అన్వేషించండి
Evening Walk Benefits : బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం నడవాలట.. కానీ ఈ 7 విషయాలు గుర్తించుకోండి
Evening Walking Tips : సాయంత్రం నడక బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్తున్నారు నిపుణులు. అయితే ఈవెనింగ్ వాక్ సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం.

సాయంత్ర నడిచేప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు
Source : Freepik
Weight Loss Through Evening Walk : ఉదయాన్నే నిద్రలేవలేము.. ఆఫీస్‌కి, బయటకి వెళ్లాలనుకుంటే సాయంత్రం నడవడం (Evening Walking) మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఈవెనింగ్ వాక్ అనేది అన్ని వయసుల వారికి ప్రయోజనకరమైనదని చెప్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఉదయం నడకను స్కిప్ చేసి.. పూర్తిగా వాకింగ్ మానేస్తున్నారని.. మార్నింగ్ కుదరని వారు.. సాయంత్రం వాక్ చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈవెనింగ్ వాక్ మిమ్మల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అయితే మీరు సాయంత్రం నడవాలి.. మంచి ఫలితాలు చూడాలనుకుంటే.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. అవేంటంటే..
నిపుణుల అభిప్రాయం..
సాయంత్రం వాకింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం శరీర కండరాలకు మంచిదని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. జాబ్‌కి వెళ్లాలని, బయటకు వెళ్లాలని ఒత్తిడి ఉండదు కాబట్టి.. వాకింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. శక్తి స్థాయిలు కూడా మెరుగవుతాయి. మెటబాలీజం పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల బరువు వేగంగా తగ్గుతారు.
బరువు తగ్గాలనుకుంటే..
సాయంత్రం నడకతో బరువు తగ్గాలనుకుంటే.. దాని కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. అరగంట నడిస్తే.. తరువాత సమయాన్ని మీకు అనుకూలంగా పెంచుకోవచ్చు.
ఫాస్ట్‌గా నడవాలా?
సాయంత్రం నడకకు వెళ్లినప్పుడు ప్రారంభ నిమిషాల్లో వేగాన్ని తగ్గించండి. తర్వాత వేగాన్ని పెంచాలి. వేగంగా నడవడం వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గుతారట.
ఫిట్నెస్ ట్రాక్
బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు బరువు ఎంత ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇది ఫిట్నెస్ లక్ష్యాన్ని పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ప్రతివారం మీ బరువును ట్రాక్ చేయండి. రిజల్ట్స్ బట్టి మీరు మోటీవేట్ అవుతారు.
పరిమితి పెంచండి..
నడకను తక్కువ సమయంతో ప్రారంభించినా.. గ్రాడ్యుల్గా పెంచండి. అరగంట నుంచి గంట వరకు వాక్ చేయవచ్చు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా.. తరువాత అది అలవాటుగా మారుతుంది. మీరు బరువు వేగంగా తగ్గుతారు. అయితే ముందుగా నడకను బాడీకి అలవాటు చేయండి.
బ్రేక్స్ తీసుకోండి
సాయంత్రం నడవడానికి వెళ్లినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తే.. వెంటనే బ్రేక్స్ తీసుకోండి. ఎక్కడైనా కూర్చుని డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఒకటి లేదా రెండు సిప్స్ నీరు వాటర్ తాగండి. ఇది అలసటను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. యాక్టివ్‌గా వాక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
వార్మ్ అప్ చేయండి..
నడక ప్రారంభించే ముందు వార్మ్ అప్ చేయండి. సరైన బూట్లు, సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. ఇవి మిమ్మల్ని వేగంగా, సౌకర్యవంతంగా నడిచేందుకు హెల్ప్ చేస్తాయి. దీనివల్ల బరువు వేగంగా తగ్గుతారు.
ఈ టిప్స్ రెగ్యులర్‌గా వాకింగ్ చేసేప్పుడు ఫాలో అయితే బరువుతగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. జిమ్‌కి వెళ్లలేని వారు, ఎక్కువసేపు డెస్క్ వర్క్ చేసేవారు దీనిని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం
Advertisement






















