Indigestion: అజీర్తి, పొట్ట సమస్యలు తగ్గించేందుకు ఈ ఒక్క మసాలా చాలు
పసుపు కూరలకి మంచి రుచి, రంగు ఇచ్చేందుకు మాత్రమే కాదు మెరుగైన జీర్ణశక్తిని అందిస్తుంది.
గ్యాస్, ఉబ్బరం వంటి పొట్ట సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి పసుపు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అజీర్ణ సమస్యల్ని తగ్గిస్తుందని నమ్మకం. ఇదే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపుని ఔషధంగా మార్చాయి. ఇవి GERD వ్యాధిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పేగు సిండ్రోమ్, డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలని పసుపు నయం చేస్తుంది. కర్కుమిన్, ఒమెప్రజోల్ అజీర్తిని తగ్గిస్తాయి. దీనిపై బీఏంజె ఏవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లో ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం పరిశోధకులు 206 మంది రోగులని పరిశీలినహారు. జనవరి 2019 నుంచి 2021 వరకు థాయ్ ట్రెడిషినల్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ లో ఈ పరిశోధన జరిగింది.
అధ్యయనం ఇలా సాగింది
69 మంది రోగులని పరిశీలించారు. వాళ్ళకి 250 ఎంజీ కర్కుమిన్ క్యాప్సూల్స్ ని రోజుకి నాలుగు సార్లు అందించింది. 68 రోగులతో కూడిన మరొక బృందానికి 20 ఎంజీ ఒమేప్రజోల క్యాప్స్యుల్స్, రెండు పెద్ద డమ్మీ క్యాప్స్యుల్స్ 4 సార్లు ఇచ్చారు. మరొక 69 మంది రోగులకి పసుపు, ఒమేప్రజోల ఇచ్చారు. వీరికి 250 ఎంజీ కర్కుమిన్ రెండు క్యాప్సూల్స్ రోజుకి నాలుగు సార్లు ఇచ్చారు. 28 రోజుల పాటు రోజుకి ఒకసారి 20 ఎంజీ ఒమేప్రజోల్ క్యాప్స్యుల్ మరొకటి ఇచ్చారు. పసుపు తీసుకున్న వారిలో అజీర్తి సమస్యలు తగ్గుముఖం పట్టాయి. 28 రోజుల తర్వాత అజీర్తి లక్షణాల తీవ్రతలో గణనీయమైన తగ్గింపు కనిపించింది. 56 వ రోజు మరింత ప్రభావవంతమైన మెరుగుదల కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు.
డిస్‌స్పెప్సియాకు పసుపు మందు
డిస్‌స్పెప్సియా(అజీర్తి) అనేది తరచుగా సంభవించే రుగ్మత. ఇది వివిధ కారణాల వల్ల సంభవిస్తుంది. ఈ పరిస్థితికి చికిత్స చేసేందుకు చాలా మంది పసుపు తీసుకుంటారు. వైద్యుల దగ్గరకి వెళ్ళకుండా పసుపు తీసుకుని తగ్గించుకుంటున్నట్టు తెలిపారు. ఈ వ్యాధి సాధారణ సంకేతాలు తినకుండానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి కనిపిస్తాయి. అజీర్ణం సంకేతాలు పెప్టిక్ అల్సర్ వ్యాధిని పోలి ఉంటాయి.
పసుపు ప్రయోజనాలు
సంప్రదాయ వైద్యంలో వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న స్పైసెస్ పసుపు. కర్కుమిన్ మంటని తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకుంటుంది. కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుని తగ్గించుకునేందుకు పసుపు కలిపిన పాలు తాగితే సత్వర ఉపశమనం లభిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.