Eye Care Tips During Holi : హోలీ సమయంలో కళ్లను ఇలా కాపాడుకోండి.. లేదంటే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది
Holi 2024 : హోలీ తర్వాత చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కలర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
Protect Eyes During Holi : ఇండియాలో ఎలాంటి బేధాలు లేకుండా చాలామంది చేసుకునే పండుగల్లో హోలీ ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగులు చల్లుకుంటూ.. దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ పండుగ సెలబ్రేట్ చేసుకునే సమయంలో కొందరు స్కిన్, హెయిర్ సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఎక్కువమంది కంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అనుకోకుండా కంటిలో పడే రంగులు.. కంటికి హాని చేస్తాయి. ముఖ్యంగా కెమికల్స్ కలిగిన రంగులు కంటిచూపుపై బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే కంటిని జాగ్రత్తగా చూసుకుంటూ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బలవంతం చేయకండి..
పండుగల సమయంలో కొన్నిసార్లు కొందరిని ఫ్రెండ్స్ బలవంతం చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఇతరులను హోలీ ఉత్సవాల్లో పాల్గొనాలని బలవంతం చేయకండి. ఎందుకంటే వారు అలెర్ట్‌గా లేకపోతే.. కళ్లల్లో రంగులు పడే అవకాశముంటుంది. కెమికల్స్ కలిగిన రంగులు ఉపయోగిస్తే.. మీ ఫ్రెండ్ విషపూరితమైన రంగులు పీల్చుకుంటారు. లేదంటే వారి కళ్లలోకి రంగులు వెళ్లి ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ మీద రంగులు ఉపయోగించే ముందు వారిని అలెర్ట్ చేయండి.
వాటికి దూరంగా ఉండండి..
మార్కెట్లో లభించే చాలా రంగుల్లో పాదరసం, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి, ముఖ్యంగా కళ్లకు చాలా సమస్యలు కలిగిస్తాయి. కంటిలో ఈ రంగులు పడినప్పుడు చికాకు, ఎరుపు, అలెర్జీలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో దృష్టిని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే హోలీకి ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి సహజమైన రంగులు, పువ్వులు ఆశ్రయిస్తే మంచిది. ఇవి మంచి సువాసనను అందించడమే కాకుండా.. చర్మంపై కూడా ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వవు. కంటి సమస్యలు కూడా ఉండవు.
కళ్లద్ధాలు ధరించండి
మీరు ఆడే రంగులు కెమికల్స్ అయినా.. సహజమైనవి అయినా.. కంటికి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లద్దాలు, జీరో పవర్ గ్లాసెస్ లేదా షేడ్స్‌తో కళ్లను సంరక్షించుకోవాలి. కళ్లలోకి రంగు వెళ్లకుండా వీటిని అడ్డు పెట్టుకోవాలి. చర్మాన్ని రక్షించుకునేందుకు స్కార్ఫ్ కూడా కట్టుకుంటే మంచిది.
కాంటాక్ట్ లెన్స్ వాడకపోవడమే మంచిది..
హోలీ సమయంలో కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోకపోవడమే మంచిది. ఒక వేళ రంగు కంటిలో పడితే.. కాంటాక్ట్ లెన్స్ కంటిలోనే రంగులు ఉండిపోయేలా చేస్తాయి. తర్వాత అది ఇబ్బందిని తీవ్రం చేస్తుంది. అంతేకాకుండా లెన్స్‌లను పెట్టుకోవడానికి, తీయడానికి రంగులతో నిండిన చేతులను ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల అంటువ్యాధులు కలిగిస్తాయి. ఇది కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకునే వ్యక్తుల్లో కంటి చూపును కోల్పోయేలా చేస్తుంది.
మరిన్ని జాగ్రత్తలు
రంగులతో నిండిన చేతులను కళ్లల్లో పెట్టకండి. రంగులు పడకుండా కంటిని, ముక్కును రక్షించుకోవడానికి చేతులను అడ్డుగా ఉపయోగించవచ్చు కానీ.. కళ్లలో మాత్రం పెట్టుకోకండి. ఇవి ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసి.. కంటి చూపును దెబ్బతీస్తాయి. కంటిలో ఏదైనా పడితే వెంటనే నీటితో కడగాలి. అంతేకానీ కళ్లను రుద్దకూడదు. కంటిలో రంగుపడితే.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అంతే తప్పా సొంత వైద్యం చేయకూడదు. ఐ డ్రాప్స్ కూడా వేసుకోకూడదు. లేదంటే అవి కంటిలో కెమికల్ రియాక్షన్స్ కలిగిస్తాయి. కళ్లను రక్షించుకుంటూ.. చర్మానికి ఇబ్బంది లేకుండా హోలీని సెలబ్రేట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Also Read : ఈ ఫేస్ మాస్క్‌లు సింపుల్‌గా హోలీ కలర్స్ పోగొడతాయి.. స్కిన్ డ్యామేజ్‌ని కూడా తగ్గిస్తాయి