News
News
X

Gandhi Jayanti: మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ వెరీ వెరీ స్పెషల్! శరీరానికే కాదు, మానసిక శక్తిని అందిస్తుంది

మహాత్మా గాంధీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు. ఆయన మెనూ పూర్తిగా శాకాహారంతోనే నిండి ఉండేది. ఒకానొక సమయంలో ఆహార పద్దతులు మార్చుకోవాలని మిత్రులు సలహా ఇచ్చినా సున్నితంగా తిర్కరించారు.

FOLLOW US: 
 
దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. రక్తం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. ఆ మహనీయుడి జయంతి ఇవాళ(అక్టోబర్ 2). పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఆయన పాటించిన ఆహారపు నియమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి.

మిత్రుల సలహా తిరస్కరించిన గాంధీ

గుజరాత్ లో జన్మించిన మహాత్మాగాంధీ.. లా చదివేందుకు లండన్ వెళ్లారు. భారత్ తో పోల్చితే లండన్ లో విభిన్న పరిస్థితులు ఉండేవి. అక్కడ ఆహారపు అలవాట్లు కూడా ఇక్కడితో పోల్చితే చాలా తేడాగా ఉండేవి. గాంధీ లండన్ కు వెళ్లిన తొలినాళ్లలో ఆయన మాత్రులు తనకు ఫుడ్ విషయంలో ఎన్నో సలహాలు ఇచ్చారు. మాంసాహారం తీసుకుంటే చాలా మంచిదని చెప్పారు. కానీ, ఆయన వారి సలహాలను, సూచనలను సున్నితంగా తిరస్కరించారట. మాంసానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పులతో తయారు చేసిన ఆహారం తీసుకునేవారట. తన ఆహరపు అలవాట్ల గురించి గాంధీ..  ‘ది సైన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అనే పుస్తకంలో వివరించారు.   

News Reels

శాకాహారం పట్ల అమితాసక్తి

గాంధీ ఆహారం విషయంలో మూడు బుట్టల ప్రణాళికలు ఉండేది. మొదటి బుట్టలో శాకాహారం, రెండో బుట్టలో మాంసాహారం, మూడో బుట్టలో మిశ్రమ ఆహారం ఉండేది. మొదటి బుట్టలో  శాఖాహారానికి సంబంధించిన  పప్పులు,  తృణధాన్యాలు సహా పండ్లు, కూరగాయలు ఉండేవి. రెండో బుట్టలో  ఎక్కువగా మాంసం, పౌల్ట్రీ, చేపలు ఉంటాయి. గాంధీజీకి ఇష్టమైనది మిక్స్‌డ్-డైట్ బాస్కెట్ లేదంటే మూడో బాస్కెట్. ఇందులో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండేవి. పప్పు, కూరగాయలు, పాల ఉత్పత్తులు  ప్రధానంగా ఉండేవి. ఆయన ఎక్కువగా శాకాహారాన్నే తీసుకునే వారు.   స్టాన్లీ వోల్పెర్ట్ రచించిన ‘గాంధీస్ వే’ అనే పుస్తకం ప్రకారం  గాంధీ చాలా పప్పులను ఎక్కువగా తీసుకునేవారు.   

శారీరక, మానసిక శక్తిని కలిగించే ఆహారపు అలవాట్లు 

బాపూజీ రోజూ ఒక పూట మాత్రమే భోజనం తినేవారు.  బ్రెడ్, పాస్తా, చక్కెర లాంటివి తీసుకునే వారు కాదు.  అన్నం, పప్పు, చపాతీ, పెరుగు, పెడా ఆయనకు ఇష్టమైన వంటకాలు.  మానవ శరీరం తనను తాను పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని గాంధీ చెప్పేవారు. మనం సరైన ఆహారం తీసుకుంటేనే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందని గట్టిగా నమ్మేవారు.  శరీరం, మనస్సు విడదీయరానివని గాంధీ బలంగా భావించేవారు.  గాంధీ డైట్ ప్లాన్ మానసిక శక్తిని అందించడానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కొవ్వును కరిగించడంతో పాటు బలమైన కండరాలను పొందడలో ఎక్కువగా సాయపడేది. ఆయన డైట్ ను అప్పట్లో చాలా మంది పాటించేవారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆహారపు అలవాట్ల గురించి గాంధీ తన  మిత్రుల దగ్గర ఎక్కువగా ప్రస్తావించకపోయినా.. తను మాత్రం కచ్చితంగా ఓ పద్దతిని పాటించేవారట.  

Published at : 02 Oct 2022 03:07 PM (IST) Tags: Mahatma Gandhi Gandhi Jayanti Gandhi diet plan

సంబంధిత కథనాలు

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!