Good Friday Wishes : రేపే గుడ్ ఫ్రైడ్.. మీ శ్రేయోభిలాషులకు విష్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Good Friday 2024 : గుడ్‌ఫ్రైడ్ సమయంలో మీరు ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు విషెష్ చెప్పాలి అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఎందుకంటే..
Good Friday Meaning : జీసస్‌ని శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడే(Good Friday 2024)గా చేసుకుంటారు. దేవుడు తమ పాపాలన్నీ తన రక్తంతో కడిగేశారు అనే ఉద్దేశంతో ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా చేసుకుంటారు. అయితే దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. పేరుకు మాత్రమే గుడ్ ఫ్రైడే కానీ.. ఇది ఒక సంతాప దినం. ఈ పవిత్రమైన రోజు.. తమ భావోద్వేగాలను బంధువులు, స్నేహితులకు విషెష్ రూపంలో చెప్తారు. మీరు కూడా ఇలా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పాలనుకుంటే.. వీటిని ఫాలో అవ్వండి.
మీరు గుడ్ ఫ్రైడే విషెష్‌ను మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్‌కి చెప్పాలనుకుంటే దానికి ముందు గుడ్ని మాత్రం కలపకూడదు. సాధారణంగా పండుగలు, పుట్టినరోజుల సందర్భాల్లో విషెష్‌కి ముందు గుడ్ చేర్చుతాము. కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఇది సంతోషంతో జరుపుకునే వేడుకకాదు. దేవుడి వల్ల పాపాలు తొలగిపోయాయి అనే గుర్తుగా గుడ్ అనే పదాన్ని చేర్చారు కానీ.. ఈరోజు ఏసు అత్యంత వేధన పొందిన దినంగా చెప్తారు. దీనివల్ల విషెష్ చెప్పే సమయంలో హ్యాపీ అనే పదాన్ని కలపకూడదని చెప్తారు. అయితే మీరు విషెష్ని ఇలా కూడా చెప్పవచ్చు.
- శిలువపై ఏసు చేసిన త్యాగం, దేవుని అపారమైన ప్రేమ, క్షమాపణను ఈ గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. ఆయనయందు మనం ఎల్లప్పుడూ భక్తి, శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
- ఈ గుడ్ ఫ్రైడే నాడు.. మీరు యేసు చేసిన త్యాగంతో బలం, ఓదార్పును పొందుతారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించు గాక.
- పరిశుద్ధమైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ.. ఆయన ప్రేమ, కరుణ, కృపా, కటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
- తండ్రి అయినా దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం మీకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని.. మీరు చేసే ప్రయత్నాలలో దేవుని ప్రేమ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడ్ విషెష్ టు యూ.
- గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను మీరు గుర్తించుకుని.. ఆ దేవుడి యందు అందరూ కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటూ.. గుడ్ ఫ్రైడ్ శుభాకాంక్షలు.
- ఎవరూ చేయలేని విధంగా.. మన కోసం, మన పాపాల కోసం ఏసు ప్రాణాలు వదిలారు. ఆయన చేసిన త్యాగంతో మనకందరికీ శాంతి, ఆత్మసంతృప్తి కలుగును గాక.
- ఈ రోజు మనందరి జీవితాల్లో చీకటి దినం. దీనిని ఏసు చేసిన త్యాగం, అపారమైన ప్రేమతో వెలిగిద్దాం. ఆయన చేసిన శాశ్వత త్యాగానికి కృతజ్ఞతలు తెలుపుదాం. మీకు, మీ కుటుంబానికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
- యేసు మన కోసం చేసిన నిస్వార్థమైన త్యాగానికి ప్రార్థనలతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
- యేసు చేసిన పునరుత్థానం వాగ్ధానాన్ని అందరూ గుర్తుంచుకోని.. ఆయన రాకకై ఎదురు చూడాలని కోరుకుంటూ.. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
మీరు క్రిస్టియన్ ఫ్రెండ్స్‌కి, కుటుంబసభ్యులకు ఈ విధంగా విషెష్ చేయవచ్చు. లేదంటే స్టేటస్లు, కోట్స్ రూపంలో వాటిని షేర్ చేయవచ్చు.
Also Read : గుడ్ ఫ్రైడే తేది ప్రతి ఏటా ఎందుకు మారుతుంది? జీసస్ చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేనే అని ఎందుకంటారు?