Corona signs in kids: పిల్లలపై ప్రతాపం చూపించే కొత్త కరోనా వేరియంట్, ఆ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే
మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండమని ఇప్పటికే ప్రభుత్వాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ రూపాంతరాలు చెందుతూ కొత్త వేరియంట్లను సృష్టిస్తోంది. చాలా దేశాల్లో ఇప్పటికే మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేశాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్. ఇది ఇది Omicron BA.1 మరియు BA.2 జాతుల రీకాంబినెంట్ అని చెబుతున్నారు. ఇదొచ్చే అవకాశం ముసలి వాళ్లకు, పిల్లలకు ఎక్కువని చెబుతున్నారు వైద్య నిపుణులు.ఈ వేరియండ్ కేసులు అక్కడక్కడ బయటపడుతున్నాయి. అయితే ఇప్పటికీ మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ కొత్త వేరియంట్ కేసులు మొదట ముంబైలో గుర్తించినట్టు వార్తలు వచ్చాయి. తరువాత దిల్లీలో బయటపడినట్టు చెప్పారు. ఈ వేరియంట్ లక్షణాలు పిల్లల్లో ఎలా ఉంటాయో ఆరోగ్య నిపుణులు ప్రకటించారు. అలాంటివి కనిపిస్తే తేలికగా తీసుకోకుండా పరీక్షలు చేయించడం ఉత్తమం.
1. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఛాతీ, వీపుపై ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.
2. ఆగకుండా పొడి దగ్గు వస్తుంది. రోజులో కాసేపు వచ్చి, ఆగి, మళ్లీ వచ్చి... ఇలా రెండు మూడు రోజులు కొనసాగితే జాగ్రత్త పడాలి.
3. కోవిడ్ సోకాక పిల్లల్లో కూడా రుచి చూసే, వాసన చూసే శక్తి తగ్గిపోతుంది. ఇది వారు గుర్తించలేకపోవచ్చు. వారికి వాసన శక్తి తగ్గితే చాలా డల్ గా మారుతారు. ఆ సమయంలో ఏదైనా వాసన చూపించి పరీక్షించి ఓ నిర్ధారణకు రావాలి. ఒకవేళ వారికి రుచి, వాసన తెలియడం లేదని మీకు అనిపిస్తే వెంటనే టెస్టులు చేయించాలి.
4. ఆకలి లేకపోవడం కూడా ఈ వేరియంట్ ప్రధాన లక్షణం. వారు సరిగా ఆహారం తినకపోతే చెక్ చేయించాలి.
5.పిల్లల్లో ముక్క కారడం కరోనా వైరస్ లక్షణం కిందకే వస్తుంది. ఇలా రెండు రోజులు కొనసాగితే అనుమానించాల్సిందే.
6. గొంతు దగ్గర మంటగా, దురదగా ఉన్న కూడా కోవిడ్ ఏమెనని అనుమానించాలి.
7. పిల్లల్లో డయేరియా కూడా కరోనా వైరస్ వచ్చిన విషయాన్ని తెలియజేసే సూచనే.
8. సరిగా ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నా వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. కరోనా వైరస్ దాడి చేసినప్పుడు కొంతమందిలో ఊపిరి అందదు.
9. పెద్ద వాళ్లు ఒళ్లు నొప్పులను పోల్చుకోగలరు. కానీ పిల్లలకు ఒళ్లు నొప్పులంటే తెలియదు. కాబట్టి మీరే వారితో మాట్లాడి శరీరం నొప్పులుగా అనిపిస్తుందేమో తెలుసుకోవాలి.
వ్యాక్సినేషన్ ఎప్పుడు?
ఇప్పటివరకు పెద్దలకు చాలా వరకు వ్యాక్సినేషన్ పూర్తవుతోంది. కొన్ని రోజుల క్రితం 12 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కానీ అంతకన్నా చిన్నపిల్లలకు మాత్రం ఆ ఇంకా వ్యాక్సిన్ అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉందని త్వరలో వచ్చేస్తుందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు చిన్న పిల్లలని కాపాడుకోవాల్సిందే. త్వరలో కార్బోవేక్స్ వ్యాక్సిన్ అమల్లోకి రావచ్చు.
Also read: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన పిల్లాడు, అతడి ప్రాణం కాపాడింది ఓ పాత ఫ్రిజ్, వీడియో చూడండి
Also read: పిల్లలు పుట్టనివారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, పరిశోధనలో కొత్త ఫలితం