By: ABP Desam | Updated at : 28 Dec 2022 12:25 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
శరీరానికి విటమిన్-D అందాలంటే సూర్యరశ్మి అవసరం. చలికాలంలో ఉదయం పూట సూర్యరశ్మి తగలడం అంటే కొంచెం కష్టం. బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే గడుపుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఉదయం బయటకి వచ్చే వారి సంఖ్య మరింత తగ్గిపోయింది. నిద్రలేవగానే ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని వర్క్ లో బిజీ అయిపోతున్నారు. దీని వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరం అవుతున్నారు. శరీరానికి అవసరమైన సూర్యరశ్మిని తరచుగా కోల్పోతున్నారు. అనేక వ్యాధులని నివారించడానికి ప్రతిరోజు శరీరానికి తగినంత సూర్యరశ్మి అవసరం.
ఆహార పదార్థాల ద్వారా పొందే విటమిన్ డి కంటే సూర్యుని సహజ కాంతి ద్వారా ఎక్కువ పొందగలుతారు. ఇది రోగనిరోధక శక్తిని అందించడంతో పాటు శరీరానికి ఎనర్జీని అందించే హార్మోన్లు విడుదల అయ్యేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ చలి కాలంలో వైరస్లు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సి, డి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
⦿ ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది
⦿ కాల్షియం స్థాయిలని పెంచుతుంది
⦿ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది
⦿ గ్లూకోజ్ మెటబాలిజంకి సహకరిస్తుంది
⦿ మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది
⦿ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
⦿ విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది
⦿ డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది
⦿ రోగనిరోధక వ్యవస్థని పెంచి హార్మోన్ల సమతుల్యం చేస్తుంది
⦿ మస్కులర్ స్క్లెరోసిస్, బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా రక్షణ ఇస్తుంది
ప్రతిరోజు 25 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలే విధంగా చూసుకోవాలి. అందుకోసం ఎండలో నడవటం, జాగింగ్ లేదా రన్నింగ్ వంటివి చేయడం మంచిది. ఆహారం, సప్లిమెంట్లు ద్వారా విటమిన్ డి పొందే దాని కంటే సూర్యుని సహజ కాంతి ద్వారా పొందటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్లలో ఇది కూడా ఒకటి. శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా పొద్దున్నే బయటకి రావడానికి అంతగా ఆసక్తి చూపించరు. దీని వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతుంది. విటమిన్-డి లోపం వల్ల కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరికొందరిలో ఒత్తిడి, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు సూర్యకాంతి మీకు చక్కటి నిద్రను ప్రసాదిస్తుంది. స్లీపింగ్ హార్మోనును పెంచుతుంది.
ఉదయం, సాయంత్రం మూడు గంటల తర్వాత ఎండ శరీరానికి తగిలే విధంగా చూసుకోవాలి. సూర్యుని UVB రేడియేషన్ ద్వారా 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ విచ్ఛిన్నమైనప్పుడు విటమిన్ D ఏర్పడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !