అన్వేషించండి

High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త

High Blood Pressure Symptoms : శరీరంలో బీపీ పెరుగుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. వాటిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. మరి దీనిని ఎలా గుర్తించాలో.. సంకేతాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక రక్తపోటు ఎటువంటి లక్షణాలు లేకుండా అవయవాలను దెబ్బతీస్తుంది.
  • తలనొప్పి, అలసట, ఆయాసం, చూపు మసకబారడం వంటివి సంకేతాలు.
  • ఛాతి నొప్పి తీవ్రమైనది; ఉప్పు తగ్గించి వ్యాయామం చేయాలి.

Warning Signs of Hypertension : అధిక రక్తపోటు ఉన్నా చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. రోజువారీ పనులు చేసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తుంటారు. కానీ ఎక్కువకాలం బీపీ కంట్రోల్​లో లేకపోతే గుండె, మెదడు, మూత్రపిండాలు, కళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి హై బీపీని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

సైలెంట్ కిల్లర్

రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడి సాధారణ స్థాయిని మించి ఉంటే దానినే అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో చాలామందికి ప్రారంభ దశలో ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 128 కోట్ల మంది హైబీపీతో బాధపడుతున్నారు. వీరిలో చాలామందికి తమకు బీపీ ఉన్న విషయమే తెలియదట.

Also Read : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి

బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె రక్తాన్ని శరీరమంతా పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువకాలం ఈ పరిస్థితి కొనసాగితే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యల ముప్పు పెరుగుతుంది. అందుకే బీపీని ముందుగానే గుర్తించాలి. శరీరం ఇచ్చే సంకేతాలు విస్మరించకూడదు. అవేంటో చూసేద్దాం. 

ఉదయాన్నే తలనొప్పి

ఉదయం నిద్రలేవగానే తల బరువుగా అనిపించడం లేదా తలనొప్పి రావడం కొందరిలో కనిపిస్తుంది. అయితే తలనొప్పికి నిద్రలేమి, ఒత్తిడి, మైగ్రేన్ వంటి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి తలనొప్పి ఉంటే బీపీ పెరిగిందని అనుకోకూడదు. రెగ్యూలర్​గా ఇబ్బంది పడుతుంటే చెక్ చేయించుకోవాలి.

అలసటగా ఉండటం

తగినంత నిద్రపోయినా రోజంతా నీరసంగా ఉండటం.. సాధారణ పనులు చేయడానికి కూడా ఎనర్జీ సరిపోకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. అలసటకు రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఈ సమస్య తరచూ ఎదురైతే వైద్యుల సలహా తీసుకోవాలి.

Also Read : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే

ఆయాసం రావడం

మెట్లు ఎక్కేటప్పుడు, కొద్దిదూరం నడిచేటప్పుడు లేదా ఇంటి పనులు చేసేటప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఆయాసం వస్తోందా? ఈ సమస్య కొత్తగా మొదలైతే దానిని సాధారణ అలసటగా భావించకూడదు. గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ముక్కు నుంచి రక్తం 

ముక్కు నుంచి రక్తం కారడానికి పొడి వాతావరణం, ముక్కులోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతినడం, అలర్జీలు వంటి కారణాలు ఉండవచ్చు. బీపీ ఎక్కువగా ఉన్నవారిలో కూడా కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తం రావచ్చు. 

చూపు మసకబారితే..

అధిక రక్తపోటు దీర్ఘకాలం పాటు నియంత్రణలో లేకపోతే కళ్లలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల చూపుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అయితే చూపు మసకబారడానికి ఇతర కంటి సమస్యలు కూడా కారణం కావచ్చు.

Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

నిద్ర సరిగా పట్టకపోవడం

రాత్రిపూట తరచూ మేల్కొనడం, నిద్రలో బిగ్గరగా గురక పెట్టడం, నిద్రపోయినా పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వంటి సమస్యలు ఉంటే వాటిని గమనించాలి. నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటే స్లీప్ అప్నియా సమస్య ఉండే అవకాశం ఉంది.

ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం

ఛాతిలో బిగుతుగా అనిపించడం, నొప్పి రావడం లేదా ఒత్తిడి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గుండెకు సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. అధిక రక్తపోటు గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. ఛాతిలో నొప్పితో పాటు ఆయాసం, చల్లని చెమటలు, వికారం లేదా చేతి, దవడ, వీపు వైపు నొప్పి ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే

కోపం, ఒత్తిడి 

మానసిక ఒత్తిడి, కోపం వచ్చినప్పుడు రక్తపోటు తాత్కాలికంగా పెరగవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్ర, ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనంపై ప్రభావం చూపవచ్చు. ఇవన్నీ బీపీ నియంత్రణను కష్టతరం చేయవచ్చు.
అయితే కోపం ఎక్కువగా రావడం లేదా చిరాకు కలగడం హై బీపీకి నిర్దిష్ట లక్షణాలు కావు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక, శ్వాస వ్యాయామాలు, తగినంత నిద్ర వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. వీటితో పాటు రక్తపోటును కూడా క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.

హై బీపీని నియంత్రించే చిట్కాలు..

బీపీ పెరిగినట్లు అనుమానం వస్తే.. ఉప్పు తగ్గించండి. WHO ప్రకారం రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అధిక బరువు ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో క్రమంగా తగ్గడం మంచిది. అలాగే రోజూ తగినంత నిద్రపోవాలి. ఒత్తిడి తగ్గించుకోండి. బీపీ మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా వాటిని ఆపకూడదని వైద్యులు చెప్తున్నారు.

Also Read : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget