Guava leaf tea: జామ ఆకుల టీ గురించి తెలుసా? చలికాలంలో తాగితే కలిగే ప్రయోజనాలివే!
Guava leaf tea benefits : జామ టీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
![Guava leaf tea: జామ ఆకుల టీ గురించి తెలుసా? చలికాలంలో తాగితే కలిగే ప్రయోజనాలివే! If you know the benefits of drinking guava leaf tea in winter, you will not leave it at all. Guava leaf tea: జామ ఆకుల టీ గురించి తెలుసా? చలికాలంలో తాగితే కలిగే ప్రయోజనాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/a00b0a1178e0b72cb4778b8d0b17b4dc1702898202647880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Tips in Telugu : మనం రకరకాల టీల గురించి వినే ఉంటారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ, మిల్క్, జింజర్ టీ, ఎల్లో టీ, హెర్బల్ టీ ఇలా ఎన్నో రకాల టీలను చూసే ఉంటారు. వాటిలో కొన్ని మీరు తాగే ఉంటారు. మరి మీరు జామ ఆకు టీ గురించి విన్నారా? చలికాలంలో జామ ఆకు టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట.
ప్రయోజనాలు ఇవే:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జామ ఆకు టీ తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకులలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇందులో ఉంటాయి. రోజుకు ఒక కప్పు జామ ఆకు టీ తాగడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు.
జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం:
జామ ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలో మంటను తగ్గించడంతోపాటు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జామ ఆకు టీలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా అనారోగ్యాలు దరిచేరవు.
జీర్ణ సమస్యలకు చెక్:
శీతాకాలంలో అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తుంటాయి. శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జామ ఆకుల్లో పుష్కలం. కాబట్టి చలికాలంలో జామఆకు టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. వివిధ అధ్యయనాలు ఈ ఆకులు హైపోగ్లైసీమిక్ సమ్మేళనాలను కలిగి ఉన్నాయని నిరూపించాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
జామ ఆకు టీ అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నందున చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ సమ్మేళనాలు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
జామ ఆకు టీ ఎలా తయారు చేయాలి?
కావలసినవి:
1 కప్పు నీరు
2-3 తాజా జామ ఆకులు
తేనె లేదా చక్కెర
తయారీ విధానం:
1. ఒక కప్పు నీటిని మరిగించండి.
2. 2-3 తాజా జామ ఆకులను బాగా కడిగి వేడినీటిలో వేయండి.
3. దీన్ని 5-7 నిమిషాలు ఉడకనివ్వండి.
4. టీని ఒక కప్పులో వడకట్టండి.
5. మీరు కావాలనుకుంటే తీపి కోసం తేనె లేదా చక్కెరను కలుపుకోవచ్చు.
గరిష్ట ప్రయోజనాల కోసం జామ ఆకు టీని రోజుకు 2-3 సార్లు త్రాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి మంచిది కదా ఏ టీ అయినా అతిగా తాగకూడదు. మితంగా తాగితేనే మేలు. కాబట్టి, మీరు ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఇలాంటి కొత్తరకం టీలు ప్రయత్నించాలి. లేకపోతే ఆరోగ్యానికే ముప్పు.
Also Read : మీ స్కిన్ టోన్ డార్క్ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్ రిమూవ్ చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)