News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

History of Haleem: హలీమ్ హైదరాబాద్ చేరింది ఆ దేశ సైనికుల వల్లే, దాని అసలు పేరు ఇదే

హలీమ్ అంటే చెవికోసుకునే వాళ్లు హైదరాబాద్‌లో ఏ మూల వెతికినా ఉంటారు.

FOLLOW US: 
Share:

రంజాన్ మాసం అంటే గుర్తుకొచ్చే మొదటి వంటకం హలీమ్. దీని కోసం షాపుల ముందు క్యూలలో కిలోమీటర్ల కొద్దీ నిలబడి కొనుక్కునే వారు కూడా ఉన్నారు.  హలీమ్ అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుంది. నిజానికి హైదరాబాద్‌కు, హలీమ్ కు ఏం బంధం లేదు. హలీమ్ పుట్టినిల్లు భాగ్యనగరమే అనుకుంటారు కానీ అది పరాయి దేశం నుంచి వలస వచ్చిన వంటకం. ఎన్నో ఏళ్ల క్రితమే హలీమ్ హైదరాబాద్ చేరింది. అప్పట్నించి ఇక్కడే తిష్ట వేసింది. ఇక్కడ ప్రజలకు తెగ నచ్చేసింది. హలీమ్ అసలు ఇది కాదనే వాదనలూ ఉన్నాయి. దీని చరిత్ర తెలుసుకోవాలంటే, మనం నిజాం కాలం నాటికి వెళ్లిపోవాలి. 

ఆ దేశ సైనికులే కారణం?
అప్పట్లో నిజాం సంస్థానంలో అరబ్ దేశాల నుంచి సైనికులు పని చేసేందుకు వచ్చేవారు.అలా యెమెన్ దేశం నుంచి సైనికులు వచ్చారు. వారే హలీమ్‌ని ఇక్కడి పరిచయం చేశారని చెబుతారు. ఎందుకంటే యెమెన్లో ‘హరీస్’ అని పిలిచే వంటకాన్ని ఇలాగే వండే వారు.అదే కాలక్రమేణా ‘హలీమ్’ గా మారిందని చెప్పుకుంటారు. హరీస్ వంటకం ప్రస్తావన క్రీ.శ పదో శతాబ్ధంలో కూడా ఉందని కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తున్నాయి. అంటే అరబ్బుల వంటల్లో హరీస్ చాలా పురాతనమైనదిగా భావించవచ్చు. యెమెన్ సైనికుల నుంచి హైదరాబాద్ కు చెందిన సైనికులు ఈ వంటకాన్ని నేర్చుకుని ప్రాచుర్యం కల్పించారని ఓ కథనం. 

రాజవంశీయుల వంటకం
ప్రముఖ అరేబియన్ వంటగాడు అబు మహ్మద్ అల్ ముజఫర్ ఓసారి బాగ్ధాద్ నగరంలో రాజవంశీకులు తినే వంటల వివరాలను సేకరించి ఓ పుస్తకంగా అచ్చేశాడు. అందులో కూడా ‘హరీస్’ అనే వంటకం ప్రస్తావన ఉంది.  ఇక 1930లో నిజాం సంస్థానం తరపున ఏర్పాటు చేసిన విందులలో ‘హలీమ్’లాంటి వంటకాన్ని వడ్డించేవారని హలీం చరిత్ర గురించి రాసిన కొన్ని పాత కథనాల్లో ఉంది. హలీమ్ తయారీలో భారతీయులు చిన్న చిన్న మార్పులు చేశారనే వాదన కూడా ఉంది. 

ముందుగా కేరళకు వెళ్లిందా?
అరబ్బులకు చెందిన హలీమ్ మొదట కేరళ ప్రాంతానికి చేరిందని, అక్కడ్నించే హైదరాబాద్ వచ్చిందని వివరించే చరిత్ర కారులూ ఉన్నారు. మలబార్ ప్రాంతానికి విదేశాల నుంచి చాలా వ్యాపారులు వచ్చే వారని, అక్కడి వారికి ముస్లిం సోదరులతో మంచి బంధం ఉందని కొన్ని రచనల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఎంతో మంది కేరళ అమ్మాయిలను పెళ్లి చేసుకుని అల్లుళ్లుగా స్థిరపడ్డారని, అలా అక్కడ హలీమ్ అలవాటైందని అంటారు. కేరళ నుంచే హైదరాబాద్ వచ్చిందని వాదించే వారున్నారు.

హలీం తయారీలో వాడేవి ఇవే
హలీం ప్రముఖంగా మటన్‌తో తయారవుతుంది. ఎముకల్లేని మటన్, గోధుమ రవ్వ, నెయ్యి, పుట్నాల పప్పు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, మిరియాలు వెల్లుల్లి పేస్టు, పసుపు, పెరుగు, ఉల్లిపాయ, నిమ్మ, పచ్చిమిర్చి ఇలా చాలా పదార్థాలతో దీన్ని తయారుచేస్తారు. మటన్‌ను దాదాపు అయిదు గంటల పాటూ ఉడికించి పేస్టులా అయ్యేలా చేస్తారు. ఆ తరువాత మిగిలిన పదార్థాలన్నీ కలిపి నెయ్యి కూడా దట్టించి ఉడికిస్తారు. గిరిటెలతో బాగా కలిపి హలీంను తయారుచేస్తారు. ఇప్పుడు చికెన్‌తో చేసే హలీంలు కూడా దొరుకుతున్నాయి. శాకాహారుల కోసం వెజ్ హలీమ్‌లు తయారు చేస్తున్నారు. 

రంజాన్ మాసంలోనే ఎందుకు?
ఏడాదిలో ఎప్పుడైనా హలీమ్ తినొచ్చు కదా, కానీ రంజాన్ మాసంలోనే కచ్చితంగా ఎందుకు తినాలి? దీనికి సరైన కారణం ఉంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు శరీరానికి కావాల్సిన శక్తి, పోషకాలు పుష్కలంగా అందాలి. హలీమ్ తింటే జీవక్రియలకు ఇబ్బంది లేకుండా ప్రోటీన్స్, కొవ్వు అందుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఉపవాసం వల్ల గంటల తరబడి ఖాళీగా ఉన్న జీర్ణ వ్యవస్థకు ఇది శక్తినందించి, పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తింటే ఆకలి కూడా త్వరగా వేయదు. మధుమేహంతో బాదపడుతున్నవారు కూడా హలీమ్‌ను తినవచ్చు. 

Also read: పిల్లలపై ప్రతాపం చూపించే కొత్త కరోనా వేరియంట్, ఆ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే

Also read: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన పిల్లాడు, అతడి ప్రాణం కాపాడింది ఓ పాత ఫ్రిజ్, వీడియో చూడండి

Published at : 22 Apr 2022 03:57 PM (IST) Tags: Haleem recipe Haleem History Haleem and Hyderabad Haleem story Eid Al Fitr 2022 Eid 2022

ఇవి కూడా చూడండి

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

టాప్ స్టోరీస్

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!