అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Relationships: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదు

బద్ధకస్తురాలైన భార్యతో వేగలేకపోతున్నాను అంటున్న ఒక భర్త కథనం ఇది.

ప్రశ్న: మా పెళ్లయి ఐదేళ్లు గడుస్తోంది. నా భార్య ఉద్యోగం చేయదు. ఇంట్లోనే ఉంటుంది. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉండి వస్తాను. ఆమె రోజంతా టీవీ చూస్తూ గడపడానికి ఇష్టపడుతుంది. ఇంట్లోని పనులను కూడా నన్నే చేయమని బలవంతం చేస్తుంది. నేను రోజంతా బయట కష్టపడి వచ్చి ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఆమె సోమరితనాన్ని చూస్తే చాలా కోపం వస్తుంది. కానీ నేను గట్టిగా మాట్లాడలేను. చాలా సౌమ్యుడిని. నా అభిప్రాయాలు చెప్పడానికి నాకు ధైర్యం ఉండదు. ఇంట్లో టీ, కాఫీలు నేనే చేయాల్సి వస్తోంది. ఆమె మాత్రం ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తూ గడుపుతోంది. కష్టపడి వచ్చిన భర్తను ఎలా చూసుకోవాలో ఆమెకి ఎవరూ చెప్పడం లేదు. ఇలాంటి గొడవలు పడకుండా నా భార్యను దారిలో పెట్టుకోవడం ఎలా?

జవాబు: మీరు రాసిన లేఖను బట్టి చూస్తుంటే మీరు ఎంతో సౌమ్యంగా ఉండే వ్యక్తులని అర్థం అవుతోంది. మీకు కోపం చూపించడం, అరవడం, తిట్టడం లాంటివి ఇష్టం లేదని  తెలుస్తుంది. అయితే మీ భార్య సోమరితనం మాత్రం మిమ్మల్ని చాలా ఆందోళనకు గురిచేస్తుంది. చిన్నచిన్న చిట్కాలు ద్వారా మీరు ఆమెను పనిచేసేలా చేయొచ్చు. కాకపోతే దానికి చాలా ఓపిక అవసరం. మీరు ఆమెతో నేరుగా నోటితో ఏమీ చెప్పలేనని, అరవలేనని, కోపం చూపించలేనని చెప్పారు. కాబట్టి ఒక నోట్ బుక్ తీసుకోండి. అందులోంచి ఒక పేజీని చించండి. మీరు ఆమెతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా రాయండి. మీకు ఏది ఇష్టం లేదో అది కూడా స్పష్టంగా రాయండి. మీకు ఏం కావాలో, ఆమె ప్రవర్తన వల్ల మీరు ఎంతగా మానసికంగా కుంగిపోతున్నారో వివరించండి. అలాగే మీ జీవితంలో ఆమె ఎంత ముఖ్యమో చెబుతూ పెద్ద లేఖను రాయండి. ఆ లేఖను ఆఫీస్ కి వెళ్లడానికి ముందు ఆమెకు ఇచ్చి వెళ్లండి. సాయంత్రం వచ్చాక ఆమెలోని మార్పు ఏమైనా కనిపిస్తుందేమో గమనించండి. మార్పు కనిపిస్తే మీరు అదృష్టవంతులే.

ఆమె మీ లేఖను చూసి కాస్త కలత చెందే అవకాశం ఉంది. ఆమె తీరును మళ్లీ మార్చడానికి కాగితాలనే ఆశ్రయించండి. ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లే ముందు ఆమెలో మీకు నచ్చిన లక్షణాన్ని కాగితంపై రాసి, ఆమెకు ఇచ్చి వెళ్లండి. ‘ నా భార్య ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నేను కృతజ్ఞుడిని’ అని రాయడం,  ఆమె వండిన వంట బాగుంటే ‘ఈరోజు నా భార్య చేసిన నువ్వు చేసిన వంటకం నాకు ఎంతో నచ్చింది’ అని మెచ్చుకోవడం వంటివి పేపర్ పై రాసి ఇచ్చి వెళ్లిపోండి. ఇలా ఎన్ని రోజులు పాటు కొనసాగితే అన్ని రోజులు పాటు ఆమె చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటూ ఉండండి. కొన్నాళ్లకు ఆమె పనికి అలవాటు పడడం ఖాయం. ఆమె గ్లాసు నీళ్లు తెచ్చినా కూడా కచ్చితంగా ఆమెకు కృతజ్ఞత చూపించండి. ఇది ఆమెపై మంచి ప్రభావమే చూపిస్తుంది. 

కాగితంపై రాయడం కష్టంగా ఉంటే వాయిస్ రికార్డ్ చేసి ఆమెకు పంపించండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ సౌమ్యంగా చెప్పండి. అలాగే ఆమెని ఎంతగా గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో కూడా వివరించండి. ఆమె మీకు ఏమేమి చేయాలని అనుకుంటున్నారో అవన్నీ చెప్పండి. మీ భార్య కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీ పనులను తగ్గించి మీకు శారీరక శ్రమ లేకుండా చూసుకునే అవకాశం ఉంది.

Also read: ఆస్తమా ఎందుకు వస్తుంది? వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget