By: ABP Desam | Updated at : 28 Dec 2022 03:50 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
పరోటా అందరికీ ఎంతో ఇష్టమైన అల్పాహారం. ఆలూ పరోటా, గోభి, ప్యాజ్, పనీర్ తో పాటు రకరకల పదార్థాలు స్టఫ్ఫింగ్ చేసి రుచికరమైన పరోటాలు చేసుకుని తింటారు. పెరుగు, అచార్ తో వడ్డించే ఈ అల్పాహారం ఆరోగ్యకరమైన భోజనం కూడా. చాలా మందికి పరోటాలు అల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. అయితే కొంతమంది పరోటాలు చేస్తే దూది పింజల్లా మెత్తగా ఉంటాయి. కానీ మరికొంతమందికి మాత్రం గట్టిగా షేప్ లేకుండా వస్తాయి. అవి తినలేక పళ్ళు నొప్పులు పుట్టేస్తాయి. అలా కాకుండా పరోటాలు మృదువుగా, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఈ టిప్స్ పాటించి పరోటాలు చేసి పెట్టారంటే ఎన్ని తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు.
పరోటాలు చేసేందుకు పిండిని కలుపుకునేందుకు గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా పిండి కలుపుకోవాలి. పిండి ఉండలు రుద్దే సమయంలో చివర్ల మందంగా లేదా మరీ సన్నగా చేయకూడదు. అలా చేస్తే అది కాల్చే సమయంలో విరిగిపోతాయి.
పిండిని కలుపుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించుకోవాలి. ఇది వేయడం వల్ల వాటికి మంచి ఆకృతితో పాటు సువాసన, మృదువుగా ఉంటాయి. కరిగించిన నెయ్యి మాత్రమే వేసుకోవాలి. నేరుగా వద్దని అనుకుంటే గోరువెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు.
పరోటా కాల్చే విధానం కూడా దానికి మరింత రుచిని తెచ్చి పెడుతుంది. స్టవ్ మీద మంట సరిగా ఉండేలా చూసుకోవాలి. తవా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ సిమ్ చేసుకోవాలి. వేడిగా ఉన్న తవా మీద పరోటా వేసి కాల్చుకోవాలి.
పిండి కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని కనీసం 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దాని గిన్నె మీద కాటన్ తడి వస్త్రం వేసి కప్పి ఉంచాలి. తడి వస్త్రం కప్పడం వల్ల పిండి ఎండిపోకుండా తేమగా ఉంటుంది. పిండి మరీ మృదువుగా అనిపిస్తే దాన్ని 10 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
పరోటాలు మృదువుగా రావాలంటే పిండి కలిపేటప్పుడు అందులో పెరుగు లేదా పాలు జోడించుకోవచ్చు. పాలు కాస్త వెచ్చగా ఉండాలి. అలాగే పెరుగు కూడా గది ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఇది పరోటాలకి మంచి ఆకృతి, రుచిని ఇస్తుంది. పరోటాలు చల్లబడిన తర్వాత కూడా అవి మృదువుగా ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాటిని వేడి చేసుకుని తిన్నా మెత్తగా ఉంటాయి.
పరోటాలు తయారు చేసేటప్పుడు రోటీకి వేసినట్టుగా కాకుండా ఎక్కువ పిండి వేసి రుద్దుకోవాలి. ఇది పరోటా ఉడికిన తర్వాత మెత్తగా ఉండేలా చేస్తుంది. పరోటాల్లో బంగాళాదుంప లేదా ఇతర పదార్థాలు స్టఫ్ చేసేటప్పుడు రోల్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే అవి రుద్దేటప్పుడు బయటకి రాకుండా ఉంటాయి.
Also Read: ఈ టైమ్‌లో నిద్రపోయారంటే గుండెకి ఏ ఢోకా ఉండదు
Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్లకు బదులు ఈ పానీయం తాగండి
Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి
Milk Coffee: మిల్క్ కాఫీ మంచిదే, కానీ ఈ సమస్యలున్న వాళ్ళు మాత్రం తాగకూడదండోయ్
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్
World Cancer Day 2023: క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మూడు రకాల ఆహార పదార్థాలు ఇవే, తినడం మానేస్తే మీకే మంచిది
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!