Avoid These Foods: రాత్రి పూట వీటిని తినొద్దు... నిద్ర చెడగొడతాయి
కొన్ని రకాల ఆహారాలు నిద్ర వచ్చేలా చేస్తాయి. మరికొన్ని మాత్రం నిద్రరాకుండా అడ్డుకుంటాయి.
చక్కని ఆరోగ్యానికి తాజా ఆహారం ఎంత ముఖ్యమో, సరిపడినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి పడుకోబోయేముందు మనం తినే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. కొన్ని రకాల ఆహారపదార్థాలను ఉదయం పూటే తినమంటున్నారు, వాటిని రాత్రి తింటే నిద్రకు దూరమవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అవేంటంటే...
1. చాక్లెట్లు
పెద్దలు, పిల్లలు... అందరికీ నచ్చేవి చాక్లెట్లే. వీటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. భోజనం చేశాక చాలా మంది స్వీట్ కు బదులు చాక్లెట్ తింటుంటారు. అలా తినడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇందులో కాస్త కెఫీన్ కూడా ఉంటుంది. కాబట్టి సాయంత్రం దాటాక వీటికి దూరంగా ఉండడం మంచిది.
2. కాఫీ, టీ
ప్రపంచంలో అత్యధికులు తాగే పానీయాలు ఇవే. వీటిని మధ్నాహ్నం నాలుగులోపే తాగాలి. ఆ తరువాత తాగితే నిద్రపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి భోజనం చేశాక తాగితే అంతే సంగతులు. నిద్రపట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. వీటలో కూడా కెఫీన్ పుష్కలంగా ఉంటుంది.
3. పిజ్జా
ఈ మధ్య రాత్రిపూట డిన్నర్ గా పిజ్జాలు తినడం ఫ్యాషనైపోయింది. పిల్లలకు కూడా తినిపిస్తున్నారు చాలా మంది. కానీ పిజ్జాలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్ లు పుష్కలంగా ఉంటాయి. అవి మనిషిని నిద్రపోనివ్వవు. కాబట్టి పిజ్జాను రాత్రి పూట తినడం మానుకోవాలి.
4. పుల్లని పండ్ల రసాలు
పండ్ల రసాలు మంచివే. కానీ రాత్రి పూట పుల్లగా ఉండే పండ్ల రసాలు తాగడం వల్ల మాత్రం పొట్ట కాస్త ఇబ్బంది పడొచ్చు. దాని ప్రభావం నిద్రపై ఉంటుంది. పుల్లని రసాలు పొట్టలో అసిడిక్ రియాక్షన్ వస్తుంది. అది నిద్రను దూరం చేస్తుంది.
5. టమాటా సాస్
పిల్లలు అధికంగా తినే పదార్థాలలో టమాటా సాస్ ఒకటి. కానీ దీన్ని రాత్రిపూట తినకూడదు. నూడుల్స్ తో పాటూ జతగా టమాటా సాస్ తినేవారు ఛాతీలో మంటకు గురయ్యే అవకాశం ఉంది. అజీర్ణం కూడా కలగవచ్చు. ఫలితంగా నిద్ర దూరమవుతుంది.
Also read: ఫుడ్ ప్యాకింగ్ లేబుళ్లపై ఇలా రాసి ఉంటే కొనే ముందు ఆలోచించండి, ఎందుకంటే...
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే
Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి