అన్వేషించండి

Vitamins for Health : రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో తెలుసా? WHO మార్గదర్శకాలు ఇవే

Essential Vitamins : నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా రోగాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆహారంపై శ్రద్ధ లేకపోవడం. డైట్‌లో విటమిన్లు ఎంత ఉండాలో.. ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం.

Vitamins for Health : రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఓ మాట మీరు వినే ఉంటారు. వినని వారికోసం.. 'శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, దీపానికి నూనె కూడా అంతే ముఖ్యం' అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంగా లేకపోతే.. వివిధ రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితాన్ని ఆనందించలేకపోతారు. కాబట్టి మంచి జీవితాన్ని గడపాలనుకుంటే.. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందుతాయి. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలో.. ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం? WHO మార్గదర్శకాలు ఏంటో చూసేద్దాం. 

రోజులో ఎన్ని విటమిన్లు అవసరం?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్లు చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు హార్మోన్ల సమతుల్యత, కణాల మరమ్మత్తు, శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనం రోజుకు ఎన్ని విటమిన్లు తీసుకోవాలి? WHO విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సమతుల్య ఆహారం ద్వారా చాలా వరకు విటమిన్ల అవసరాలు తీర్చుకోవచ్చు. కానీ ఆహారం సరిగ్గా లేకపోతే లేదా ఆరోగ్య పరిస్థితి ప్రత్యేకంగా ఉంటే విటమిన్ల లోపం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితిలో అవసరానికి అనుగుణంగా సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

ఒక వ్యక్తికి ఒక రోజులో ఎన్ని విటమిన్లు అవసరమనేది అది వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. WHO, ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. పెద్దలకు ప్రతిరోజూ 10 మైక్రోగ్రాముల విటమిన్ D అవసరం. ఇది ఎముకలు, రోగనిరోధక వ్యవస్థకు అవసరం. తరువాత విటమిన్ A వస్తుంది. మహిళలకు రోజుకు కనీసం 600 మైక్రోగ్రాములు, పురుషులకు 700 మైక్రోగ్రాములు ఉండాలి. ఇది కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ E రోజుకు దాదాపు 10 మిల్లీగ్రాములు తీసుకోవాలి. ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

విటమిన్ K విషయానికి వస్తే.. మహిళలు రోజుకు 90 మైక్రోగ్రాములు, పురుషులు 120 మైక్రోగ్రాముల వరకు తీసుకోవాలి. విటమిన్ B6 మోతాదు దాదాపు 1.6 నుంచి 1.8 మిల్లీగ్రాములు, విటమిన్ B2 (రైబోఫ్లేవిన్) రోజుకు దాదాపు 1.6 నుంచి 2.0 మిల్లీగ్రాములు తీసుకోవాలి.

దీని కంటే ఎక్కువ విటమిన్లు తీసుకోవచ్చా?

WHO ప్రకారం.. కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K వంటివి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవి శరీరంలో పేరుకుపోతాయి. అది ఆరోగ్యానికి హానికరం. దీని మోతాదును భర్తీ చేయడానికి ఆకుకూరలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి వ్యాధులు లేకుండా.. విటమిన్ల లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget