Immunity Boosting Food: రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వాతావరణ మార్పు కారణంగా జలుబు, దగ్గు, దద్దుర్లు, చర్మ సంబంధ సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వాతావరణ మార్పు కారణంగా జలుబు, దగ్గు, దద్దుర్లు, చర్మ సంబంధ సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వానాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు జీర్ణ క్రియని మెరుగు పరుచుకోవలంటే మీ డైట్ లో వీటిని భాగం చేసుకోవాల్సిందే. అందుకే రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు మనం తప్పని సరిగా తీసుకోవాలి.
బీట్ రూట్
అనేక రకాల విటమిన్స్ తో పాటు పొటాషియం, ఇతర ఖనిజాల పోషకాల నిధి బీట్ రూట్. ఇది తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తపోటుని నియంత్రించడం, సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా నిలవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
నారింజ
వానాకాలంలో సిట్రస్ ఫుడ్ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ సి మనలో రోగనిరోధక శక్తి పెంచేందుకు దోహదపడుతుంది. అనీమియాతో బాధపడే వాళ్ళు ఇది తీసుకోవడం మంచిది.
నట్స్
రోగనిరోధక శక్తిని పెంచే రిచ్ మినరల్స్ ఫుడ్ ఇవి. వీటిలో విటమిన్ ఇ, నియాసిన్ మరియు రిబోఫ్లోవిన్ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
పుట్టగొడుగులు
ఫైబర్, ప్రోటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి తక్కువ కేలరీలు ఉండటంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
పెరుగు
రోగనిరోధక శక్తిని పెంచే మరో ఆహారం పెరుగు. ఇందులో ఉండే ప్రీబయాటిక్స్ జలుబు తీవ్రతని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది.
మాంసం
మాంసకృతుల్లో అన్నీ రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ B, జింక్, ఐరన్ మరియు ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటుంది.
టీ
టీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ టీ లో మాత్రం పాలు జోడించకుండా ఉండాలి. గ్రీన్ టీ వంటివి ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడతాయి.
Also Read: ఈ నాలుగు పండ్లలోని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో తినకండి
Also Read: చిన్న వయసులోనే మొహంలో ముడతలు కనిపిస్తున్నాయా? అవి తగ్గించేందుకు ఈ సలాడ్స్ మంచి ఎంపిక