అన్వేషించండి

IPL Betting Tips 2024 : ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ అవుతోంది.. ఇలా బెట్టింగ్ వేస్తే మోసపోతారు

IPL 2024 Betting online : ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. బెట్టింగ్​ వేసేవారికి కొదవే ఉండదు. ఏ సైట్స్​​లో బెట్టింగ్ వేస్తే మంచిదో.. డబ్బులు ఎలా సంపాదించవచ్చో తెలుసా అంటూ స్కామర్లు మోసం చేస్తారు.

IPL Season 2024 : ఐపీఎల్ అనేది ప్రతి ఇండియన్​ క్రికెట్​ లవర్​​కి ఓ ఎమోషన్. ముఖ్యంగా బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఇదో పండుగే. ఈ సమయంలోనే చాలామంది బెట్టింగ్​లు వేసి వేలల్లో, లక్షల్లో డబ్బులు సంపాదిస్తారు అంటూ కొందరు స్కామర్లు తెరపైకి వస్తారు. ఇవి ట్రస్టెడ్ సైట్స్ అంటూ.. వాళ్లు మంచి ప్రిడిక్షన్​ కూడా ఇస్తారంటూ క్రికెట్ అభిమానులను, డబ్బు అవసరాలు ఉన్నవారిని మోసం చేస్తూ ఉంటారు. వీటిని మీరు ఫాలో అయితే లాభాలు పొందడం కాదు కదా.. నష్టాలు చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ లింక్స్ జోలికి వెళ్లొద్దు..

అసలే ఇది ధోని లాస్ట్ సీజన్​ అంటున్నారు. ఈ సమయంలో బెట్టింగ్స్ వేస్తే వేలల్లో, లక్షల్లో ఏంటి కోట్లు అయినా సంపాదించొచ్చని ఎవరైనా మభ్య పెడితే నిజమేనని నమ్మకూడదు. దీనివల్ల మీరు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరైనా మీకు లింక్స్ పంపి వాటిని ఫిల్ చేయమంటే.. అస్సలు వాటిని ఓపెన్ చేయకండి. మీరు దానిలో బెట్టింగ్ వేసినా.. వేయకపోయినా స్కామర్లు మీ డేటాను కలెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ బ్యాంక్ డిటైల్స్ పూర్తిగా వారి కంట్రోల్​లోకి వెళ్లిపోతాయి.  

ఇలా బెట్టింగ్ వేస్తే నిజంగానే వస్తాయి.. ఎప్పుడంటే..

డబ్బులు సంపాదించడం ముఖ్యమే. కానీ మన అవసరాలు స్కామర్లకు లాభాలు తెచ్చిపెట్టకూడదు. కొందరు ఇతరుల మాటలు నమ్మి.. తలకు మించిన భారం నెత్తిమీద పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల కొత్తగా డబ్బులు రావడం కాదు.. ఉన్న డబ్బులు కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది. మిమ్మల్ని బెట్టింగ్​లో ముంచడానికి మొదట్లో కాస్త డబ్బు ఆశ చూపిస్తారు కానీ.. ఆ ఉచ్చులో దింపి మీ దగ్గరున్నవన్నీ ఖాళీ చేసేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాళ్లు ప్రమోట్ చేసేది కూడా డబ్బుల కోసమే..

మీ ఫేవరెట్ హీరోనో, క్రికెటరో, ఇన్​ఫ్లూయెన్స్​రో ఏదైనా బెట్టింగ్ యాప్​ని, లేదా సైట్​ని ప్రమోట్ చేస్తే నిజంగానే దీనిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయనుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్లు కూడా డబ్బులు కోసమే ఈ సైట్స్​ని ప్రమోట్ చేస్తారని తెలిపారు. కొందరు మా హీరో చెప్పాడంటే నిజంగానే ఇది తోపు సైట్​.. మంచి పైసలు వస్తాయని ఇన్వెస్ట్ చేస్తారు. చివరికి మీరు నిండా అప్పుల్లో మునిగిపోయినా.. మీకు అన్యాయం జరిగినా.. ఆ హీరో మీ దరిదాపుల్లోకి కూడా రాడని చెప్తున్నారు.

పాపం.. మిమ్మల్ని నమ్మి వారు మోసపోతారు..

నిజానికి ఈ బెట్టింగ్​లో మీరు మోసపోయినా.. లేదా మీకు నష్టం వచ్చినా.. మీకన్నా ఎక్కువ ఎఫెక్ట్ పడేది మీ పేరెంట్స్ మీదనే. ఎందుకంటే మీకోసమని చచ్చి.. చెడి డబ్బులు కడతారు. అప్పులు చేయాల్సి వస్తాది. లేదంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తాది. ఇంత చేసినా.. మీరు ఉంటారా లేదా అనేది డౌట్. ఎందుకంటే మనకి పౌరుషాలు ఎక్కువ కదా. బెట్టింగ్​ వల్ల ఇలా అయిందని ఇంట్లో వాళ్లు రెండు మాటలు అన్నారని సులువుగా ప్రాణాలు తీసేసుకుంటాము. డబ్బు పోయిందన్న బాధతో రెండు మాటలు అనేస్తారు కానీ.. ప్రాణాలు తీసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చేతికంది వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటే వారు బతికున్న జీవచ్చవాలు అయిపోతారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన జరిగింది. లోన్ యాప్స్​లో ఇంజినీరింగ్ చేసే ఓ కుర్రాడు డబ్బులు తీసుకుని బెట్టింగ్ వేశాడు. వాటిని తీర్చేందుకు మరికొన్ని యాప్స్​ నుంచి డబ్బులు తీసుకున్నాడు. చివరికి బెట్టింగ్​లో డబ్బులు రాకపోగ.. తలకు మించిన అప్పుల్లో మునిగిపోయాడు. చివరికి తండ్రికి చెప్పి.. ఆస్తులు అమ్మించి.. అప్పులు తీర్చాడు. కానీ అప్పటికే లోన్ తీసుకున్న యాప్​ల వారు బాధితుడి బంధువులకు లోన్​ గురించి మెసేజ్​లు పంపడంతో పరువుపోయిందని.. ప్రాణాలు తీసుకున్నాడు.

మీ లక్​ని ఇలా ట్రై చేసుకోవచ్చు..

మీకు నిజంగా బెట్టింగ్ వేయాలనుకుంటే.. చిన్న మొత్తంలో ఓ వందనో.. రెండొందలో వేయవచ్చని.. డబ్బులు వస్తే మాత్రం వేలకు వేలు వేయకుండా జస్ట్ ఎక్స్​పీరియన్స్ చేయమంటున్నారు నిపుణులు. రాలేదా అక్కడితో వదిలిస్తే మంచిది అంటున్నారు. వీలైనంత వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండటమే బెటర్. డబ్బు గురించి ఆశ పడకుండా చక్కగా మ్యాచ్ ఎంజాయ్ చేయగలుగుతారని  చెప్తున్నారు. లేదంటే జోమాటో.. స్విగ్గీ వంటి వాటిలో జస్ట్ ప్రిడిక్షన్స్​తో కొన్ని ఆఫర్స్​ ఇస్తారని.. అలాంటి యాప్స్​లో మీ లక్​ని ట్రై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇలాంటి వాటిలో ఫ్రీగా కూపన్స్ వస్తాయి. మంచిగా కడుపు నిండా తిని మ్యాచ్​ని ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు. 

Also Read : హీరోలనే తలదన్నేలా ఉన్న ధోని లుక్స్.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటున్న ఫ్యాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Embed widget