Gelastic Seizures: ‘నవ్వు’ కూడా వ్యాధే.. ఈ చిన్నారి పరిస్థితి తెలిస్తే ఏడుపొస్తుంది
హైదరాబాద్‌కు చెందిన చిన్నారి అరుదైన మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. అసాధారణ నవ్వుతో మూర్ఛపోతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.
నవ్వు ఆరోగ్యానికి మంచిదే. పైగా చిన్నారులు నవ్వుతుంటే.. చాలా ముచ్చటగా ఉంటుంది. మన మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ, అసాధారణ నవ్వు.. ఏ మాత్రం మంచిది కాదు. ఒక వేళ మీ పిల్లలు నవ్వులో ఏదైనా లోపం కనిపిస్తే.. తప్పకుండా అప్రమత్తం కావాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ నవ్వులు మూర్ఛ వ్యాధికి దారి తీయొచ్చు. ఇందుకు ఈ చిన్నారి పరిస్థితే నిదర్శనం.
హైదరాబాద్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి Gelastic seizures (వెర్రిగా నవ్వుతూ మూర్ఛకు గురయ్యే వ్యాధి)తో బాధపడుతోంది. ఆమెకు చికిత్సకు అందించేందుకు తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యులను సంప్రదించారు. చివరికి ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స అందించారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. Gelastic seizures వ్యాధి ఉన్నట్లు నిర్ధరించారు. ఆమె హైపోథాలమస్(మెదడులో చిన్న చిన్న విధులను చేపట్టే చిన్ని భాగం)లో సెంటీమీటర్ గాయం ఉన్నట్లు కనుగొన్నారు.
బాధిత చిన్నారికి ఆరు నెలల కిందట నెలకు ఒకసారి మూర్ఛ వచ్చేది. అది దాదాపు పది సెకన్లు కొనసాగేది. రోజులు గడిచే కొద్ది మూర్ఛ వ్యాధి ముదురుతూ వచ్చింది. రోజుల్లో 5 నుంచి 6 సార్లు చిన్నారికి మూర్ఛ వచ్చేది. ఈ సందర్భంగా మూర్ఛ రావడానికి ముందు ఆమె వెర్రిగా నవ్వేదని తెలిసింది. ఈ వ్యాధి వల్ల ఆమెకు మెల్లకన్ను కూడా ఏర్పడింది. దీంతో న్యూరోసర్జన్, న్యూరోఫిజిషియన్, ఎండోక్రినాలజిస్ట్, శిశు వైద్యుల బృందం చిన్నారి సమస్య గురించి స్టడీ చేశారు. ఆమెకు హై ఎండ్ 3T MRIలో ఇమేజింగ్ (MRI బ్రెయిన్ ప్లెయిన్ కాంట్రాస్ట్) పరీక్షలు చేశారు. ఇందులో హైపోథాలమస్ నుంచి వెళ్లే నాళాలు, నరాలు కుదించికపోయి కణితి ఏర్పడింది. దానిపై చిన్న గాయం కూడా కనిపించడంతో వైద్యులు చికిత్స జరిపారు.
ఆమెకు చికిత్స అందించిన కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ‘‘చిన్నారి ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించాం. ఆ తర్వాత సాధారణ అనస్థీసియా ఇచ్చాం. చిన్న గాటు పెట్టి అత్యాధునిక విధానంలో చిన్నారికి సర్జరీ చేశాం. శస్త్ర చికిత్స తర్వాత చిన్నారికి మూర్ఛలు తగ్గాయి. ఇలాంటి సమస్య నవజాత శిశువుల్లో కూడా కనిపిస్తుందని వైద్యులు చెప్పారు. వారి నవ్వులో తేడా కనిపిస్తుంది. ప్రతి 200,000 మంది పిల్లలలో ఒకరు మాత్రమే ఈ అసాధారణ వ్యాధితో బాధపడతారు. వెర్రిగా నవ్వుతూ మూర్ఛ వ్యాధికి గురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి