(Source: Poll of Polls)
Thyroid Warning Signs : మహిళల్లో థైరాయిడ్ లక్షణాలు ముందే గుర్తించండి.. హెచ్చరిక సంకేతాలు ఇవే
Thyroid Early Signs : థైరాయిడ్ సమస్య వచ్చే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. వాటిని ముందే గురిస్తే సమస్య తీవ్రం కాకుండా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే..
Warning Signs for Early Detection of Thyroid : మహిళల్లో హార్మోనల్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా వచ్చే ప్రధానమైన సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ముఖ్యంగా చాలా మంది స్త్రీలు థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ వల్ల కలిగే వివిధ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వారిని శారీరకంగా, మానసికంగా కృంగదీస్తాయి. అందుకే థైరాయిడ్ సమస్యను తేలికగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. సమస్య వచ్చే ముందే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉంటాయని.. వాటిని తేలికగా తీసుకోకుండా ఉంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉండదని చెప్తున్నారు.
హెచ్చరిక సంకేతాలు ఇవే
థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఓ గ్రంధి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు ట్రైయోడోథైరోనిన్, థైరాక్సిన్ ఉత్పత్తి చేయడం ద్వారా శరీరంలో వివిధ జీవక్రియ ప్రక్రియలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అందుకే థైరాయిడ్ లక్షణాలు వస్తే వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ముందుగానే చికిత్స తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ థైరాయిడ్ హెచ్చరిక సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసట
థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తాయి. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఎక్కువగా అలసటగా ఉంటారు. విశ్రాంతి తీసుకున్నా సరే.. ఎక్కువగా అలసిపోతారు.
బరువులో మార్పులు
బరువులో మార్పులు థైరాయిడ్ సమస్యలో ప్రధాన సంకేతాలు. ఎందుకంటే ఈ గ్రంధి జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దానివల్ల బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం వల్ల బరువు పెరిగితే.. హైపర్ థైరాయిడిజం వల్ల బరువు తగ్గుతారు.
మూడ్ స్వింగ్స్
థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను బాగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా డిస్టర్బ్‌గా ఫీలవుతారు. ఈ హార్మోన్లలో అసమతుల్యత న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది మానసిక కల్లోలం, చిరాకు, ఆందోళన లేదా నిరాశకు దారితీస్తుంది.
పీరియడ్స్‌లో మార్పులు
మహిళలకు ఏ సమస్య వచ్చినా అది ముందుగా పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్‌లో కూడా అంతే. పీరియడ్స్‌కు థైరాయిడ్ అంతరాయం కలిగిస్తుంది. సరైన సమయానికి పీరియడ్స్ రాకపోవడం, బ్లీడింగ్‌లో సమస్యలు ఉంటాయి.
మరిన్ని సమస్యలు
చర్మం పొడిగా మారడం, జుట్టు రాలిపోవడం, గోర్లు పలచబడిపోవడం, జీర్ణ సమస్యలు, కండరాలు, కీళ్లనొప్పులు, నిద్ర సమస్యలు ఉంటాయి. అయితే హైపోథైరాయిడిజం ఉన్నవారికి నిద్రలేమి సమస్యలు ఉంటే.. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు అధిక మొత్తంలో నిద్రపోవడానికి కారణమవుతాయి. మెడలో వాపు కనిపిస్తుంది. నొప్పిలేకపోయినా.. మింగడంలో ఇబ్బంది కలుగించవచ్చు. మలబద్ధకం వంటి సమస్యలు వేధించవచ్చు. ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారికి చలి ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం అధిక వేడి అనుభూతి ఇస్తుంది. ఈ సంకేతాలు గుర్తిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. టెస్ట్‌లు చేయించుకుని.. సమస్య ఉంటే కోర్స్ వాడుతూ.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. వీటివల్ల సమస్య కంట్రోల్లో ఉంటుంది.
Also Read : టైప్ 2 డయాబెటిస్‌ను పెంచేస్తున్న రెగ్యూలర్ ఫుడ్స్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు