By: ABP Desam | Updated at : 23 May 2022 10:07 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఇప్పుడు ఎక్కువ మందిని కలవరపెడుతున్న ఆరోగ్యసమస్య. సాధారణంగా కనిపించే ఈ సమస్య తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది.రక్తనాళాల్లో రక్తం స్థిరంగా ప్రవహించినప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు, అదే రక్తం చాలా వేగంగా ధమని గోడలను గుద్దుకుంటూ వెళ్లినప్పుడు రక్తపోటు విపరీతంగా పెరిగి అధికరక్తపోటు ఎటాక్ అవుతుంది. దీని వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. 120/80mmHg కన్నా రక్తపోటు రీడింగు దాటితే కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. 140/90mmHg రీడింగు దాటితే అది అధికరక్తపోటు కిందకే వస్తుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నా ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటూ ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి.
ఆ పండు జ్యూస్ తో...
అధిక రక్తపోటు ఉన్న వారు రోజూకో అరగ్లాసు దానిమ్మ రసం తాగితే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వారు చేసిన అధ్యయనంలో దానిమ్మ రసం నిత్యం తాగే వారిలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతున్నట్టు తేలింది. ఒక కప్పు దానిమ్మ రసంతా తాగితే డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించడానికి అవసరమని చెబుతున్నారు పరిశోధకులు.అంతేకాదు దానిమ్మరసం ధమనులలోని కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అయితే దానిమ్మ రసానికి చక్కెరను జోడించకుండా తింటేనే మంచి ఫలితం వస్తుంది. చక్కెర వేయడం సమస్య ఇంకా పెరిగిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నరు చక్కెర కలిపిన జ్యూస్ లను తాగడం తగ్గించాలి.
అధికరక్తపోటు ఉన్న వారికే కాదు సాధారణ వ్యక్తులకు కూడా దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం చాలా ముఖ్యం. ఇందులో ఫొలేట్, విటమిన్ సి వంటి పోషకాలు లభిస్తాయి. మిగతా పండ్ల రసాలతో పోలిస్తే దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఆఖరికి గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ వంటి వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కన్నా ఇందులోనే అధికం. రక్తహీనత సమస్య ఉన్న వారు రోజూ దానిమ్మ పండు తింటే ఎంతో మేలు. ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
అధిక రక్తపోటు కంట్రోల్ చేయాలంటే ఉప్పును తగ్గించాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. అధిక బరువు ఉన్న వారు వెంటనే బరువు తగ్గాలి. కాఫీలు అధికంగా తాగే అలవాటు ఉంటే మానుకోవాలి. కెఫీన్ వల్ల కూడా కూడా రక్తపోటు పెరుగుతుంది.
Also read: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
Also read: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
WaterMelons: ఆ దేశంలో డబ్బులకు బదులు పేమెంట్గా పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలు, ఎందుకలా?
Optical Illusion: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు
Height: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట
Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే
Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్