Cows Milk: ఆవు ఆకుపచ్చని గడ్డి తింటే పాలు మాత్రం తెల్లగా ఉంటాయి ఎందుకు?
ఎంతోమందికి ఉన్న సందేహం ఇది. పాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయి? అని.
ప్రపంచంలో కొన్ని ప్రశ్నలు వినోదభరింగా అనిపించవచ్చు, కానీ దానికి సైన్స్ కచ్చితంగా ఒక జవాబును కనిపెట్టే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి... ఆవు ఆకుపచ్చని గడ్డి తింటే పాలు తెల్లగా ఉంటాయి ఎందుకు? అనేది. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే పానీయాలలో పాలు ఒకటి. ఇది గొప్ప పోషక విలువలను కలిగి ఉంటుంది. చాలా వంటల్లో దీన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఇంట్లో రోజు వాడే ఆహారంలో పాలు ఒకటి. అయితే ఈ పాలను అందించే గేదెలు, ఆవులు పసుపుగా ఉండే గడ్డి లేదా ఆకుపచ్చని గడ్డిని తింటాయి. అలా తింటున్నప్పుడు పాలు పసుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో రావాలి. కానీ తెల్లగా ఉంటాయి. దీనికి సైన్స్ వివరణాత్మకమైన జవాబును అందించింది.
ఆవు పొట్టలో పాలు ప్రధానంగా నీటితోనే తయారవుతాయి. పాల రకాన్ని బట్టి కొవ్వు, ప్రోటీన్, చక్కెర వంటివి ఉంటాయి. పాలల్లో ఉండే ప్రోటీన్లలో ముఖ్యమైనది కేసైన్. ఆవు పాలలో 80 శాతం కేసైన్ ఉంటుంది. ఇది ఒక ఫాస్పో ప్రొటీన్. దీనిలో భాస్వరం అణువులు ఉంటాయి. ఈ ప్రొటీన్ తెలుగు రంగులో ఉంటాయి. ఈ భాస్వరం అణువులు పాలల్లో మైకెల్స్ అని పిలిచే చిన్న అణువుల సమూహాలు ఏర్పడడానికి సహకరిస్తాయి. పాలపై కాంతి పడినప్పుడు సహజంగానే తెలుపు రంగులో ఉండే కేసైన్ అణువులు చెల్లాచెదురుగా అవుతాయి. అవి పాలల్లో 80 శాతం ఉంటాయి కాబట్టి వాటి తెలుపు రంగునే పాలు కూడా ప్రతిబింబిస్తుంది. పాలల్లో నీరు కలిసినప్పుడు పాలు దాని రంగును కోల్పోవడం మొదలుపెడుతుంది. ఎందుకంటే పాలల్లో ఉండే కేసైన్ రేణువులు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే నీళ్ల పాలు పలచగా ఉంటాయి. నీళ్ల కలపని పాలు కేసైన్‌లతో నిండుగా ఉండి తెల్లగా ఉంటాయి.
ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు పాలు తాగితే ఎంతో బలం. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. పాలల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పాలు రోజూ గ్లాసుడు తాగితే ఎలాంటి ప్రొటీన్ లోపం లేకుండా శరీరం బలంగా మారుతుంది. నిద్ర పోవడానికి పాలు సహకరిస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్న వారు రోజూ రాత్రి పాలు తాగితే మంచిది. మానసిక సమస్యలు ఉన్న వారు పాలు తాగితే మంచిది. ఇది డోపమైన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవడానికి సహకరిస్తుంది. ఇది ఉత్పత్తి అయితే మెదడు ప్రశాంతంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచేందుకు పాలు ఎంతో సహకరిస్తాయి. పాలల్లో కాస్త పసుపు కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడి వేడి పాలు తాగడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది.
Also read: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.