Glass Skin : మెరిసే, గ్లాస్ స్కిన్ కోసం ఈ రోటీన్‌ను ఫాలో అయిపోండి.. నిపుణులు ఇచ్చే టిప్స్ ఇవే
Skin Care Routine : చర్మం హెల్తీగా, గ్లాస్ స్కిన్ ఉండాలని అందరూ కోరుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో మీరు ఒకరు అయితే.. స్కిన్ రోటీన్తోపాటు కొన్ని బ్యూటీ టిప్స్‌ను ఫాలో అవ్వాలి. అవేంటంటే..
Glass Skin Care Routine : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్ డల్‌గా మారుతూ ఉంటుంది. ఇలా జరగడానికి వివిధ కారణాలు ఉంటాయి. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, డైట్ ఇలా చాలా అంశాలు స్కిన్‌ని ప్రభావితం చేస్తాయి. కొందరికి మాత్రం గ్లాస్ స్కిన్ ఉంటుంది. కొరియన్స్ స్కిన్ కూడా ఇలాగే గ్లోయింగ్‌గా, గ్లాస్ స్కిన్ ఉంటుంది. మరి వీరు చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ లుక్ కోసం ఫాలో అవ్వాల్సిన బ్యూటీ టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లాస్ స్కిన్ కావాలనుకుంటే కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్ని ఫాలో అవ్వాలి. దీనితో పాటు.. హెల్తీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన అలవాట్లు.. మరీ ముఖ్యంగా సహనం ఉండాలని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. మీరు రెగ్యూలర్‌గా, ఎలాంటి కామ, ఫుల్ స్టాప్ లేకుండా పైన చెప్పిన సూచనలు ఫాలో అయితే గ్లాస్ స్కిన్ మీ సొంతమవుతుంది. మరి ఎలాంటి స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి? ఎలాంటి టిప్స్‌తో స్కిన్ గ్లాస్ లుక్ ఇస్తుంది?
స్కిన్ కేర్ రోటీన్
చర్మాన్ని రెగ్యూలర్‌గా క్లెన్స్ చేయాలి. ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌ను, ఫోమ్ బేస్డ్ క్లెన్సర్‌తో డబుల్ క్లెన్స్ చేయాలి. ఇది పగలు చేయడం వీలు కాకుంటే రాత్రుళ్లు అయినా ఫాలో అవ్వాలి. అలాగే స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి. ఆల్ఫా హైడ్రోక్సీ యాసిడ్స్ ఉండే ఎక్స్‌ఫోలియేటర్‌తో వారానికి మూడు సార్లు స్కిన్‌ని శుభ్రం చేసుకోవాలి. ముఖం వాష్ చేసిన వెంటనే టోనర్‌ని ఉపయోగించాలి. ఇది చర్మంలో pH వాల్యూ తగ్గకుండా చేస్తుంది.
గ్లాస్ స్కిన్ కోసం ఎసెన్స్‌లు ఏమైనా ఉపయోగించవచ్చు. లేకుంటే టోనర్ తర్వాత సీరస్ని ముఖానికి అప్లై చేయాలి. విటమిన్ సి, నియాసినమైడ్, రెటీనోల్ సీరమ్స్ స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. స్కిన్‌పై పింపుల్స్ ఉన్నప్పుడు విటమిన్ సి సీరమ్ అప్లై చేయకపోవడమే మంచిది. అలాగే సీరస్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను రాయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఈ స్టెప్ని అస్సలు మిస్ చేయకూడదు. దీనివల్ల స్కిన్ హైడ్రేటింగ్‌గా మారుతుంది. సన్‌స్క్రీన్‌ని బయటకు వెళ్లినా.. వెళ్లకున్నా కచ్చితంగా అప్లై చేయాలి. SPF 30+ ఉండే సన్‌స్క్రీన్ మంచివి.
కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్
రోజుకు కచ్చితంగా 8 గ్లాసుల నీటిని తాగాలి. దీనివల్ల స్కిన్ హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అలాగే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ఇది మంచి స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఉండే ఫుడ్స్‌ని డైట్లో కలిపి తీసుకోవాలి. బెర్రీలు, ఆకుకూరలు, నట్స్‌ని డైట్లో చేర్చుకోవాలి. ఇవి హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తాయి. అలాగే రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తే ముఖంలో గ్లో వస్తుంది. రక్తప్రసరణ మెరుగవ్వడం వల్ల స్కిన్‌లో గ్లో వచ్చి గ్లాస్ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది.
ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటే మీరు ఎంత మంచి రోటీన్‌ను ఫాలో అయినా వేస్టే. కాబట్టి మెడిటేషన్, యోగ రెగ్యూలర్‌గా చేస్తూ ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. సల్ఫేట్స్, ఆర్టిఫీషియల్ ఫ్రాగ్రెన్స్‌లు ఉండే వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. చర్మానికి హాని కలిగించే ప్రొడెక్ట్స్కి దూరంగా ఉండాలి.
ఈ ప్రొడెక్ట్స్ ఎంచుకోండి..
మీరు ఉపయోగించే బ్యూటీ ప్రొడెక్ట్స్‌లో హైల్యూరోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేటె చేస్తుంది. నియాసినిమైడ్ చర్మాన్ని బ్రైట్‌గా చేసి.. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. విటిమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా వర్క్ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. రెటినోల్ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. గ్లిజరిన్ కూడా స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది.
ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే గ్లాస్ స్కిన్ మీకు వస్తుంది. అయితే ఇవి ఒక్కరోజులు జరిగిపోవు కాబట్టి ఓపికతో, సహనంగా వెయిట్ చేయాలి. అప్పుడే స్కిన్ మంచిఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.
Also Read : సెలబ్రెటీలు పవర్‌లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే