By: ABP Desam | Updated at : 09 Mar 2022 10:16 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పచ్చిబొప్పాయి పూర్వం కూరల్లో అధికంగా వాడేవారు. రాను రాను దాని వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఆధునిక రెసిపీలు వంటింట్లో సందడి చేస్తుంటే, ఈ పాతకాలం నాటి వంటలు పక్కకు జరిగిపోతున్నాయి. కానీ ఆరోగ్యం కోసం కొన్ని పాతతరం వంటకాలను మళ్లీ పాటించాల్సిన అవసరం ఉంది. పూర్వం కచ్చితంగా ప్రతి ఇంట్లో పప్పు, పచ్చి బొప్పాయి కూర వండేవారు. దాని రుచి కూడా అదిరిపోతుంది. పచ్చి బొప్పాయితో రకరకాల వంటకాలు చేసేవారు. ఇప్పుడు పచ్చిబొప్పాయి వంటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. కానీ దాని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే మీరు మళ్లీ కోరి మరీ వండుకుని తింటారు.
గుండెపోటును అడ్డుకునే సత్తా...
వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌లు దాడి చేస్తున్నాయి. 30 ఏళ్ల వయసులో కూడా హఠాత్తుగా వచ్చే పోటుతో మరణిస్తున్నవారు ఉన్నారు. అందుకే ఆహారపరంగానూ, ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోకతప్పదు. శారీరక శ్రమ లేని పనులు, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం, ఒత్తిడి.. ఇవన్నీ గుండెపోటుకు కారణాలుగా మారుతున్నాయి. కాబట్టి హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ పచ్చి బొప్పాయిని ఏదో ఒక రూపంలో ఆహారంలో మిళితం చేసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు కలిగే అవకాశాన్ని తగ్గిస్తాయి.
ఎన్నో పోషకాలు
పండ్లలో పోషకాలు నిండుగా ఉండడం సహజం. కానీ పచ్చి బొప్పాయిలో కూడా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు బొప్పాయికి సీజన్ అంటూ లేదు, ఏడాది పొడవునా దొరకడమే వీటి ప్రత్యేకత. విటమిన్ బి, సి, ఇలు ఇందులో నిండుగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం కూడా లభిస్తాయి. కాబట్టి పచ్చి బొప్పాయి ముక్కలను కూరగా, లేదా పప్పులో కలుపుకుని వండుకుని తినేయండి. చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
ఈ రోగాలకు చెక్
మహిళల్లో ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ లో అనేక సమస్యలు ఎదురవుతాయి. కొంతమందికి కడుపునొప్పి తీవ్రంగా వస్తుంది. అలాంటి పచ్చి బొప్పాయిని తింటే నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్ టైమ్ లో తినడం కాదు, సాధారణ రోజుల్లోనే తినాలి. అలాగే ఈ కాయలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు అధికం. ఇది ఆస్తమా, రుమటాయిడ్ ఆర్దరైటిస్, ఆస్టియో ఆర్దరైటిస్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఈ కాయలను తినడం వల్ల విటమిన్ ఎ లభిస్తుంది. కంటికి ఈ విటమిన్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అజీర్తి సమస్యలతో బాధపడేవారు పచ్చి బొప్పాయితో వండిన వంటలను తింటే చాలా మేలు. జీర్ణ సమస్యలు తగ్గి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: మీరు కాలుస్తోంది సిగరెట్‌ను కాదు మీ శరీరాన్నే, ఈ నిజాలు తెలుసుకోండి
Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి
Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!