By: ABP Desam | Updated at : 21 Dec 2022 11:49 AM (IST)
Image Credit: Pexel/Instagram
మధుమేహం రోగులకు భోజనం చేయడమంటే పెద్ద టాస్క్. ఎక్కడ చక్కెర స్థాయిలు పెరిగిపోతాయనే ఆందోళన వల్ల సంతృప్తిగా తినలేరు. అయితే, ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని తిన్నట్లయితే రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు పెరిగేందుకు అస్సలు అవకాశమే ఉండదంటున్నారు.
డయాబెటిస్ రోగులు సరైన డైట్ తీసుకుంటే సరిపోదు. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒకదాన్ని తర్వాత ఒకటి తీసుకోవాలి. కొన్ని అధ్యయనాలు మధుమేహం రోగులు కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చని చెప్పాయి. అయితే, తాజా అధ్యయనాలు మాత్రం ఇన్సులిన్ నిరోదకతను తగ్గించడానికి సమయానుసార భోజనం తప్పనిసరి అని కనుగొన్నాయి. సాధారణంగా చక్కెర ఎక్కువగా తీసుకుంటే మధుమేహం పెరుగుతుందని అంటారు. అందులో వాస్తవం ఉన్నా.. తీసుకొనే ఆహారాన్ని ఒక నిర్దిష్ట క్రమంలో తీసుకుంటే.. రక్తంలోని చక్కర స్థాయిలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా Type-2 మధుమేహం ఉన్నవారు ఒక నిర్ణిత క్రమాన్ని పాటించడం వల్ల చాలా ప్రయోజనం పొందుతారని అంటున్నారు. రోజును కూరగాయలతో ప్రారంభించి.. ఏదైనా స్వీట్‌తో ఎండ్ చేయాలని అంటున్నారు. ఇలా ఒక క్రమ పద్ధతిలో ఆహరం తీసుకుంటే రక్తంలోని చక్కర స్థాయిలు పెరిగే అవకాశాన్ని 75% వరకు తగ్గించవచ్చు.
Type-2 మధుమేహం అనేది దీర్ఘ కాలికంగా ఉండే జీవన శైలి రుగ్మత. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోదకత,ఇన్సులిన్ కావలసినంత లేకపోవడం లేదా రక్తంలోని చక్కర స్థాయిలు పెరగడం వల్ల వస్తుంది. దీన్ని సరైన సమయంలో పరీక్షించకపోయిన, నియంత్రించకపోయినా చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించకపోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన పరిణామాలు
భోజనాన్ని క్రమ పద్దతిలో తీసుకుంటే.. రక్తంలోని చక్కర స్థాయిలు ఎలా ప్రభావితం అవుతాయి?
Type-2 మధుమేహం ఉన్న వారు తీసుకునే భోజనంలోని పోషకాల క్రమాన్ని మార్చడం వల్ల, భోజనం తరువాత వారి రక్తంలోని చక్కర స్థాయిలు, ఇన్సులిన్ ఉత్పతులను ప్రభావితం చేస్తుందని నిపుణులు సేకరించిన సమాచారంలో తేలింది. ఈ అధ్యయనం కోసం నిపుణులు 15 మంది ప్రీ-డయాబెటిక్ వ్యక్తులను తీసుకొని వారికి ఒక క్రమంలో మూడు రోజుల పాటు ఒకే రకమైన భోజనాన్ని ఇచ్చారు. మొదటి రోజు ముందుగా కార్బోహైడ్రేట్స్ తో ప్రారంభించి తరువాతి 10 నిమిషాలకు ప్రోటీన్స్, కూరగాయలను ఇచ్చారు. రెండవ రోజు మొదటగా ప్రోటీన్స్, కూరగాయలతో ప్రారంభించి 10 నిమిషాల తరువాత కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు. మూడవ రోజు మొదట కూరగాయలతో ప్రారంభించి తరువాత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు.
ఇలా చేసిన తరువాత రక్తంలోని చక్కర స్థాయిలను పరీక్షించడానికి వారి రక్త నమూనాలను వరసుగా.. 0, 30, 60, 90, 150, 180 నిమిషాల వ్యవధిలో సేకరించారు. పరీక్షించిన రక్త నమూనాల ప్రకారం ముందుగా కార్బోహైడ్రేట్స్ తో భోజనాన్ని ప్రారంభించిన వారి కంటే ముందుగా ప్రోటీన్స్, వెజ్జీస్ తిన్న వారిలో రక్తంలోని చక్కెర స్థాయిలు 38% తక్కువగా నమోదయ్యాయి. నిపుణులు చెప్పిన ప్రకారం మనం తీసుకునే ఆహర పరిమాణాన్ని, వాటి భాగాలని మార్చినా, అంత తేడా ఏమి ఉండదు కానీ, తీసుకునే క్రమాన్ని మార్చితేనే చాలా తేడా వస్తుంది.
మధుమేహ రోగులలో బ్లడ్ షుగర్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ క్రింది ఆహార క్రమం సహాయపడుతుంది
మొదటగా కూరగాయలతో ప్రారంభించి.. ఆ తర్వాత ప్రోటీన్స్, కొవ్వులు, పిండి పద్ధార్థాలు, చివరిగా షుగర్స్ ఈ క్రమ పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటే మధుమేహం ఉన్న వారిలో రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లో కింది క్రమాన్ని రోజూ ఫాలో అవ్వండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
డేంజరస్ వ్యాధి బైపోలార్ డిజార్డర్, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Intermittent Fasting: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుష్షు పెంచుతుందా? అధ్యయనంలో ఏం తేలింది?
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతినే ప్రమాదం - డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే
Makeup Tips: ఈ మేకప్ టెక్నిక్స్ అసలు పాటించొద్దు, చర్మానికి హానికరం
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ