Viral: 43 ఏళ్లలో ఏకంగా 53 పెళ్లిళ్లు చేసుకున్నాడు, ఎందుకంటే సిల్లీ కారణాలు చెబుతున్నాడు
ఒకటి, రెండు, లేదా మూడు పెళ్లిళ్లు చేసుకునేవారిని చూశాం. కానీ వ్యక్తి చాలా డిఫరెంట్
ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు? మన సంప్రదాయ ప్రకారం అయితే కేవలం ఒక్కసారే. విడాకులు తీసుకున్నాక మళ్లీ చేసుకోవచ్చు. కొన్ని మతాల్లో ఇంకా బహుభార్యత్వం ఉంది. ఉన్నా కూడా వారు మూడు నాలుగు వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 53 వివాహాలు చేసుకున్నాడు. అది కూడా 43 ఏళ్లలో అంటే. అంటే ఒకే ఏడాదిలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకలా చేస్తున్నారు అంటే ‘స్థిరత్వం కోసం, మనశ్శాంతి కోసం’ అని చెబుతున్నాడు. అతను చెప్పే కారణాలు కొందరికీ విసుగ్గా అనిపిస్తే, కొందరు మాత్రం నవ్వుకుంటున్నారు.
ఆ వ్యక్తి సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. పేరు అబూ అబ్దుల్లా. అతని వయసు 63 ఏళ్లు. తొలిసారి ఆయనకు 20 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. రెండేళ్లు బాగానే ఉన్నారు. మూడో ఏడాది గొడవలు మొదయ్యాయి. దీంతో ఆమెకు తలాక్ చెప్పేసి, 23 ఏళ్లకు మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ వివాహం చేసుకున్నాడు. అలా చేసుకుంటూనే ఉన్నాడు. తనకు ఏ భార్యతో కూడా మనశ్శాంతి దొరకలేదని చెబుతున్నాడు. దానికోసమే అలా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నానని అన్నాడు. వారిలో చాలా మందికి పిల్లలు కూడా పుట్టారు.
మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని, ఆమెతోనే జీవితాంతం బతకానుకున్నానని చెప్పాడు. కానీ ఇంట్లో గొడవలతో మనశ్శాంతి లేకుండా అయిపోయినట్టు చెప్పాడు. అయితే 53 వివాహాలు చేసుకున్నా కూడా అతను పెళ్లిలో స్థిరత్వాన్ని, మనశ్శాంతిని పొందలేకపోయాడట. అందుకే ఆయన్ను సౌదీలో శాస్త్రవేత్తలగా ‘బహుభార్యా వేత్త’ అంటూ కామెంట్ చేయసాగారు. అతనికి ఈ శతాబ్ధపు బహుభార్యావేత్త అని బిరుదు కూడా ఇచ్చారు.
భార్యలు ఒకరితో ఒకరు గొడవపడడం కూడా అతనిలో చికాకు నింపిందట. అందుకే భార్యలకు తలాక్ చెప్పేశానని తెలిపాడు. మూడో వివాహం చేసుకున్నప్పుడు తన మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేశానని అన్నాడు.
నన్ను సంతోషపెట్టగల, ఇంట్లో మనశ్శాంతి దొరికేలా చేసే భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను అని చెబుతున్నాడు. ఒక పెళ్లి అయితే ఏకంగా ఒక రాత్రిలోనే ముగిసిపోయిందట. అతను చేసుకున్న వారిలో ఎక్కువ విదేశీ మహిళలనే అని చెబుతున్నాడు. వ్యాపార నిమిత్తం విదేశాలకు తిరగడానికి వెళ్లేవాడు అబూ. అప్పుడు విదేశీ మహిళలను పెళ్లి చేసుకుని తెచ్చుకునేవాడు. కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యేది. కేవలం మూడు నాలుగు నెలలకే చాలా మంది భార్యలు అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు.
Also read: ఈ మొక్కల ఆకులను రోజుకు రెండు నమిలితే చాలు, డయాబెటిస్ పెరగదు
Also read: ఈ భారీ థాలీని పూర్తిగా తింటే రూ.8.5 లక్షల బహుమతి, మోడీ పుట్టినరోజు స్పెషల్
Also read: వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ రసాన్ని పిండి తప్పు చేస్తున్నాం - చెబుతున్న పోషకాహార నిపుణులు