Cannibalistic Tribe: ఇక్కడి ప్రజలు మనుషుల తలలను తినేస్తారు - ఎందుకో తెలిస్తే నిద్రపట్టదు!
ఆ దీవుల్లో అడుగు పెడితే మళ్లీ తిరిగిరారు. పొరపాటున వాళ్లకు చిక్కారో నరకం కనిపిస్తుంది. వారు తమ శత్రువుల పుర్రెను గిన్నెల్లా చేసుకుంటారు. తలను కాల్చుకుని తినేస్తారు.
![Cannibalistic Tribe: ఇక్కడి ప్రజలు మనుషుల తలలను తినేస్తారు - ఎందుకో తెలిస్తే నిద్రపట్టదు! Indonesia's Cannibalistic Tribe Collects Human Heads Cannibalistic Tribe: ఇక్కడి ప్రజలు మనుషుల తలలను తినేస్తారు - ఎందుకో తెలిస్తే నిద్రపట్టదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/116360268e2392fb8f3794fbab4575261658302980_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నరరూప రాక్షసుల గురించి వినడమే గానీ, ఎప్పుడూ చూసి ఉండరు. అయితే మీరు పలు వెబ్ సీరిస్‌ల్లో అలాంటి పాత్రలను చూసే ఉంటారు. అలాంటి సీన్లను బుల్లి తెర లేదా వెండి తెరపై చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా? అనిపిస్తుంది. ఆ సీన్ కొన్నాళ్ల పాటు మనల్ని వెంటాడుతుంది. అయితే, ఆ దేశంలోని గిరిజన తెగ ప్రజలు ఆచారం పేరుతో చేసే ఈ అరాచకాలు గురించి తెలిస్తే.. మీకు జీవితాంతం నిద్రపట్టదు. వాళ్లు తమ శత్రువులను చంపేసి.. వారి తలలను శరీరం నుంచి వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులతో కలిసి తినేస్తారు. ఇలాంటి రాక్షస సాంప్రదాయాలు పాటించే మనుషులు ఈ భూమి మీద ఇంకా ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇంతకీ వాళ్లు ఎక్కడ ఉన్నారు?
మనుషులను తినేసే ఆ నరమాంస భక్షకులు ఇండోనేషియాలోని న్యూ గినియా ప్రాంతాలలో సుమారు 25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లోతట్టు చిత్తడి ప్రాంతాలలో ఈ తెగ నివసిస్తోంది. ఆచారాల పేరుతో నరమాంసాన్ని తినే ఈ తెగను అస్మత్(Asmat) అని పిలుస్తారు. దాదాపు 65,000 మంది ఆయా దీవుల్లో జీవిస్తున్నారు. వీరికి 12 ఉపజాతి సమూహాలు ఉన్నాయి. ఈ జాతిలోని పురుషులు నిత్యం వేటకు వెళ్తుంటారు. శత్రువులు కనిపిస్తే.. వారికి ఇక పండగే. వారిని చంపేసి.. శవాలను ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వారి తలలను తింటారు. పుర్రె(కపాలం)ను సగానికి కోసి గిన్నెలుగా ఉపయోగిస్తారు.
తల చర్మాన్ని చెక్కి మంటపై కాల్చుతారు. ఆ తర్వాత వాటిని తమ కుటుంబ సభ్యులు లేదా స్థానికులతో కలిసి ఆరగిస్తారు. దవడ ఎముకలు, వెన్నెముక తదితర భాగాలను ఆభరణాలుగా చేసుకుని ధరిస్తారు. ఈ ఆభరణాలను పురుషత్వానికి చిహ్నంగా భావిస్తారు. అస్మత్ తెగ ప్రజలు తమ ఆచారాలను బలంగా నమ్ముతారు. వారి దృష్టిలో మనిషి అంటే ఒక చెట్టు. మనిషి తల ఒక పండు. అందుకే, వారిని చంపిన వెంటనే వారు చెట్టు నుంచి ‘పండు’ను తెంపినట్లుగా తలను నరికి తినేస్తారు. అలా తినడం వల్ల మరణించిన వ్యక్తికి చెందిన శక్తులు, నైపుణ్యాలు తమకు బదిలీ అవుతాయని నమ్ముతారు. ప్రముఖ వ్యాపారవేత్త మాగ్నెట్ జాన్ డి. రాక్‌ఫెల్లర్ మనవడు మైఖేల్ రాక్‌ఫెల్లర్‌ను అస్మత్ ప్రజలే చంపేశారనే ఆరోపణలు రావడంతో.. ఆ తెగ గురించి భయానక నిజాలు భయటపడ్డాయి.
Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)