ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!
భవిష్యత్తులో భూమిపై మగవాళ్లు పూర్తిగా అంతరించిపోయే టైమ్ దగ్గర పడిందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు సైంటిస్టులు. ఇందుకు కారణం ఏమిటో తెలుసా?
భవిష్యత్తులో భూమిపై మగవాళ్లు పూర్తిగా అంతరించిపోయే టైమ్ దగ్గర పడిందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు సైంటిస్టులు. కొన్నాళ్ల తర్వాత ఈ భూమిపై మహిళలు మాత్రమే ఉంటారని, మగవారు పూర్తిగా అంతరించిపోతారని చెప్పుకొచ్చారు. అవును మీరు చదివింది అక్షరాల నిజం.. ఈ మధ్య కాలంలో జపాన్‌లోని ఉండే ఓ దీవి అంతరించిపోతుందన్న విషయం తెలుసుకున్న సైంటిస్టులు.. ఇలా ఎందుకు జరుగుతుందా.? అన్న విషయం తెలుసుకునేందుకు పరిశోధనలు చేపట్టారు. ఇందుకు ఆ దీవిలో ఉండే కొన్ని మగ ఎలుకల్ని పరిశోధించారు.
అయితే సాధారణంగా ఎలుకల అంతరించవు. ఎందుకంటే.. ఎలుకలు చాలా త్వరగా తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈ విషయం తెలుసుకునేందుకే సైంటిస్టులు పరిశోధనలు చేపట్టగా.. వారికి షాకింగ్ విషయం తెలిసింది. ఆ ఎలుకల్లో Y క్రోమోజోమ్ లేదని, ఫలితంగా అక్కడ మగ ఎలుకలు చాలా తక్కువ ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే ఇదే సమస్య ఇప్పుడు మనుషులకు వస్తే? వామ్మో తలుచుకుంటేనే.. భయంగా ఉంది కదూ.
తాజా పరిశోధన ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామందిలో సంతాన సాఫల్యత తగ్గుతోంది. ఇప్పుడు Y క్రోమోజోమ్ కూడా తగ్గిపోతే.. మగపిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇటు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో కూడా వీర్యకణాల సంఖ్య గణనీయంగా పడిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సంవత్సరాల నుంచి ఈ సంఖ్యలో భారీ తరుగుదల కనిపించిందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ క్రోమోజోములు అంటే ఏమిటి? ఇవి మనవ శరీరంలో ఎలా పని చేస్తాయి.?
Also Read: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
క్రోమోజోములు అంటే ఏమిటి?
మానవ జన్యూరూపంలో మొత్తం 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. అందులో 22 జతల ఆటోసోమ్‌లు ఉంటే, 1 జత అలోసోమ్‌లు లేదా లింగ క్రోమోజ్‌లు ఉంటాయి. అయితే మానవులలో మొత్తం రెండు రకాల లింగ క్రోమోజోములు ఉంటాయి. అవి X, Y. పురుషుడు XY జతను లింగ క్రోమోజోములుగా పేర్కొంటారు. నిజానికి మానవ Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కంటే చిన్నది. టెలోమర్ వద్ద Y క్రోమోజోమ్‌లో నాన్-రీకాంబినింగ్ ప్రాంతంగా పిలువడే దాని నిర్మాణంలోని కొన్ని భాగాలను మినహాయించి X క్రోమోజ్‌లతో ఇది తిరిగి సంయోగం చెందుతుంది.
క్రోమోజోములు ఎలా పని చేస్తాయి?
మహిళల్లో XX క్రోమోజోమ్‌లు ఉంటాయి. మగవారిలో XY క్రోమోజోమ్‌లు ఉంటాయి. మగవారి నుంచి X క్రోమోజోమ్, ఆడవారి X క్రోమోజోమ్‌తో కలిస్తే.. ఆడపిల్ల పుడుతుంది. అదే మగవారి నుంచి Y క్రోమోజోమ్, ఆడవారి X క్రోమోజోమ్‌తో కలిస్తే మగ పిల్లాడు పుడతాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.! అయితే ఇప్పుడు మానవుల్లోని ఈ క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తోందని, కొన్ని లక్షల ఏళ్ల తర్వాత అది పూర్తిగా కనుమరుగు కావచ్చని, ఫలితంగా మానవాళి అంతరించిపోవచ్చన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి.
అయితే మగవారిలో ఆ Y క్రోమోజోమ్ ఉండదనీ.. అందువల్ల మగపిల్లలు పుట్టే అవకాశం పోయి, మగజాతి అంతరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం.. పర్యావరణం, ప్రస్తుత జీవనశైలి వీర్యకణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడపై ప్రభావ పడుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.
ఆ దేశాల్లో ఇప్పటికే మొదలైంది
క్రోమోజోమ్‌లు గణనీయంగా క్షీణత కనిపిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉత్తర అమెరికా ఉండగా.. ఆ తర్వాత దేశాలైన యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్, స్పెర్మ్ కాన్సన్ ట్రేషన్‌లో ఎక్కువ క్షీణత కనిపించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. గత 46 ఏళ్లలో 50 శాతానికి పైగా వీర్యకణాల క్షీణత కనిపిస్తోందని, కానీ ఈ మధ్య కాలంలో ఇది మరింత వేగవంతం అయిందని అన్నారు.
కాలుష్యమే కారణం
ఇదిలా ఉంటే.. కాలుష్యం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా లైంగిక సంబంధాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోందన్న విషయం కూడా వెల్లడించారు సైంటిస్టులు. అంతే కాకుండా వంధ్యత్వానికి కూడా దారి తీస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. శబ్ద కాలుష్యంతో పాటు అనేక ఇతర పర్యావరణ కారకాలు కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. కలుషితమైన విష కణాల వల్ల రక్త నాళాల్లో మంట ఏర్పడుతుంది. ఇది పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. వారి లైంగిక ప్రేరేపణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాల్సిన అవసరం చాలా ఉంది.
యువతలో అంగ స్తంభన సమస్యలూ పెరిగాయ్
అంతేకాదు.. అంగస్తంభన లోపం సమస్యలు కూడా ఇటీవల బాగా పెరుగుతున్నాయట. అంగస్తంభనను పొందడానికి, సెక్స్ కోసం తగినంత దృఢంగా ఉంచడానికి పురుషాంగం తగినంత రక్తాన్ని పొందలేని పరిస్థితినే అంగస్తంభన లోపం అంటారు. అంటే దీనిలో పురుషాంగం గట్టిపడదు. అయితే నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ అంగస్తంభన లోపం సమస్య తలెత్తుతోంది. కానీ ఈ సమస్య ఇప్పుడు యువకుల్లో తీవ్రంగా కనిపిస్తుందట. 20 నుంచి 29 ఏండ్లున్న పురుషులలో 8 శాతం మంది అంగస్తంభన లోపం సమస్యతో బాధపడుతున్నారట. అయితే ఇలా కావడానికి ముఖ్య కారణం.. హార్మోన్లనే చెప్పాలి. హార్మోన్లలో హెచ్చుతగ్గులు అంగస్తంభన లోపానికి దారితీస్తుంది.
Also Read: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!