Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు
బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
కొంతమందికి పొద్దునే లేవగానే కాసింత కాఫీ గొంతులో పడనిదే బెడ్ కూడా దిగబుద్ది కాదు. ఎక్కువ మంది టీ కంటే కాఫీనే ఇష్టపడతారు. రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కూడా మరికొంతమంది కాఫీ తాగి రిఫ్రెష్ అవుతారు. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే సరైన పద్ధతిలో కాఫీ తీసుకుంటే మీకు అనేక వ్యాధులని కూడా ఇది నయం చేస్తుంది. పాలు, చక్కెర ఉండే కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గుండెకి మేలు: బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరిగినప్పటికి కాలక్రమేణా అది తగ్గిపోతుంది. ప్రతి రోజు ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల స్ట్రోక్ వంటి గుండె సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. శరీరంలో వచ్చే వేడి ఆవిర్లు కూడా తగ్గేలా చెయ్యడంలో సహకరిస్తుంది. కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: రోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే అది కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పులు తాగితే మాత్రం మధుమేహం వచ్చే ప్రమాద ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి షుగర్ లేవల్స్ అదుపులో ఉంచుతుంది. కెఫిన్, డీకాఫిన్ లేని కాఫీ రెండూ మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి. బెల్లం కాఫీ బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది: దైనందిన జీవితంలో పలు విషయాలు మనల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యకి దారి తీస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు లేదా టెన్షన్‌గా ఉన్నప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీని తీసుకుంటే మంచి అనుభూతిని ఇస్తుంది. కాఫీ కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరుస్తుంది. మానసిక స్థితిని పెంచడంలో సహాయపడే ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్లు అయిన డోపమైన్, సెరోటోనిన్, నోరాడ్రినలిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
కాలేయానికి మేలు: శరీరంలో కీలకమైన అవయవం కాలేయం. బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ క్యాన్సర్, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇది రక్తంలో హానికరమైన కాలేయ ఎంజైమ్‌ల స్థాయిని కూడా తగ్గిస్తుంది.
పొట్టని శుభ్రం చేస్తుంది: బ్లాక్ కాఫీ తాగడం వల్ల పొట్టని శుభ్రం చేస్తుంది. చక్కెర లేకుండా కాఫీ తాగడం వల్ల మూత్రం ద్వారా టాక్సిన్స్, బ్యాక్టీరియాను సులభంగా బయటకి పంపిస్తుంది.
వర్క్ అవుట్స్ సెషన్ పనితీరు మెరుగుపరుస్తుంది: బ్లాక్ కాఫీ శారీరక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వర్క అవుట్ సెషన్‌లో తక్షణ శక్తిని అందిస్తుంది. రక్తంలో ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడం ద్వారా పనిచేస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: ఈ భారీ థాలీని పూర్తిగా తింటే రూ.8.5 లక్షల బహుమతి, మోడీ పుట్టినరోజు స్పెషల్
Also read: వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ రసాన్ని పిండి తప్పు చేస్తున్నాం - చెబుతున్న పోషకాహార నిపుణులు