప్రస్తావన లేని క్రిస్మస్ ఉండదేమో.. అయితే నెయింట్ నికోలస్ 4వ శతాబ్థంలో నివసించిన ఓ బిషప్.. తన దయ, ఉదార స్వభావానికి ప్రసిద్ధి చెందాడు. పిల్లల పట్ల ఆయన ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. అయితే క్రిస్మస్ సమయంలో శాంటా క్లాజ్ ఒక్కరే ఫేమస్ కాదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యారెక్టర్లు కూడా క్రిస్మస్కు ప్రసిద్ధి చెందారు.
జింగిల్ బెల్స్కి సంబంధమే లేదా?
క్రిస్మస్ సమయంలో జింగిల్ బెల్స్ సాంగ్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ పాట అసలు క్రిస్మస్ గేయమే కాదు. ఇది ఒక జాలీ పాటగా చెప్పవచ్చు. ఈ పాటలో ఎక్కడా కూడా క్రిస్మస్, జీసస్ అనే పదాలే ఉండవు. దీనిని వన్ హార్స్ ఓపెన్ స్లిఘ్ పేరుతో.. థాంక్స్ గివింగ్ కోసం రాశారు.
Also Read : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే