Holi Hangover Tips : హోలీ వేడుకల్లో భాంగ్ తాగారా? అయితే హ్యాంగోవర్‌ని తగ్గించే హోమ్ రెమిడీలు ఇవే
Holi Hangover : హోలీ సమయంలో చాలామంది భాంగ్ తీసుకుంటారు. అయితే దీనివల్ల హ్యాంగోవర్ ఎక్కువైతే.. ఈ టిప్స్ ప్రయత్నించండి. ఇవి మీకు హ్యాంగోవర్‌ని తగ్గించి రిలీఫ్ ఇస్తాయి.
Home Remedies for Holi Hangover : హోలీ అనేది రంగుల పండుగ. అయితే ఈ రంగులతో పాటు పలు రకాల స్నాక్స్, స్వీట్స్ ఉంటాయి. అన్నింటికీ మించి భాంగ్ ఉంటుంది. హోలీ ఆడే సమయంలో చాలామంది దీనిని తీసుకుంటారు. మ్యూజిక్, కలర్స్, స్నాక్స్, భాంగ్‌తో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. పండుగ మజాను పెంచుకోవడం కోసం దీనిని తీసుకుంటారు. అయితే భాంగ్‌ను అధిక మోతాదులో తీసుకోవడం హానికరం, కానీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే హ్యాంగోవర్‌కు కారణమవుతుంది. దీనిని సహజంగా తగ్గించుకోవడానికి ఇంట్లో కొన్ని చిట్కాలను ఫాలో అవ్వొచ్చు.
కొబ్బరి నీరు
హ్యాంగోవర్‌ని తగ్గించడంలో కొబ్బరినీరు బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా శరీరంలో తగ్గిపోయిన న్యూట్రిషన్స్‌ను తిరిగి అందిస్తాయి. హ్యాంగోవర్ సమయంలో డీహ్రైడేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తరచూ నీటిని తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల హ్యాంగోవర్ తగ్గడమే కాకుండా.. శరీరం నుంచి టాక్సిన్లు బయటకి పోతాయి. ఈ సమయంలో కూల్ డ్రింక్స్ తీసుకుంటే పరిస్థితి విషమిస్తుంది. కొబ్బరి నీరు వంటి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు హైడ్రేటెడ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
స్నానం
హ్యంగోవర్తో ఉన్నప్పుడు తలపగిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలామంచిది. కండరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది. ఒళ్లు నొప్పులుగా ఉంటే తగ్గుతాయి. హోలీ ఆడి భాంగ్ తీసుకుంటే ఇంటికొచ్చి కచ్చితంగా వేడినీటితో స్నానం చేయండి. ఇది మీకు మెరుగైన నిద్రను కూడా అందిస్తుంది.
నిద్ర ముఖ్యం
తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ తగ్గుతుంది. మీరు దానిని నుంచి త్వరగా బయటపడతారు. ఇది మీ శరీరానికి విశ్రాంతినివ్వడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి వీలైనంతగా పడుకోవడానికి ట్రై చేయండి. నిద్ర తీరిపోతే.. హ్యాంగోవర్ తగ్గిపోతుంది.
హెల్తీ ఫుడ్
హ్యాంగోవర్‌తో ఉన్నప్పుడు మసాలా, స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. ఇది పరిస్థితిని ఇంకా దారుణం చేస్తుంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఇవి మీ శరీరానికి పోషకాలను అందించి.. శక్తిని చేకూరుస్తాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ వంటి ప్రోటీన్ ఫుడ్ మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఇంకా మంచిది.
అల్లం టీ
వేడిగా అల్లం టీని చేసుకుని తాగండి. ఇది వికారాన్ని పోగొట్టి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మీకు అల్లం టీ తాగాలని లేకుంటే దానిని నేరుగా తినొచ్చు. లేదంటే యూకలిప్టస్ ఆయిల్ వాసన చూసినా.. రిలాక్స్ అవుతారు.
ఈ ఇంటి చిట్కాలు హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి. కానీ పూర్తిగా నివారిస్తాయని కాదు. ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే.. కచ్చితంగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. లేదంటే పరిస్థితి దారుణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read : హోలీ సమయంలో కళ్లను ఇలా కాపాడుకోండి.. లేదంటే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.