Mother Saves Child: సూపర్ మదర్ - లారీ కింద పడబోయిన కొడుకు కోసం ఆ తల్లి ఏం చేసిందో చూడండి
ఓ రోడ్డు ప్రమాదంలో పసివాడు లారీ చక్రాల కిందకు పడబోయాడు. కానీ, తల్లి సూపర్ ఉమెన్‌లా మెరుపు వేగంతో స్పందించింది. తన ప్రాణాల గురించి ఆలోచించకుండా తన బిడ్డను రక్షించింది.
తల్లి ప్రేమ అనంతం. తల్లి తన బిడ్డపై చూపించే ప్రేమను మాటల్లో వర్ణించలేం. పిల్లలే లోకంగా బతికే ఆమె.. వారికి ఏం జరిగినా తట్టుకోలేదు. అలాంటిది కన్న బిడ్డ కళ్ల ముందే ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోగలదా? ఈ మహిళా అదే చేసింది. ప్రమాదంలోనూ మెరుపు వేగంతో స్పందించింది. లారీ కిందకు వెళ్లిపోతున్న కొడుకును రక్షించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి తన భార్య బిడ్డను బైకు మీద తీసుకెళ్తున్నాడు. బైకుకు అటూ ఇటూ లగేజీని వేలాడదీశాడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో బైకుకు ఉన్న లగేజీ కారుకు తగిలింది. దీంతో ఆ బైకు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారే బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బైకు వెనకాల కూర్చున్న తల్లి, బిడ్డ రోడ్డు మీద పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ పెద్ద ట్రక్కు వచ్చింది. ఆ తల్లి చేతిలోని బిడ్డ దాదాపు లారీ చక్రాల కింద నలిగిపోయేవాడే. కానీ, ఆ తల్లి మెరుపు కంటే వేగంగా స్పందించింది. బిడ్డను తన వైపుకు లాగిసింది. కొన్ని ఇంచుల తేడాతో ‘మృత్యువు’ తప్పింది. ఈ ఘటన 2019లో చోటుచేసుకుంది.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
ఓ ట్విట్టర్ యూజర్ మరోసారి తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ ఆశ్చర్యపోయాడు. ఆ వీడియోను రీట్వీట్ చేసుకుని ‘మదర్ ఆఫ్ ది ఇయర్’ అని ఆమెకు కితాబిచ్చాడు. దీంతో ఆయన అభిమానులు కూడా ఈ ట్వీట్‌ను షేర్ చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఆ తల్లి ప్రేమకు ఫిదా అవుతున్నారు. ఆ క్షణాల్లో ఆమె తన ప్రాణాల గురించి ఆలోచించకుండా బిడ్డను రక్షించడం నిజంగా అద్భుతమని అని అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె తన గురించి కాకుండా బిడ్డ గురించే ఆలోచించిందని, తల్లి ప్రేమకు ఇది నిదర్శన మని అంటున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 4.9 మిలియన్ మంది వీక్షించారు. 33 వేల మంది రీట్వీట్ చేసుకున్నారు. ఈ వీడియో చూసేందుకు భయానకంగానే ఉంటుంది. కానీ, చూసిన తర్వాత ‘‘హమ్మయ్య, ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు’’ అనే ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో
ఇదే ఆ వైరల్ వీడియో:
Mother of the year https://t.co/qIZlz1PYEZ
— Jofra Archer (@JofraArcher) April 25, 2022