అన్వేషించండి

Does Sunscreen Block Vitamin D : సన్​స్క్రీన్ అప్లై చేస్తే శరీరంలో విటమిన్ డి తగ్గుతుందా? షాకింగ్, ఇంట్రెస్టింగ్ విషయాలివే 

Vitamin D Deficiency from Sunscreen : మీకు సన్​స్క్రీన్ అప్లై చేసే అలవాటు ఉందా? అయితే మీలో విటమిన్ డి తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Sunscreen Affects Vitamin D : చర్మ సంరక్షణలో భాగంగా మగవారు, ఆడవారు కూడా సన్​స్క్రీన్​ని అప్లై చేస్తూ ఉంటారు. ఇది స్కిన్​ని డ్యామేజ్ కాకుండా రక్షణ అందిస్తుంది. సన్​బర్న్, వృద్ధాప్యఛాయలు, ముడతలు, స్కిన్ క్యాన్సర్ వంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని ఎక్కువమంది ఉపయోగిస్తారు. మేకప్​ ఉపయోగించనివారు కూడా దీనిని వినియోగిస్తారు. అయితే ఈ సన్​స్క్రీన్​లు సూర్యకిరణాల ప్రభావాన్ని అడ్డుకోవడంతో పాటు విటమిన్ డిని కూడా శరీరానికి అందకుండా చేస్తుందా?

విటమిన్ డి ఎందుకు ముఖ్యమంటే.. 

విటమిన్ డి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యంతో పాటు, దంత సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాల్షియాన్ని శరీరం తీసుకునేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. మూడ్ స్వింగ్స్​ని కంట్రోల్ చేస్తుంది. అయితే మిగిలిన విటమిన్స్ అన్నింటిని ఫుడ్ నుంచి అందుకోవచ్చు. కానీ విటమిన్ డి ఫుడ్ సోర్స్​లు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో పొందాలంటే సూర్యరశ్మినే అవసరం. అయితే చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే సన్​స్క్రీన్ ఈ విటమిన్ డిని కూడా అడ్డుకుంటుందా? అసలు సన్​స్క్రీన్ ఎలా పని చేస్తుంది? వంటి విషయాలు చూసేద్దాం.

సన్​స్క్రీన్ ఎలా పని చేస్తుందంటే.. 

సన్​స్క్రీన్​లు చర్మానికి హాని చేసే UV కిరణాలను నిరోధించడానికి హెల్ప్ చేస్తాయి. చర్మం విటమిన్ డిని తయారు చేయడానికి హెల్ప్ చేసే UVB కిరణాలను కూడా ఉంటాయి.. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. అదేంటంటే సాధారణంగా సన్​స్క్రీన్​లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఎక్కువగా ఉంటే చర్మానికి చాలా మంచిది. అందుకే చాలామంది SPF ఎక్కువగా ఉండే సన్​స్క్రీన్​ని ఎంచుకుంటారు. కానీ సమస్య ఏంటి అంటే.. SPF ఎంత ఎక్కువగా ఉంటే.. అది UVB కిరణాలను చర్మం తీసుకునే అవకాశం తగ్గుతుంది.

SPF 30 సన్​స్క్రీన్ ఉపయోగిస్తే చర్మం విటమిన్ డిని తీసుకునే అవకాశం 97 శాతం ఉంటుంది. అదే  SPF 50 అప్లై చేస్తే 98 శాతం. దీని ప్రకారం సన్​స్క్రీన్ నిజంగానే విటమిన్​ డిని నిరోధిస్తుంది. కానీ 100 శాతం కాదు. విటమిన్ డి ఉత్పత్తిని పెంచే UVB కిరణాలను తగ్గిస్తుంది. దీనివల్ల విటమిన్ డి శరీరానికి అందడం తగ్గుతుంది. 

నిపుణులు ఏమి చెప్తున్నారంటే.. 

సన్​స్క్రీన్ వాడడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడదని  పలువురు డెర్మటాలజిస్ట్​లు చెప్తున్నారు. ఎందుకంటే కొందరు సన్​స్క్రీన్​ను సరిగ్గా అప్లై చేయరని లేదా UVB కిరణాలను నిరోధించేంత ఎక్కువ సార్లు మళ్లీ అప్లై చేయరు కాబట్టి.. శరీరానికి కొంత విటమిన్ డి లభిస్తుందని చెప్తున్నారు. చాలామంది ముఖానికి, చేతులకు మాత్రమే సన్​స్క్రీన్ అప్లై చేస్తారని.. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. రోజూ కాసేపు ఎండలో ఉంటూ.. మంచి ఫుడ్, సప్లిమెంట్ల ద్వారా శరీరానికి తగినంత విటమిన్ డిని పొందవచ్చని చెప్తున్నారు. 

విటమిన్ డి కోసం సన్​స్క్రీన్ మానేయాలా?

విటమిన్ డి కోసం సన్​స్క్రీన్ మానేయాలా అంటే అస్సలు మానవద్దని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ డి కంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదమే ఎక్కువని అంటున్నారు. కాబట్టి సన్​స్క్రీన్ ఉపయోగించడం మానవద్దని చెప్తున్నారు.

విటమిన్ డి కోసం ఏమి చేయాలంటే.. 

వారంలో కొన్ని రోజులు సన్​స్క్రీన్ లేకుండా 10 నుంచి 20 నిమిషాలు టైమ్ స్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. విటమిన్ డి కోసం గుడ్లు, మష్రూమ్స్, ఫ్యాటీ ఫిష్ డైట్​లో చేర్చుకోవాలంటున్నారు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వైద్యుల సహాయంతో తీసుకోవచ్చు. కాబట్టి సన్​స్క్రీన్ స్కిప్ చేయకుండా విటమిన్ డి కోసం వీటిని ఫాలో అయిపోవాలని సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Soaked Figs Benefits : ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget