అన్వేషించండి

Fashion Designing Courses :10th తర్వాత ఫ్యాషన్ డిజైనర్ ఎలా అవ్వాలి? ఫీజులు, అడ్మిషన్​కు సంబంధించిన పూర్తి వివరాలివే

Fashion Design Career Guide : పది తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటే ఏ కోర్సులు చేయాలి? ఫీజలు, అడ్మిషన్​కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 10వ తరగతి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉంటుంది.
  • స్కెచింగ్, ప్యాటర్న్ మేకింగ్, CAD వంటి నైపుణ్యాలు కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
  • ఫ్యాషన్ డిజైనర్, అసిస్టెంట్ డిజైనర్ వంటి అవకాశాలు, మంచి జీతం లభిస్తుంది.

Fashion Designing After 10th : 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ ఎంచుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యాషన్​ డిజైనింగ్ కెరీర్​కు మంచి డిమాండ్ ఉంది. అందుకే యువత విభిన్నంగా, సృజనాత్మకంగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. దీనిలో భాగంగా కొత్త దుస్తుల డిజైన్లు, ట్రెండ్‌లు, స్టైలింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. 

మీకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్​పై ఆసక్తి ఉంటే.. ఇది మీకు ఒక గొప్ప కెరీర్ ఎంపిక కావచ్చు. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే.. మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు. వెంటనే ఈ రంగంలోకి వెళ్లి.. క్రమంగా విజయవంతమైన ఫ్యాషన్ డిజైనర్‌గా మారవచ్చు. దీనికోసం మీరు ఎంచుకోవాల్సిన కోర్సులు, ఫీజులు, అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు చూసేద్దాం. 

ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలంటే..

10వ తరగతి తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ ప్రారంభించడానికి.. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల ఎంపిక ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ (Fashion Designing Degree) వంటి డిగ్రీ కోర్సులకు ఇంటర్ అవసరం. కానీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఈ రంగంలోని ప్రాథమిక, ఉన్నత నైపుణ్యాలను ప్రారంభం నుంచే నేర్చుకోవడానికి వీలు కల్పిస్తాయి.

డిప్లొమా కోర్సులు.. 

ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులు సాధారణంగా 1 నుంచి 2 సంవత్సరాల పాటు ఉంటాయి. వాటి ఫీజులు సుమారు లక్ష నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు సర్టిఫికేట్ కోర్సులు కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటాయి. వాటి ఫీజులు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ కోర్సులలో ప్రవేశం ఎక్కువగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 

అర్హతలు.. 

అర్హత విషయానికి వస్తే.. సర్టిఫికేట్ కోర్సులకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. కొన్ని డిప్లొమా కోర్సులకు ఇంటర్ సర్టిఫికెట్ అవసరం. అయినప్పటికీ.. 10 తర్వాత నేరుగా ప్రవేశం కల్పించే సంస్థలు చాలా ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే.. ఈ రంగంలోకి ప్రవేశించడానికి నిర్దిష్టమైన స్ట్రీమ్ ఏదీ అవసరం లేదు. మీ ఆసక్తి, సృజనాత్మకత మాత్రమే ముఖ్యం.

ఎంట్రీ డిటైల్స్..

ఈ రంగంలోకి వెళ్లాలనుకుంటే ప్రవేశ ప్రక్రియ చాలా సులభం. కాకుంటే ముందుగా మీరు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మార్క్‌షీట్‌ల వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి.. కోర్సును ఎంచుకోవాలి. ఫీజు చెల్లించిన తర్వాత మీ దరఖాస్తును మూల్యాంకనం చేసి.. ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

కోర్సులోని అంశాలు..

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో భాగంగా మీరు స్కెచింగ్, ప్యాటర్న్ మేకింగ్, డ్రేపింగ్, టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ హిస్టరీ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (CAD) వంటి అనేక ముఖ్యమైన నైపుణ్యాలు నేర్పిస్తారు. వీటితో పాటు మీరు ఆన్‌లైన్ కోర్సుల ద్వారా మీ స్కిల్స్ మరింత పెంచుకోవచ్చు. అనేక ప్లాట్‌ఫారమ్‌లు తక్కువ ఫీజులతో నాణ్యమైన కోర్సులను అందిస్తాయి. కాబట్టి మీరు ఇంటి నుంచే సౌకర్యవంతంగా వీటిని నేర్చుకోవచ్చు.

కెరీర్ అవకాశాలు..

కోర్సు పూర్తి చేసిన తర్వాత మీకు అనేక కెరీర్ అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్యాషన్ డిజైనర్‌గా, అసిస్టెంట్ డిజైనర్‌గా, టెక్నికల్ డిజైనర్‌గా లేదా ఫ్యాషన్ బ్రాండ్‌ల కోసం పని చేయవచ్చు. ప్రారంభ జీతం సంవత్సరానికి 2.5 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఇది అనుభవంతో పాటు పెరుగుతుంది. ప్రతిభ, కృషి ఉంటే.. ఈ రంగంలో మీరు మంచి పేరు సంపాదించుకోవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget