High Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
High Cholesterol Risks : కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఎక్కువకాకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువైతే జరిగే ఇబ్బందులు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips to Reduce High Cholesterol : కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరం. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఇస్తుంది. మీరు తీసుకునే ఆహారం, లైఫ్‌స్టైల్, కాలేయం వల్ల శరీరానికి అవసరమైన కొవ్వును తయారు అవుతుంది. అయితే దీనిలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది చేస్తుంది కానీ.. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ప్రమాదకరమైన సమస్యలను అందిస్తుంది. మరి దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటో.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే ప్రమాదాలు
సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL (low-density lipoprotein) పేరుకుపోతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోయి.. ధమనుల్లో అడ్డంకులు కలిగిస్తుంది. రక్తప్రసరణను తగ్గిస్తుంది. బీపీ సమస్యలు పెరుగుతాయి. గుండె జబ్బులకు దారి తీస్తుంది. స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది శరీరంలో నొప్పులకు దారి తీస్తుంది. అలాగే ఒబెసిటీ, మధుమేహ ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతాయి.
తగ్గించుకోవాల్సిన టిప్స్ ఇవే..
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యసహాయంతో పాటు.. లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనిని నెగ్లెక్ట్ చేసే కొద్ది ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే దీనిని సీరియస్‌గా తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారంలో చేయాల్సిన మార్పులు
శరీరానికి శాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ అందించడం తగ్గించాలి. రెడ్ మీట్, బటర్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే డెయిరీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. బర్గర్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వంటివి పూర్తిగా మానేయాలి. ఓట్స్, బీన్స్, ఫ్రూట్స్, కూరగాయలు, మల్టీగ్రైన్ వంటి ఫైబర్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఫిష్, అవిసె గింజలు, వాల్నట్స్ తీసుకుంటే మంచిది. ఆలివ్ ఆయిల్ వాడితే ఇంకా మంచిది.
జీవనశైలిలో చేయాల్సిన మార్పులివే..
ఎక్కువసేపు కూర్చోవడం, ఫుడ్ తీసుకుంటూ ఎలాంటి వ్యాయమం చేయకపోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి.. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది. ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండే వ్యాయామాలు మంచి ఫలితాలు ఇస్తాయి. స్మోకింగ్ మానేస్తే మంచిఫలితాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి.
ఈ మార్పులను లైఫ్స్టైల్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ కచ్చితంగా కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. మెరుగైన ఫలితాల కోసం వైద్యుల సహాయం తీసుకోవాలి.






















