అన్వేషించండి

Hypothyroidism: చలికాలంలో హైపో థైరాయడిజం సమస్య వేధిస్తుందా? ఇలా చేశారంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు!

థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండటం శరీరానికి చాలా అవసరం. అది తక్కువగా హార్మోన్లు విడుదల చేస్తే హైపో థైరాయిడిజం తలెత్తుతోంది.

మహిళల్లో ఎక్కువగా కనిపించే రుగ్మత థైరాయిడ్. ఈగ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరమంతా పడుతుంది. రోజువారీ జీవనానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేయడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ఎక్కువగా హార్మోన్లు విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అదే తక్కువ హార్మోన్లు విడుదల అయితే అది హైపో థైరాయిడిజం అని పిలుస్తారు. చలికాలంలో హైపో థైరాయిడిజం లక్షణాలు తీవ్రంగా బాధిస్తాయి. బరువు పెరగడం, అలసట, విపరీతమైన చలిగా అనిపించడం, డిప్రెషన్, మలబద్ధకం, చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. చల్లని వాతావరణం కారణంగా థైరాయిడ్ సరిగా పనిచేయడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

హైపో థైరాయిడిజం అంటే ఏంటి?

మయో క్లినిక్ ప్రకారం థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లని విడుదల చేయకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. ఇది శరీర పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించకపోతే కాలక్రమేణా చికిత్స చేయడానికి వీల్లేని పరిస్థితికి దారి తీస్తుంది. ఊబకాయం, వంధ్యత్వం, ఆర్థరైటిస్, గుండె సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

హైపో థైరాయిడిజం లక్షణాలు

ఈ వ్యాధి లక్షణాలు దాని తీవ్రతని బట్టి వేర్వేరు వ్యక్తుల్లో మారుతూ ఉంటాయి. అయితే సాధారణంగా కనిపించే సంకేతాలు ఇవి.

☀ తీవ్రమైన అలసట

☀ విపరీతమైన చలి

☀ దీర్ఘకాలిక మలబద్ధకం

☀ చర్మం పొడిబారటం

☀ బరువు పెరగడం

☀ కండరాల్లో బలహీనత, నొప్పి

☀ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం

☀ పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం

☀ జుట్టు రాలడం, సన్నబడటం

☀ డిప్రెషన్

☀ జ్ఞాపకశక్తి మందగించడం

☀ గొంతు బొంగురుపోవడం

☀ లైంగిక ఆసక్తి తగ్గిపోవడం

చలికాలంలో హైపో థైరాయిడిజం అదుపులో ఉంచుకోవడం ఎలా?

చల్లని వాతావరణం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ హైపో థైరాయిడిజం సమస్య వల్ల ఆ పరిస్థితి ఉండకపోగా ఇతర సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండలో కూర్చోవాలి

శరీరంలోని హార్మోన్లని ప్రభావితం చేసే ఉత్తమ మార్గాలలో ఒకటి సూర్యరశ్మి తగలడం. శరీరానికి ఎండ తగలడం వల్ల అలసట, నిరాశ దూరం చేసుకోవచ్చు. ఈ రెండు హైపో థైరాయిడిజం మీద ప్రభావం చూపిస్తాయి. సూర్యరశ్మి తగలడం వల్ల శరీరానికి సహజమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. థైరాయిడ్ పనితీరుకి ఇది కీలకం.

వ్యాయామం

ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల శరీరం చురుకుగా ఉండదు. అందుకే యాక్టివ్ గా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. నడక, ఏరోబిక్స్, యోగా, జుంబా వంటివి చేయడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్వీట్లు తినడం మానేయాలి

చలికాలం చాక్లెట్లు, కేకులు, రుచికరమైన డెజర్ట్ లు తినడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన చక్కెర హైపో థైరాయిడిజం సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే స్వీట్లు తీసుకోవడం పూర్తిగా మానేయడం మంచిది.

సరిపడినంత నిద్ర అవసరం

దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం సమస్యని తీసుకొస్తుంది. అందుకే 7-8 గంటల పాటు నిద్ర తప్పకుండా అవసరం.

ఒత్తిడి తగ్గించుకోవాలి

ఒత్తిడి అనేక అనారోగ్యాలకి ప్రధాన కారణం. థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చల్లని vs వేడి నీళ్ళు - ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget