అన్వేషించండి

Heart Beat: తరచూ గుండె వేగంగా కొట్టుకుంటోందా? ఇవే కారణాలు కావచ్చు

గుండె కొట్టుకునే వేగంపై శరీర ఆరోగ్యస్థితి, మానసిక స్థితి కూడా ప్రభావం చూపిస్తాయి.

గుండె చాలా ప్రధానమైన అవయవం. దాని పనితీరులో కాస్త తేడా వచ్చినా కూడా కచ్చితంగా పట్టించుకోవాల్సిందే. చాలా మందికి కొన్ని సార్లు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు, భయపడినప్పుడో, బాగా కష్టపడినప్పుడో, పరుగెత్తినప్పుడో.. అలా కొట్టుకోవడం సహజం. కానీ ఏమీ లేకుండా గుండె వేగంగా కొట్టుకుంటోందంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇలా నిత్యం గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తే వైద్యులను కచ్చితంగా సంప్రదించాల్సిందే. 

గుండె రేటు ఎంత ఉండాలి?
సాధారణ  వ్యక్తి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ కొందరికీ మాత్రం నిమిషానికి 100కు పైగా గుండె కొట్టుకుంటోంది. ఇలా ఎల్లప్పుడూ కొట్టుకోవడం మంచిది కాదు. దీన్ని ‘టాకీ కార్డియా’ అంటారు.దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎప్పటికైనా గుండెకు ముప్పుగా మారుతుంది. 

కారణాలు ఇవి కావచ్చు..
గుండె అధికంగా కొట్టుకోవడానికి కొన్ని అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు. రక్తహీనత, బీపీ తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, జ్వరం, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, మద్యం తాగడం, ధూమపానం, డ్రగ్స్ వాడడం, టీ, కాఫీలు అధికంగా తాగడం ఇలాంటి కారణాల వల్ల కూడా గుండె వేగం పెరిగిపోతుంది. కొన్ని రోజుల పాటూ ఈ పరిస్థితి కొనసాగితే దానికి కచ్చితంగా చికిత్స అవసరం. లేకుంటే ఏ క్షణమైన హార్ట్ ఫెయిలయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి కాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలు. 

వైద్యులు ఏం చేస్తారు?
కార్డియాలజిస్టులు ముందు మీ గుండె కొట్టుకునే రేటును పరిశీలిస్తారు. దాని తరువాత ఈసీజీ, ఎక్స్ రే, ఎకో టెస్ట్ వంటివి సూచిస్తారు. దీంట్లో మీ గుండె పరిస్థితి వారికి పూర్తిగా అర్ధమైపోతుంది. దీని వల్ల పరిస్థితి చేయి దాటక ముందే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఛాతీలో నొప్పిగా అనిపించినా, తల తిరగడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటివి తరచచూ అనిపిస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి హార్ట్ ఎటాక్ కు సంబంధించిన లక్షణాలు. గుండె కొట్టుకునే వేగం పెరిగినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడంపై మాత్రం అశ్రద్ధ చేయవద్దు. 

Also read: నీళ్లు తక్కువ తాగితేనే కాదు, అధికంగా తాగినా ఈ సమస్యలు తప్పవు

Also read: ముద్దు పెట్టుకునే సంస్కృతి ఏ కాలంలో మొదలైంది? ముద్దుకు అంత ప్రాధాన్యత ఎందుకు?

టాప్ హెడ్ లైన్స్

Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Embed widget