Good Friday 2024 : గుడ్ ఫ్రైడే తేది ప్రతి ఏటా ఎందుకు మారుతుంది? జీసస్ చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేనే అని ఎందుకంటారు?
Good Friday Date: క్రైస్తవులు ప్రధానంగా చేసుకునే పండుగలు మూడు. ఒకటి క్రిస్మస్ అయితే మరొకటి గుడ్‌ఫ్రైడే, ఈస్టర్. క్రిస్మస్ను ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన చేసుకుంటారు. మరి గుడ్ ఫ్రై డే?
Interesting Facts about Good Friday : క్రిస్మస్ (Christmas) అంటే డిసెంబర్ 25 అని చెప్పేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం గుడ్ ఫ్రై మార్చి 29వ తేదీ వస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు గుడ్ ఫ్రై డే చేస్తారా? అంటే కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాని తేది మారుతూ ఉంటుంది. ఈ తేది ఎందుకు మారుతుంది? దీనిని ఎలా లెక్కిస్తారు? అసలు గుడ్ ఫ్రైడే(Good Friday 2024) ఎందుకు చేసుకుంటారు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్ ఫ్రైడేని అలా లెక్కిస్తారు..
మార్చి ప్రారంభం.. లేదంటే ఫ్రిబవరి చివర్లో.. అంటే వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో లెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ లెంట్ సీజన్‌ను క్రైస్తవులు గుడ్ ఫ్రైడేతో ముగిస్తారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్(Easter)కి ముందు వస్తుంది. గుడ్ ఫ్రైడే శుక్రవారం జరుపుకుంటే.. దాని వెంటనే వచ్చే ఆదివారం రోజు జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తు చనిపోయిన రోజుగా చేసుకుంటే.. ఈస్టర్ను క్రీస్తూ మళ్లీ లేచారు అని నమ్ముతూ వేడుకలు చేసుకుంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వారాలు ఫిక్స్ ఉంటాయి.. కానీ తేదీలు మాత్రం మారుతూ ఉంటాయి.
తేదీ ఎందుకు మారుతుందంటే..
ఈస్టర్ను ప్రతి సంవత్సరం పౌర్ణమి తర్వాత చేసుకుంటారు. వసంత ఋతువులో వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత ఈస్టర్ను చేసుకుంటారు. ఈస్టర్ పండుగను ఎలాగో ఆదివారం చేసుకుంటారు కాబట్టి.. దాని ముందు వచ్చే ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా చేసుకుంటారు. దీనిని బట్టే లెంట్ డేస్‌ని కూడా లెక్కిస్తారు. కరెక్ట్‌గా గుడ్ ఫ్రైడే రోజుకి లెంట్ డేస్ పూర్తయ్యేలా చూస్తారు. ఈ రెండు పండుగలు సాధారణంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య వస్తూ ఉంటాయి.
గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారంటే..
సిలువ వేయడం అనేది అత్యంత క్రూరమైన మరణశిక్షలలో ఒకటి. బైబిల్ ప్రకారం యేసు క్రీస్తూను కొరడాలతో కొడుతూ.. ఊరేగించి.. చివరికి శిలువ మీద చంపేసారు అని చెప్తారు. అయితే క్రీస్తూను ఇలా చంపేస్తే.. దానిని గుడ్ ఫ్రైగా ఎందుకు చంపుతారు అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ మతం ప్రకారం.. యేసు క్రీస్తూ మరణ అనేది.. మానవ పాపలన్నింటీని క్షమించడం కోసం.. దేవుడు చేసిన అంతిమ త్యాగంగా చెప్తారు. మానవ పాపలను ఆయన తన భుజం మీద వేసుకుని.. తమని రక్షించడం కోసం చనిపోయారని భావిస్తారు. అందుకే అక్కడితే పాపాలన్నీ పోయాయి అనే దానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు.
మాంసం తినరు.. ఉపవాసాలు చేస్తారు..
గుడ్ ఫ్రైడే యేసును సిలువు వేసిన రోజుగా, లెంట్ సీజన్ ముగింపుగా చెప్తారు. ఈ లెంట్ డేస్ అనేవి.. యేసును మరణానికి బీజం పడిన రోజులుగా పరిగణిస్తారు. వీటిని శ్రమ కాలాలు అంటూ కొందరు లెంట్ డేస్‌లో పూర్తిగా నాన్‌వెజ్‌కి దూరంగా ఉంటారు. మరికొందరు గుడ్ ఫ్రైడే నాడను మాంసం తినరు. మరి కొందరు లెంట్ సీజన్లో ప్రతి శుక్రవారం చేపలు తప్ప మాంసం తినరు. లెంట్ డేస్‌లో 40 రోజులు ఉంటారు. ఆ సమయంలో క్యాథలిక్కు చెందిన వారు ఉపవాసాలు ఉంటారు. 40 రోజుల్లో ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు.
గుడ్ ఫ్రైడేతో పాటు ఇవి కూడా..
గుడ్ ఫ్రైడేను చాలా ప్రాంతాల్లో సెలవుదినంగా ప్రకటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పనులు చేసినప్పటికీ.. వారికి అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఈ లెంట్ డేస్ సమయంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కాకుండా మరికొన్ని ప్రత్యేక రోజులు కూడా ఉంటాయి. యేసు జెరూసలేంలోకి ప్రవేశించిన రోజును గుర్తు చేసుకుంటూ మట్ల ఆదివారం చేసుకుంటారు. యాస్ బుధవారంతో లెంట్ డేని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల గుడ్‌ఫ్రైడేకి ముందు వచ్చే గురువారం రోజు.. యేసు చివరి భోజనం జ్ఞాపకార్థం పాదాలను కడుగుతారు. తర్వాత గుడ్ ఫ్రైడే, వెంటనే వచ్చే ఆదివారం ఈస్టర్‌గా అవుతుంది. గుడ్ ఫ్రైడే జీసస్ చనిపోయిన రోజును సూచిస్తే.. ఈస్టర్ ఆయన తిరిగి లేచారనే నమ్మకాన్ని ఇస్తుంది.
Also Read : ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ అవుతోంది.. ఇలా బెట్టింగ్ వేస్తే మోసపోతారు