అన్వేషించండి

Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త

Blood Pressure : బీపీ పెరగడానికి ఉప్పు ఒక్కటే కాదు.. మీ రోజువారీ అలవాట్లు కూడా కారణం కావచ్చు. హై బీపీ ఉన్నవారు, బీపీ రాకూడదనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉప్పు ఒక్కటే కాదు, జీవనశైలి అలవాట్లు రక్తపోటు పెంచుతాయి.
  • కూర్చోవడం, నిద్రలేమి, ఒత్తిడి, మద్యపానం బీపీకి కారణాలు.
  • బరువు పెరగడం, కొన్ని మందులు కూడా రక్తపోటును ప్రభావితం చేస్తాయి.
  • లక్షణాలు లేకున్నా, తరచూ బీపీని పరీక్షించుకోవడం ముఖ్యం.

Habits That Can Increase Blood Pressure Risk : బీపీ ఉందంటే చాలామంది ముందుగా ఉప్పు తగ్గించమని చెబుతారు. కానీ నిజానికి అధిక రక్తపోటుకు ఉప్పు ఒక్కటే కారణం కాదు. రోజూ గంటల తరబడి కూర్చోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడిని పట్టించుకోకపోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు కూడా కాలక్రమేణా రక్తపోటుపై ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు నిపుణులు. 

ముఖ్యంగా అధిక రక్తపోటు చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించదు. కానీ ఒకేసారి తీవ్రమైన ఇబ్బందిని కలిగించవచ్చు. అందుకే రోజువారీ జీవనశైలిపై శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం కూడా ముఖ్యం. మరి తెలియకుండానే బీపీ ప్రమాదాన్ని పెంచే 7 అలవాట్లు ఏంటో.. అవి రక్తపోటును ఏవిధంగా ఎఫెక్ట్ చేస్తాయో చూసేద్దాం.

Also Read : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి

ఉప్పు ఎక్కువగా ఫుడ్స్

భోజనంలో ఉప్పు తక్కువగా వేసుకున్నా.. పచ్చళ్లు, పాపడ్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్, సాస్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఉప్పు డబ్బాను పక్కన పెట్టడం మాత్రమే కాదు.. రోజూ తినే ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే 2023లో JAMAలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ సోడియం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కొంతమందిలో సిస్టోలిక్ బీపీ తగ్గినట్లు గుర్తించారు.

రోజంతా కుర్చీలోనే ఉండిపోవడం

ఉదయం అరగంట వాకింగ్ చేశాం కదా.. ఇక రోజంతా కూర్చున్నా పర్వాలేదు అనుకుంటున్నారా? అలా కాదు. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల బరువు పెరగడం, జీవక్రియ సమస్యలు, రక్తనాళాల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఆఫీసులో పనిచేసేవారు గంటకోసారి లేచి నడవడం మంచిది. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నడవడం, చిన్న చిన్న మూవ్‌మెంట్ బ్రేక్స్ తీసుకుంటే బెటర్.

Also Read : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే

ఆల్కహాల్‌ ఎక్కువగా తాగడం

మందు అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు అనే ఫీలింగ్తో చాలామంది ఆల్కహాల్‌ను తరచుగా తీసుకుంటుంటారు. అయితే క్రమం తప్పకుండా లేదా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇప్పటికే బీపీ ఉన్నవారికి అయితే బీపీని అదుపులోకి తెచ్చుకోవడం కష్టమవుతుంది. 

నిద్రను పట్టించుకోకపోవడం

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం, పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడడం చాలామందికి సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ సరైన నిద్ర లేకపోవడం రక్తపోటుపై ప్రభావం చూపవచ్చు. గురక ఎక్కువగా రావడం, నిద్రలో ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపించడం, ఉక్కిరిబిక్కిరి అవుతూ మేల్కొనడం, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. 

Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒత్తిడిలోనే ఉండటం

ఆఫీస్ డెడ్‌లైన్స్, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు.. ఇలా ఒత్తిడికి కారణాలు ఎన్నో ఉంటాయి. స్ట్రెస్ అనేది ఒక్కరోజులో బీపీ సమస్యను తీసుకురాకపోవచ్చు. కానీ నిరంతరం ఒత్తిడిలో ఉంటే.. అది మీ నిద్ర, ఆహారం, వ్యాయామం వంటివాటిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ పరోక్షంగా రక్తపోటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి రోజులో కొంత సమయమైనా మీ కోసం కేటాయించుకోవడం, వాకింగ్ చేయడం, రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రయత్నించడం మంచిది.

మందులు వాడటం

తలనొప్పి, జలుబు లేదా ఇతర చిన్న సమస్యలకు మనం తరచూ మెడికల్ షాప్‌లో మందులు తీసుకుంటుంటాం. కానీ కొన్ని పెయిన్ కిల్లర్స్, ముక్కు దిబ్బడ తగ్గించే మందులు కొందరిలో రక్తపోటును పెంచవచ్చు లేదా బీపీ మందుల ప్రభావానికి ఆటంకం కలిగించవచ్చు.
కాబట్టి బీపీ రీడింగ్స్ అకస్మాత్తుగా పెరుగుతుంటే.. మీరు తీసుకుంటున్న ప్రిస్క్రిప్షన్ మందులతో పాటు ఓవర్-ది-కౌంటర్ మందులు, సప్లిమెంట్ల గురించి కూడా వైద్యుడికి చెప్పడం మంచిది.

Also Read : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే

బరువును పట్టించుకోకపోవడం

ఒక్కసారిగా కాకుండా నెలలు, సంవత్సరాల వ్యవధిలో రెండు మూడు కిలోలు పెరిగితే చాలామంది దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ క్రమంగా బరువు పెరిగితే.. అది గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడి కలిగించవచ్చు. అందుకే ఒక్కసారిగా కఠినమైన డైట్‌లు చేయడం కంటే.. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు అదుపులో ఉంచుకోవాలి.

రోజూ చేసే ఈ చిన్న అలవాట్లను మార్చుకోవడంతో పాటు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. రీడింగ్స్ పదేపదే ఎక్కువగా వస్తుంటే.. ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. లేదంటే ఈ సైలెంట్ కిల్లర్ మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు పెరుగుతాయి.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Henna or Hair Colour : తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా బెటరా? లేదా కలర్ వేసుకోవాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే  
తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా బెటరా? లేదా కలర్ వేసుకోవాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే  
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget