Yoga Asanas for Heart : ఉదయాన్నే ఈ యోగాసనాలు వేస్తే గుండె జబ్బులు రావట.. సింపుల్‌గా చేసేయండి
Heart Health : యోగాతో గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని దూరం చేసే ఆసనాలు ఏంటో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Yoga Asanas for Heart Health : యోగా కేవలం శారీరక కదలిక మాత్రమే కాదు.. ఇది శరీరం, మనస్సును బ్యాలెన్స్ చేసే ఓ వారధిగా చెప్తారు యోగా నిపుణులు. ఎందుకంటే యోగా శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా.. మనసుకు ప్రశాంతతను, సమతుల్యతను అందిస్తుంది. అలాగే రోజూ యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఎన్నో యోగాసనాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా చేస్తే.. రక్త ప్రవాహం మెరుగవుతుందట. ఒత్తిడిని తగ్గి.. మొత్తం ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుందని చెప్తున్నారు.
గుండె సమస్యలు ఎక్కువగా వస్తోన్న ఈ కాలంలో యోగాసనాలు వేస్తూ ఉంటే ఎలాంటి గుండె జబ్బులు రావని చెప్తున్నారు యోగా నిపుణులు. పైగా వీటిని వేయడం చాలా సింపుల్ అంటున్నారు. ఇంతకీ గుండెను ఆరోగ్యంగా ఉంచి.. బలాన్ని పెంచడంలో హెల్ప్ చేసే ఆసనాలు ఏంటో వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
తడాసనం (పర్వత భంగిమ)
ఈ ఆసనం వేయడం చాలా తేలిక. ఈ భంగిమ శరీర అమరికను, స్థిరత్వాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. కాళ్ల కండరాలను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది మొత్తం శారీరక ఆరోగ్యానికి మద్ధతు ఇవ్వడంతో పాటు.. నేరుగా గుండె పనితీరుకు మద్దతు ఇస్తుంది.
ఉత్కటాసనం (కుర్చీ భంగిమ)
తొడలు, గ్లూట్స్, కోర్ స్ట్రెంత్ పెంచడంలో ఈ ఆసనం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది మిమ్మల్ని స్ట్రాంగ్‌గా చేసే ఓ ఆసనం. ఉత్కటాసనం ఓర్పు, స్థిరత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది కండరాలను బలోపేతం చేయడం, గుండెపై పనిభారాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
వీరభద్రాసనం (వారియర్ పోజ్)
(Image Source: Canva)
ఈ డైనమిక్ ఆసనం వేయడం వల్ల కాళ్లు, తుంటి, కోర్‌పై ప్రెజర్ పడుతుంది. దీనివల్ల విశ్రాంతి పెరుగుతుంది. బాడీ బ్యాలెన్స్ అవుతుంది. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఉత్తనాసనం (శరీరాన్ని వంచడం)
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ ఆసనం అందిస్తుంది. ఈ భంగిమ దిగువ వీపు, తొడలను స్ట్రెచ్ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడిని తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వృక్షాసనం (వృక్ష భంగిమ)
(Image Source: Canva)
సమతుల్యత, ఏకాగ్రతను పెంచుకోవడం కోసం వృక్షాసనం వేయవచ్చు. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది. కాళ్లు, దిగువ వీపును స్ట్రాంగ్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన గుండె వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
చక్రాసనం (చక్ర భంగిమ)
చక్రాసనం శక్తివంతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఇది వెన్నెముకను పటిష్ఠం చేస్తుంది. చేతులు, ఛాతీకి బలాన్ని చేకూరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణను అందించి ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది.
సర్వాంగాసనం (షోల్డర్ స్టాండ్)
ఈ ఆసనం ఎగువ శరీరానికి రక్త ప్రసరణను పెంచుతుంది. భుజాలు, వెన్నెముకను ఉపయోగించడం ద్వారా.. మానసికంగా స్పష్టత వస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
ఈ యోగాసనాలు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే బాడీకి మంచి ఫ్లెక్సిబులిటీ వస్తుంది. అంతేకాకుండా మెటబాలీజం, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో హెల్ప్ చేస్తాయంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఉదయాన్నే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీటిని వేసేయండి.






















